
రుక్మిణి సహాయంతో దేవుడమ్మ ఇంట్లోకి వెళ్లాలని సత్య పథకం పన్నుతుంది. ఇందుకోసం భాగ్యమ్మ వద్ద మొసలి కన్నీళ్లు కారుస్తుంది. త్వరలోనే తన ప్లాన్ సక్సెస్ కానుందని సంతోషపడిపోతుంటుంది. మరోవైపు ఆదిత్యపై కోపంతో రగిలిపోయిన నందా సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఆదిత్యే అన్న నిజాన్ని కనకంతో చెప్పేస్తాడు. మరి నిజం తెలిసిన కనకం ఏం చేస్తుంది? ఆదిత్య-సత్యల విషయం అందరికి తెలిసిపోతుందా? లాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్ మే28న 245వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..
రుక్మిణిని అడ్డు పెట్టుకొని ఎలా అయినా దేవుడమ్మ ఇంట్లోకి ప్రేవేశించాలని సత్య పథకం పన్నుతుంది. ఇందుకు తగ్గట్లుగానే భాగ్యమ్మతో తన జీవితం ఇలా అయ్యిందంటూ నటిస్తూ కన్నీళ్లు కారుస్తుంది. ఇది చూసిన భాగ్యమ్మ చలించినపోయి రుక్మిణికి ఫోన్ చేసి సత్య పరిస్థితి గురించి చెబుతుంది. ఇలానే వదిలేస్తే సత్య మనకు బతకదని బాధపడుతుంది. భాగ్యమ్మ మాట్లాడుతుండటాన్ని గమనించిన సత్య త్వరలోనే ప్లాన్ సక్సెస్ అవుతుందని సంబరపడిపోతుంటుంది. మరోవైపు సత్యను ఎలా అయినా ఇంటికి తీసుకురావాలని రుక్మిణి ఆదిత్యను బతిమాలుతుంది. దేవుడమ్మను ఒప్పించే బాధ్యత నీదేనని చెప్పి ఆదిత్య కాళ్లు పట్టుకుంటుంది.
సీన్ కట్ చేస్తే తనను కొట్టినందుకు ఆదిత్యపై నందా పగతో రగిలిపోతాడు. ఆదిత్య-సత్యల బండారం బయటపెట్టి ఆ ఇంట్లో చిచ్చు పెట్టాలని నిర్ణయించుకుంటాడు. కనకంకు ఫోన్ చేసి సత్య కడపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఆదిత్యే అన్న నిజాన్ని చెప్పేస్తాడు. దీంతో షాకైన కనకం ఆదిత్య ఇంత కథ నడిపించాడా అని ఆశ్చర్యపోతుంది. దీన్నే అస్త్రంగా మార్చుకొని దేవుడమ్మపై తాను పెత్తనం చెలాయించాలని భావిస్తుంది. సీన్ కట్ చేస్తే ఆదిత్యకు నందా ఫోన్ చేస్తాడు. మీ ఇంట్లో ఒకరికి నిజం చెప్పేసానని, ఇక రుక్మిణికి నిజం తెలియకుండా జాగ్రత్త పడమని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దీంతో ఈ నిజాన్ని నందా ఎవరికి చెప్పాడో తెలియక ఆదిత్య కంగారుపడతాడు. ఆదిత్య గురించి కనకం అందరికి చెప్పేస్తుందా? దేవుడమ్మకు ఈ నిజం తెలియనుందా అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment