
సత్య గురించి కంగారు పడుతున్న రుక్మిణిని కనకం ఓదారుస్తుంది. సత్యకి ఏమీ కాదంటూ ధైర్యం చెప్తుంది. మరోవైపు సత్యను వెతకడానికి ఆదిత్య వెళ్తాడు. సత్యను ఒప్పించి వాళ్లింటో దిగబెడతాడు. ఇక సత్యను చూసి భాగ్యమ్మ సంతోషడినా దేవుడమ్మ చేసిన పనికి మాత్రం అసహనం వ్యక్తం చేస్తుంది. తన బిడ్డను అవమానించారంటూ బాధపడుతుంది. దేవుడమ్మని దేవతలా కొలిచామని, అలాంటిది తమకు ఇంత అన్యాయం చేస్తారా అంటూ ఆదిత్యను నిలదీస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలతో దేవత సీరియల్ మే21న 239వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..
సత్య గురించి రుక్మిణి కంగారు పడుతుంటుంది. తన చెల్లి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని మధనపడుతుండగా కనకం వచ్చి రుక్మిణికి ధైర్యం చెప్తుంది. ఇక సత్యను ఒప్పించి వాళ్లింటికి తీసుకెళ్తాడు ఆదిత్య. సత్యను చూడగానే భాగ్యమ్మ సంతోషపడుతుంది. కూతుర్ని దగ్గరకు తీసుకుంటుంది. మరోవైపు సత్యను ఇంతలా అవమానం చేసిన దేవుడమ్మపై గుర్రుమంటుంది భాగ్యమ్మ. ఎందుకు ఎంత పెద్ద శిక్ష వేశారంటూ ఆదిత్యను నిలదీస్తుంది.
ఆ ఇంటికి తీసుకెళ్తా అని దేవుడమ్మే తన కూతుర్ని తీసుకెళ్లిందని, ఇప్పుడు ఇంట్లోంచి గెంటేసిందంని భాదపడుతుంది. ఇక దేవుడమ్మ చేసిన పనికి ఆదిత్య తన వైపు నుంచి భాగ్యమ్మను క్షమాపణ కోరతాడు. సీన్ కట్ చేస్తే సత్యను సేఫ్‌గా ఇంట్లో దిగబెట్టి వచ్చనని ఆదిత్య రుక్మిణితో చెప్తుండగా దేవుడమ్మ అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. సత్యను వెతకడానికి ఎందుకు వెళ్లావంటూ ఆదిత్యపై మండిపడుతుంది. ఇంకా సత్యపై జాలి చూపించాల్సిన అవసరం ఏముందంటౌ ఆదిత్యపై విరుచుకుపడుతుంది. మరి దేవుడమ్మ ప్రశ్నలకు ఆదిత్య ఏం సమాధానం చెప్తాడో తర్వాతి ఎపిసోడ్‌లో తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment