Ravi Krishna
-
సినిమాల్లోకి రావడం ఇంట్లో ఇష్టం లేదు.. మాస్క్ వేసుకొని తిరుగుతున్నా: డైరెక్టర్
‘నా ఫ్యామిలీలో ఎవరికి సినీ పరిశ్రమలోకి నేను వెళ్లడం ఇష్టంలేదు. నేను అమెరికా నుంచి వచ్చిన సంగతి కూడా తెలియదు. వాళ్లను బాధ పెట్టడం ఇష్టం లేక నేను నా పేరును విస్కీగా మార్చుకున్నాను. నా ఫేస్ కనిపించకుండా మాస్క్ వేసుకుని తిరుగుతున్నాను’అన్నారు యంగ్ డైరెక్టర్ విస్కీ. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ది బర్త్‌డే బాయ్'. రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ విస్కీ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా జీవితంలో జరిగిన రియల్‌స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాను. ఈ కథలో 80 శాతం వాస్తవ సన్నివేశాలు, 20 శాతం ఫిక్షన్ ఉంటుంది. అయితే ఫిక్షన్ కూడా నా లైఫ్‌లో వేరే సందర్బంలో జరిగిన సన్నివేశాలు యాడ్ చేశాను.బర్త్‌డే బంప్స్ వల్ల ఒక స్నేహితుడు ఎలా చనిపోయాడు.. ఆ తరువాత జరిగిందేమిటి అనేది ఎంతో ఉత్కఠభరితంగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ అన్ని రకాల ఎమోషన్స్ ఫీలవుతారు’ అన్నారు.నిర్మాత భరత్ మాట్లాడుతూ ' కథే ఈ సినిమా చేయడానికి రీజన్, నేను దర్శకుడు ఇద్దరం యూఎస్‌లో వుండేవాళ్లం. ఒకసారి తన లైఫ్‌లో జరిగిన ఈ సంఘటన నాకు చెప్పి సినిమా తీద్దాం అన్నాడు. అతను ఈ రియల్ కథ చెప్పగానే నేను ప్రొడ్యూస్ చేయాలని అనిపించింది. ఈ కథన నేను ఎమోషన్‌గానే ఫీల్ అయి చేస్తున్నాను.. ఇందులో మేసేజ్ ఏమీ లేదు. జరిగిన సంఘటన చూపించి.. దీని వల్ల లైఫ్‌లు ఎలా పోయాయి అనేది చూపిస్తున్నాం’ అన్నారు. -
ఈ రియల్ ఇన్సిడెంట్ ని తీయడానికి రీజన్ ఏంటి..?
-
నా నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్స్ ఇవే
-
పుష్ప 2 మూవీలో ఛాన్స్ వదిలేసుకున్నా: రవి కృష్ణ
మనుషుల మధ్య ప్రేమ ఎప్పుడూ ఉండేదే! అదే దెయ్యాన్ని ప్రేమిస్తే.. దెయ్యాన్ని చూస్తే భయపడతారు కానీ ఎవరైనా ప్రేమిస్తారా? అంటారేమో! ఈ సినిమాలో అంతే.. హీరో ఆశిష్ ఘోస్ట్‌తో లవ్‌లో పడతాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ మూవీ లవ్ మీ. ఇఫ్ యూ డేర్ అనేది క్యాప్షన్. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ఈవెంట్లో నటుడు రవికృష్ణ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.'లవ్ మీ సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు నాకు పుష్ప 2లో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ డేట్స్ క్లాష్ అవడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. అంత పెద్ద సినిమా మిస్ చేసుకున్నప్పటికీ ఈ మూవీ నాకొక మైల్ స్టోన్‌గా ఉండిపోతుందన్న నమ్మకముంది. నన్ను నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్' అని పేర్కొన్నాడు. లవ్ మీ సినిమా మే 25న విడుదల కానుంది. చదవండి: పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్ -
ఎంతటివారైనా వదిలిపెట్టం: కర్నూలు ఎస్పీ
-
ఎంతటివారైనా వదిలిపెట్టం: కర్నూలు ఎస్పీ
కర్నూలు: పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేపట్టామని కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ తెలిపారు. హంతకులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. నారాయణ రెడ్డి హత్యకు గురైన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. క్రిందిస్థాయి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో జిల్లావ్యాప్తంగా పోలీసు గస్తీని పెంచామని అయినా ఈ సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. కాగా, నారాయణరెడ్డిని కిరాతకంగా హత్య చేసిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని నారాయణరెడ్డి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని, ఆయన తగిన రక్షణ కల్పించకపోవడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆయనకు తగిన భద్రత కల్పించివుంటే ఈ దారుణం జరిగివుండేది కాదని అంటున్నారు. -
కప్పట్రాళ్ల రూపు రేఖలు మార్చేస్తా
కప్పట్రాళ్ల(ఆలూరు రూరల్): రాష్ట్రంలోనే కక్ష్యల కుంపటిగా మారిన కప్పట్రాళ్ల రూపురేఖలు మార్చడమే తన లక్ష్యమని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. దత్తత గ్రామంలో ఆదివారం ఆయన ఐదు గంటల పాటు పర్యటించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు లేని గ్రామంగా కప్పట్రాళ్లను తీర్చిదిద్దేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని వారితో ఎస్పీ చెప్పారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్షణికావేశంలో జరిగిన వివిధ సంఘటనలతో కప్పట్రాళ్ల గ్రామం ఫ్యాక్షన్‌గా పేరుగాంచిందన్నారు. ఈ ఫ్యాక్షన్ కక్ష్యలకు ఎంతోమంది అమాయకులు బలయ్యారని చెప్పారు. ప్రతిక్షణం గ్రామ ప్రజలు భయాందోళన మధ్య జీవనం సాగించారని, మున్ముందు అలాంటి వాతావరణం చోటు చేసుకోకుండా ఈ గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామంలో పిల్లల విద్యాభివృద్ధికి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు కూడా ఐక్యతతో కలిసిమెలిసి గ్రామాభివృద్ధికి నడుం బిగింలించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన ఫ్యాక్షన్ కక్ష్యలకు బలైన కుటుంబ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మున్ముందు కక్ష్యలను విడనాడి శాంతియుత వాతావరణంలో జీవించాలని కోరారు. గ్రామంలో త్వరలో రహస్యంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు, అల్లర్లకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అవసరమైతే వారిపై కేసులు నమోదు చేసి గ్రామ ప్రశాంతతను నెలకొల్పేందుకు తమవంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. గ్రామంలో ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్పీ వెంట డోన్ డీయస్పీ పీఎన్ బాబు, పత్తికొండ సీఐ గంటా సుబ్బారావు, దేవనకొండ ఎస్ఐ మోహన్‌కిషోర్ తదితరులు ఉన్నారు. ఫ్యాక్షన్ గ్రామాన్ని దత్తతకు తీసుకున్న ఎస్పీ ఆకె రవికృష్ణను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. -
మున్సిపల్ కేసులన్నీ సీబీ సీఐడీకి?
రంగం సిద్ధం చేసిన పోలీసులు నంద్యాలటౌన్: నంద్యాల మున్సిపాలిటీలో జరిగిన ఆస్తి పన్నుల కుంభకోణం, రికార్డుల గది దగ్ధం, మినీట్స్ బుక్ అదృశ్యం కేసులను సీబీ సీఐడీకి అప్పగించాలని పోలీసులు నిర్ణయించారు. మహా శివరాత్రి వేడుకలు పూర్తయ్యాక జిల్లా ఎస్పీ రవికృష్ణ ద్వారా వీటిని బదిలీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. గత ఏడాది జూలై 11న మున్సిపల్ కార్యాలయంలోని రికార్డుల గది అగ్ని ప్రమాదానికి గురైంది. సిబ్బంది అవినీతి వెలుగులోకి రాకుండా నివారించడానికి గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల గదిని తగలబెట్టినట్లు ఆరోపణలు వినిపించాయి. అధికారులు ఒక చిరుద్యోగి సస్పెండ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. స్పెషల్ ఆఫీసర్ పాలనలో చేసిన తీర్మానాలకు సంబంధించిన కీలక మినీట్స్ బుక్ గత ఏడాది జూన్‌లో అదృశ్యమైంది. దీనికి సంబంధించి ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. ఇప్పటికీ మినీట్స్ బుక్ ఆచూకీ లేదు. గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన ఆడిటింగ్‌లో రెవెన్యూ సెక్షన్లో ఆస్తి పన్నులకు సంబంధించి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై 13 మంది ఉద్యోగులను మున్సిపల్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు అప్పటి కమిషనర్ రామచంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 13 మంది ఉద్యోగులపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసు విచారణ ఇప్పటి వరకు ముందుకు సాగడం లేదు. పోలీసులు కేసు విచారణ చేపడితే 300 మంది ఆస్తి పన్నుల యజమానులను విచారించాల్సి ఉంది. విచారణలో మరో 300 మంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం పనిభారం అధికంగా ఉన్నందున ఈ కేసుల విచారణ ముందుకు సాగడం లేదు. దీంతో వీటి విచారణ బాధ్యతలను సీబీ సీఐడీకి బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు. -
విఐపి రిపోర్టర్ - కర్నూలు ఎస్పీ రవికృష్ణ
-
నేరాలపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ముప్పై మూడు రోజుల క్రితం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రవికృష్ణ శాంతిభద్రతలపై దృష్టిపెట్టారు. నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం కర్నూలులో మొదటిసారి నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలు సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఎస్పీ రవికృష్ణ ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. ఆ వివరాలిలా.. సాక్షి: జిల్లా అంతటా పర్యటించినట్లున్నారు? ఎస్పీ: ఇంకా కొన్ని గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. సాక్షి: జిల్లాలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి? ఎస్పీ: ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి. సాక్షి: ఫ్యాక్షన్ గ్రామాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ: గతంలో 81 గ్రామాల్లో ఫ్యాక్షన్ ఉండేది. ప్రస్తుతం లేదు. అయినా గ్రామస్తులకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టాం. పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. అదే విధంగా సీసీఎస్‌ను పటిష్టపరిచి నేరాలు, అసాంఘిక కార్యక్రమాలను అణచివేస్తాం. సాక్షి: బహిరంగ ప్రదేశాల్లో కొందరు విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ.. చుట్టుపక్కల ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు? ఎస్పీ: ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులు స్పందించి నా దృష్టికి తీసుకొస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అసాంఘిక కార్యక్రమాలు జరక్కుండా సీసీఎస్‌ను అలర్ట్ చేశాం. సాక్షి: కర్నూలు నగరంలో ట్రాఫిక్ ఎక్కువైంది. ట్రాఫిక్ నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్పీ: ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు చేపట్టాం. వాహనదారులు, ఆటోవాలాలకు ట్రాఫిక్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయంచాం. సాక్షి: మావోల కదలికలు ఎలా ఉన్నాయి? ఎస్పీ: జిల్లాలో మావోల కదలికలు లేవు. అయినా ప్రత్యేక నిఘా పెట్టాం. సాక్షి: సాయిఈశ్వరుడి హత్య కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? ఎస్పీ: ప్రత్యేక టీ మ్ను ఏర్పాటు చేశాం. త్వరలో సాయి ఈశ్వరుడిని హత్య కేసులో నిందితులను పట్టుకుంటాం. సాక్షి: మీపై ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? ఎస్పీ: అలాంటివేమీ లేవు. -
కొత్త ఎస్పీ రవికృష్ణ
కర్నూలు: కర్నూలు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) రఘురామిరెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసాధికారులకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. కొత్త నియామకాలకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా ఎస్పీగా రవికృష్ణను నియమించింది. 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రవికృష్ణ ముఖ్యమంత్రి భద్రతా విభాగం ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం శాఖా పరమైన శిక్షణలో భాగంగా జైపూర్‌లో ఉంటున్నారు. పది రోజుల్లో శిక్షణ పూర్తి కానుంది. ఆ తర్వాత ఆయన కర్నూలులో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈయన అదే జిల్లాలోని చింతపల్లి ఏఎస్పీగా మొదట విధుల్లో చేరారు. 2011లో ఎస్పీగా పదోన్నతి పొందారు. శ్రీకాకుళంలో పని చేసేటప్పుడు మావోయిస్టులను జన జీవన స్రవంతిలోకి రప్పించడానికి ‘అమ్మ పిలుపు’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా కూడా పని చేశారు. ట్రాఫిక్ విధుల్లో పని చేసే సిబ్బంది నిజాయతీగా ఉండాలని, అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేయించారు. అలాగే వాహనాల్లో తల్లిదండ్రులు బయటికి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ‘నాన్న కోసం’ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. 2011 నుంచి జూలై 2013 వరకు గుంటూరు అర్బన్ ఎస్పీగా సేవలందించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ అనాధలు, ఆపరేషన్ వీధి బాలలు, బాధితులకు భరోస, ఆపరేషన్ యాచకులు వంటి సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. వీధుల్లో ఉంటున్న యాచకులు, బాలల కోసం పునరావాసం కల్పించడం రాత్రి వేళల్లో పడుకోవడానికి ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేయించడం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. సొంత శాఖలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని ఈయనకు పేరుంది.