
సత్యను దేవుడమ్మ ఇంట్లొంచి గెంటేస్తుంది. రుక్మిణి ఎంత బతిమాలినా దేవుడమ్మ కరగదు. ఇక తనకు న్యాయం జరిగేవరకు ఆ ఇంట్లోనే ఉంటానని కనకం దేవుడమ్మకి చెప్తుంది. ఇక సత్య-నందాల విషయం ఇంత వరకు పసిగట్టలేకపోయిన ఆదిత్యను తిట్టిన దేవుడమ్మ అతడి అసమర్థను ఎత్తిచూపుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే18న 236వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..
సత్యను దేవుడమ్మ ఇంట్లోంచి గెంటేస్తుంది. అనుకోని పరిణామంతో షాక్ అయిన రుక్మిణి సత్యను ఇంట్లోంచి పంపించొద్దని దేవుడమ్మను వేడుకుంటుంది. అయినా సరే దేవుడమ్మ కరగదు సరి కదా ఇలానే చేస్తు నువ్వు కూడా ఇంటి బయట ఉంటావ్ అంటూ రుక్మిణిని హెచ్చరిస్తుంది. ఇక సత్య-నందాలు చేసిన తప్పుతో ఇంట్లోంచి రెండు శవాలు వెళ్లిపోయాయని, అందరూ తలంటు స్నానం చేయాలని ఇంట్లో వాళ్లని ఆదేశిస్తుంది దేవుడమ్మ.
సీన్‌కట్ చేస్తే తనకు జరిగిన అన్యాయానికి ఏం న్యాయం చెబుతావంటూ కనకం దేవుడమ్మను ప్రశ్నిస్తుంది. తనకు న్యాయం జరిగేంత వరకు ఈ ఇంట్లోనే ఉంటానని చెప్తుంది. ఇక సత్యను ఇంట్లోంచి పంపించడం పట్ల రుక్మిణి చాలా బాధపడుతుంది. ఎలా అయినా దేవుడమ్మను క్షమించమని చెప్పమని రుక్మిణి ఆదిత్యను కోరుతుంది. అయితే సత్య పేరు ఎత్తగానే దేవుడమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇద్దరూ తనతో పాటే కలిసి చదువుకున్నా వాళ్ల మానసిక స్థితి ఏంటో తెలుసుకోలేకపోవడం నీ అసమర్థత అంటూ ఆదిత్య లోపాలను ఎత్తిచూపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment