రుక్మిణికి నిజం తెలిసిందని ఆదిత్య చెప్పడంతో సత్య షాకవుతుంది. ఇలా ఎందుకు చేశావంటూ ఆదిత్యపై కోప్పడుతుంది. సీన్ కట్ చేస్తే సత్య ఆదిత్యను ఏదో తిడుతున్నట్లు కనిపించిందని కనకం పసిగడుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడా అంటూ ఆదిత్యను రెచ్చగొడుతుంది. మరోవైపు సత్యను చూసిన రుక్మిణి ఆమె చెంప పగలకొడుతుంది. ఇలాంటి త్యాగం చేసి ఎవరిని ఉద్దరించాలనుకున్నావ్ అంటూ సత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పట్నుంచి నేను చేసే పనికి ఎందుకు, ఏమిటీ అడగకుండా ఉండాలని తను చెప్పిందే వినాలని సత్యచేత ప్రమాణం చేయించుకుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 15న 260వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..
దేవత జూన్15వ ఎపిసోడ్ : రుక్మిణి ఇంకా ఇంటికి రాకపోవడంతో ఏం జరిగిందంటూ సత్య ఆదిత్యను నిలదీస్తుంది. రుక్మిణి ఒంటిరిగా ఎక్కడికి వెళ్లిందంటూ ప్రశ్నిస్తుంది. దీంతో మన మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పేశానని ఆదిత్య చెప్పడంతో సత్య షాకవుతుంది. నిజం ఎందుకు చెప్పావంటూ కోప్పడుతుంది. ఇన్ని రోజులుఘేది జరగకూడదని అనుకున్నానో అదే జరిగిందని బాధపడుతుంది. రుక్మిణిని వెతికేందుకు వెళ్తుంది. ఇక ఆదిత్య పడుతున్న టెన్షన్ చూసి ఏం జరిగిందని కనకం ప్రశ్నిస్తుంది. ఆదిత్యను రెచ్చగొడుతూ మాట్లాడటంతో అతడు కనకంపై సీరియస్ అవుతాడు.
సీన్ కట్ చేస్తే..రుక్మిణి సత్యకు కనిపించిన వెంటనే సత్య చెంప పగలకొడుతుంది. త్యాగం ఎప్పుడైనా ఒకరికి మంచికి ఉపయోగపడాలే తప్పా నాశనానికి కాదు అని హితవు పలుకుతుంది. దగ్గరుండి తన పెళ్లి చేసి ఇంత తప్పు ఇలా చేశావని నిలదీస్తుంది. అయితే చిన్నప్పటి నుంచి తనకు అన్నీ ఇచ్చిన నీకు నువ్వు కోరుకున్నది ఇవ్వాలనుకున్నాను..అందుకే ఇలా చేశాను అక్కా అని సత్య బదులిస్తుంది. ఇక ఇప్పట్నుంచి తాను చెప్పింది వినాలని, దేవుడమ్మ ఇంట్లోనే ఉండాలని సత్యతో ప్రమాణం తీసుకుంటుంది. సీన్ కట్‌చేస్తే తను చేసిన తప్పుకు క్షమించమని ఆదిత్య రుక్మిణిని కోరుతాడు. ఈ నిజం దేవుడమ్మకు తెలిస్తే తట్టుకోలేదని, తన తల్లి ముందు తనను దోషిగా నిలబెట్టవద్దని ప్రాథేయపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment