Devatha : తల్లి కాబోతున్న రుక్మిణి.. బాధలో సత్య | Devatha Serial : Satya Panics As She Fears About Rukhmini | Sakshi
Sakshi News home page

Devatha : తల్లి కాబోతున్న రుక్మిణి.. బాధలో సత్య

Published Mon, Jun 7 2021 2:59 PM | Last Updated on Mon, Jun 7 2021 3:22 PM

Devatha Serial : Satya Panics As She Fears About  Rukhmini - Sakshi

రాధా-కృష్ణుల బొమ్మపై నిజం తెలిసేవరకు తాను గర్భవతి అన్న విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని రుక్మిణి నిర్ణయించుకుంటుంది. ఆ బొమ్మ సత్యే ఆదిత్యకు ఇచ్చిందని రుక్మిణి బలంగా నమ్ముతుంది. కానీ సత్య-ఆదిత్యలకు ఏ సంబంధం ఉండకూడదని కోరుకుంటుంది. తన చెల్లెలు సత్య జీవితం బాగుండాలని ఆశిస్తుంది. మరోవైపు రుక్మిణి పడుతున్న వేదనను చూసి సత్య కంగారుపడుతుంది. తమ గురించి నిజం తెలిస్తే రుక్మిణి బతకదని ఆదిత్యకు చెబుతుంది. సీన్‌ కట్‌చేస్తే సత్య-రుక్మిణిల గురించి కమల బాధపడుతుంది. వాళ్లిద్దరి జీవితాలు నాశనం అవుతాయేమో అని కంగారుపడుతుంది. మరోవైపు తనను క్షమించమని సత్య రుక్మిణిని కోరుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్‌ జూన్‌7న 253వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

దేవత జూన్‌ 7 : సత్యకు ఇచ్చిన రాధా-కృష్ణుల బొమ్మ చూసి రుక్మిణి మనసులో అనేక సందేహాలు కలుగుతాయి. ఆ బొమ్మ గురించి ఏం అడిగినా ఇద్దరూ ఒకేలా సమాధానం చెబుతుండటంతో రుక్మిణికి మరింత అనుమానం కలుగుతుంది. ఈ బొమ్మ సంగతి తేలే వరకు తాను గర్భవతి అన్న నిజాన్ని బయటపెట్టకూడదని రుక్మిణి నిర్ణయించుకుంటుంది. మరోవైపు రుక్మిణి ఆరోగ్య పరిస్థితి చూసి సత్య బాధపడుతుంది. ఆదిత్యకు, తనకు ఉన్న సంబంధం గురించి అక్కకు తెలిసిపోయిదేమో అని కంగారు పడుతుంది. ఇదే విషయాన్ని ఆదిత్యతో చెబుతుంది. నేనే నీకు బొమ్మ ఇచ్చిన విషయం అక్కకు తెలిసిపోయింది అందుకే ఇలా అయ్యిందంటూ సత్య ఆదిత్యతో అంటుంది.

ఇక సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన రుక్మిణి ఇద్దరిని చూసి ఇక్కడేం చూస్తున్నారంటూ ప్రశ్నిస్తుంది. భోజనానికి పిలవడానికి వచ్చానని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. సీన్‌ కట్‌ చేస్తే.. కాసేపటికి సత్య గదిలోకి రుక్మిణి వస్తుంది. తన ఆరోగ్యంపై రుక్మిణి చూపిస్తున్న శ్రద్ద చూసి సత్య తనను క్షమించమని కోరుతుంది. నీ వల్లే మా అమ్మానాన్నలు చనిపోయారంటూ చెప్పినందుకు నువ్వెంత బాధపడుతున్నావో తెలుసని, అందుకు క్షమించమని సత్య రుక్మిణిని కోరుతుంది. ఇక సత్య-రుక్మిణిల జీవితం ఎటు పోతుందో అని కమల బాధపడుతుంది. నిజం తెలిసే రోజు తొందర్లోనే ఉందని తెలిసి బాధపడుతుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement