సత్యకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని రుక్మిణి భావిస్తుంది. దీంతో తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని సత్యను ప్రశ్నిస్తుంది. అతను ఎవరు అయినా నీకిచ్చి పెళ్లి చేస్తానని సత్యకు చెప్పడంతో ఆమె షాకవుతుంది. రుక్మిణి తన కోసం త్యాగం చేస్తుందేమో అని, అలా జరగకూడదని భావిస్తుంది. మరోవైపు రుక్మిని వాంతులు చేసుకోవడంతో అందరూ కంగారు పడతారు. అయితే రుక్మిణి మాత్రం సత్య-ఆదిత్యల విషయం తెలిసే వరకు తాను గర్భవతినన్న నిజం బయటకు రావొద్దని నిర్ణయించుకుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్8న 254వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..
సత్యకు అమ్మానాన్నలు లేకుండా చేశానని రుక్మిణి బాధపడుతుంది. అయితే అమ్మానాన్నలు లేనిలేటు లేకుండా తనను చూసుకున్నారని సత్య జవాబిస్తుంది. అయితే తనకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలని రుక్మిణి సత్యను కోరుతుంది. అతను ఎవరు అయినా సరే నీకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పడంతో సత్య షాకవుతుంది. దీనర్థం అక్క ఆదిత్యను తనకోసం త్యాగం చేస్తుందా అని తనలో తానే అనుకుంటుంది.ఘిలా చేస్తే ఇప్పటివరకు తాను చేసిన త్యాగం వృధా అవుతుందని, ఆదిత్య లేకపోతే తన అక్క చచ్చిపోతుందని, ఆమె జీవితం నాశనం కాకూడదని కోరుకుంటుంది.
మరోవైపు రుక్మిణి వాంతులు చేసుకోవడం చూసి హాస్పిటల్‌కి తీసుకెళ్లమని ఈశ్వర్ ప్రసాద్ ఆదిత్యకు చెప్తాడు. అలాగే సత్యను వెంట తీసుకెళ్లి తనకు కూడా చెకప్‌లు చేయించాలని చెప్తాడు. అయితే రుక్మిణి ఎందుకు వాంతులు చేసుకుంటుందో తెలియక ఆదిత్య కంగారు పడతాడు. ఇది ప్రెగ్నెన్సీ అయితే కాదుకదా అని ఆలోచిస్తాడు. సీన్ కట్ చేస్తే రుక్మిణి ఆరోగ్యంపై ఈశ్వర్ ప్రసాద్ కమలకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాల్సిందిగా కబరు పెడతాడు. దీంతో తాను అనుకున్నట్లుగానే జరుగుతుందని, ఇక నిజం బయటకు వచ్చే రోజు దగ్గరల్లోనే ఉందని కమల బాధపడుతుంది. ఇక మరోవైపు తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎలా అయినా దాయాలని, సత్య-ఆదిత్యల గురించి నిజం తెలిసే వరకు ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడాలని రుక్మిణి భావిస్తుంది. మరి హాస్పిటల్‌లో రుక్మిణి అనుకున్నదే జరుగుతుందా? ఆమె గర్భవతి అన్న విషయం అందరికి తెలిసిపోతుందా అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment