
కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ బుల్లితెర నటి నవ్య స్వామి ఎట్టకేలకు మహమ్మారి నుంచి కోలుకున్నారు. తన క్వారంటైన్ గడువు కూడా ముగిసిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు శనివారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు వీడియో సందేశం ఇచ్చారు. "నా క్వారంటైన్ ముగిసింది. ముందుకన్నా ఇప్పుడు బాగానే ఉన్నాను. మా తల్లిదండ్రుల ప్రార్థనలు, మీ ప్రేమాభిమానాల వల్ల కరోనాను జయించాను. మీ మద్దతు లేకపోయుంటే ఈ ప్రయాణం పూర్తయ్యేదే కాదు. నా కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతం పరిస్థితులు అస్సలు బాగోలేవు. దయ చేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. కరోనాను నయం చేయవచ్చు. కానీ చికిత్స కన్నా నివారణ మేలు అన్న విషయం గుర్తుంచుకోండి" అని మరీమరీ చెప్పుకొచ్చారు. (మరో ఏడాది థియేటర్లు ఉండవు)
వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శారీరక పోరాటం కన్నా మానసిక పోరాటమే ఎక్కువ అని గ్రహించానని తెలిపారు. అందుకే మరింత శక్తి కూడదీసుకుని పోరాడానని పేర్కొన్నారు. మా ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్లు ప్రతి ఒక్కరూ.. మా ఇంటికి దూరంగా ఉండండి అని చెప్తుంటే బాధగానే ఉందన్నారు. కరోనా కన్నా కూడా ఇదే మరింత బాధిస్తుందని పేర్కొన్నారు. కాగా గత నెల 30న నవ్యకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఆమె సహనటుడు రవికృష్ణకు సైతం కరోనా సోకగా వారం క్రితమే కోలుకున్నాడు. (ఆ లవ్ లెటర్‌ను దాచుకున్నా: కీర్తి సురేష్)
Comments
Please login to add a commentAdd a comment