Devatha Serial Today Episode May 8th: సత్యని ఘోరంగా అవమానించిన కనకం - Sakshi
Sakshi News home page

Devatha serial : సత్యని ఘోరంగా అవమానించిన కనకం

Published Sat, May 8 2021 3:47 PM | Last Updated on Sat, May 8 2021 5:26 PM

Devatha Serial : Satya Gets Emotional As Kankam Hurts Her - Sakshi

దేవడమ్మపై కనకం చిర్రుబుర్రలాడుతూనే ఉంటుంది. తనకు అన్యాయం జరగడానికి దేవడమ్మే కారణమంటూ దెప్పిపొడుస్తుంది. మరోవైపు పెళ్లికి ముందే కడుపు చేయించుకుందంటూ సత్యని అనరాని మాటతో అవమానిస్తుంటుంది. కనకంను తన ట్రాప్‌లోకి ఎలా తెచ్చుకోవాలా అని నందా ఆలోచిస్తుంటాడు..ఇలా దేవుడమ్మ సీరియల్‌ నేడు (మే8న) 228వ ఎపిసోడ్‌లోకి ఎంటర్‌ అయిపోయింది. ఇవాల్టీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

పుట్టింటి నుంచి రావడం రావడంతోనే దేవుడమ్మపై ఆడిపోసుకుంటుంది రంగా భార్య కనకం. ఆ తర్వాత దేవుడమ్మ ఇంటికి వెళ్లి పెళ్లికి ముందే కడుపు చేయించుకుందంటూ సత్యని సూటిపోటి మాటలు అంటుండగా, రుక్మిణి వాదిస్తుంది. ఏదైనా ఉంటే తన అత్మమ్మ దేవుడమ్మతో చేసుకోవాలని, అనవరంగా తమతో గొడవలు పెట్టుకోవద్దని ఘాటుగా బదులిచ్చింది. దీంతో చేయాల్సిన తప్పులు చేసి ఇది తప్పు అంటే మాత్రం రోషం పొడుచుకొచ్చిందా అంటూ మరోసారి సత్య-రుక్మిణిలపై విరుచుకుపడుతుంది.

సీన్‌ కట్‌ చేస్తే సత్య సీమంతం తంతు తర్వాత ఊరు విడిచి వెళ్లిపోవాలని, లేదంటే తన బతుకు అగమ్యగోచరంగా మారుతుందని ఆదిత్య నందాకి వార్నింగ్‌ ఇ‍స్తాడు. ఆడిన డ్రామాలు చాలని నందాపై ఫైరవుతాడు. సత్యని ఇంతలా ఇబ్బందిపెడుతున్నావని తెలిస్తే తన తల్లి దేవుడమ్మ నిన్ను బతకనియ్యదు అని నందాతో చెప్తాడు. అయితే ఆదిత్య బెదిరింపులకు లొంగని నందా తనతో పెట్టుకుంటే అసలు నిజాన్ని ఊరి పెద్ద మనుషులకు చెప్పి పరువుతీస్తానని హెచ్చరిస్తాడు. సీన్‌ కట్‌ చేస్తే తన తల్లి దేవుడమ్మపై నిందలు వేయొద్దని ఆదిత్య తన పిన్ని కనకంతో వాదిస్తాడు. తప్పు బాబాయి చేస్తే తన తల్లిని అనడం ఏంటని ప్రశ్నిస్తాడు.

సత్యని ఇంటికి తెచ్చినందుకు ఏదో ఆస్తులు కరిగిస్తుందంటూ తన తల్లిపై లేనిపోని ఆబంఢాలు వేయొద్దని చెప్తాడు. అయితే పెళ్లి చేసినప్పుడు ఉన్న బాధ్యత ఇప్పుడు కూడా నిలబెట్టుకోవాలని, తన భర్త రంగా వల్ల తన జీవితం నాశనం అయ్యిందని, ఇందుకు ఒక రకంగా కారణం దేవుడమ్మే అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కనకం. సీన్‌ కట్‌ చేస్తే కనకంతో ఎలా మాట కలపాలా అని నందా ఆలోచిస్తుండగా కనకం స్వయంగా వచ్చి అతని వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది. దీంతో నిజాలు బయటపడతాయో అని తెలివిగా మీకు చాలా అన్యాయం జరిగింది ఆంటీ అంటూ టాపిక్‌ను డైవర్ట్‌ చేసే ప్రయత్నం చేస్తాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement