Devatha Serial Today Episode June 10th: కమలను అవమానించిన కనకం - Sakshi
Sakshi News home page

Devatha : కమలను అవమానించిన కనకం..

Published Thu, Jun 10 2021 2:58 PM | Last Updated on Thu, Jun 10 2021 9:32 PM

Devatha Serial : Kamala Gets Depressed When Kanakam Insults Her - Sakshi

సత్య, రుక్మిణి వాళ్లు ఇంటికి బయలుదేరుతారు. మార్గమధ్యలో వాళ్లకు రాజ్యం వాళ్లు ఎదురవుతారు. దీంతో రుక్మిణి ఆరోగ్యంపై వాకబు చేస్తారు. ఏదైనా శుభవార్తా అంటూ రాజ్యం ఎంతో ఆతృతతో అడగగా లేదని రుక్మిణి సమాధానమిస్తుంది. మరోవైపు తన సూటిపోటి మాటలతో కనకం కమలను ఆడిపోసుకుంటుంది. సత్య, రుక్మిణులను దెబ్బిపొఘుస్తూ మాట్లాడుతుండగా కమల ఆమెకు గట్టి సమాధానం ఇస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్‌ జూన్‌ 10న 256వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

సత్య, రుక్మిణులను తీసుకొని ఆదిత్య ఇంటికి బయలుదేరుతాడు. ఏ ఆడపిల్లకైనా తను గర్భవతి అయ్యిందనే సంగతి భర్తకే మొదట చెప్పాలనుకుంటుంది కదా అని రుక్మిణి ఆదిత్యను అడుగుతుంది. కానీ అందరికీ ఆ అదృష్టం రాదని చెబుతూ బాధపడుతుంది. అయితే రుక్మిణి ఇలా ఎందుకు అంటుందో సత్య, ఆదిత్యలకు అర్థం కాదు. ఇక తనకు దాహం వేస్తుందని చెప్పడంతో ఆదిత్య కొబ్బరి బోండం వద్ద కారును ఆపతాడు. అక్కడే వాళ్లకు రాజ్యం వాళ్లు కనిపిస్తారు. రుక్మిణి వాంతులు చేసుకుంటుంది అందుకే హాస్పిటల్‌కి వెళ్లాం అని చెప్పగానే ఏదైనా శుభవార్తా అని అడుగుతుంది. అదేమీ లేదని రుక్మిణి చెప్పడంతో అంతా సైలెంట్‌ అవుతారు. మరోవైపు కనకం తన సూటిపోటి మాటలతో కమలను ఆడిపోసుకుంటుంది.

సత్య, రుక్మిణుల గురించి పదేపదే దెబ్బిపొడుస్తుంటుంది. దీంతో ముందు రంగా మామ గురించి చూసుకోమని చెప్పి కమల గట్టి సమాధానం ఇస్తుంది. ఇక రుక్మిణి వాళ్లు రాగానే డాక్టర్‌ ఏం చెప్పింది? గుడ్‌న్యూసే కదా అంటూ కనకం రుక్మిణిని అడుగుతుంది. అక్కడ కొద్ది సేపు కనకం తన మాటలతో డ్రామా చేస్తుంది. సీన్‌ కట్‌ చేస్తే రంగా గురించి అన్ని తెలిసినా అతడిని గాడిలో పెట్టలేదంటూ కనకం రాజ్యం వాళ్ల భర్తపై అరుస్తుంది. తప్పును తప్పు అని చెప్పకుండా పైపెచ్చు సమర్థించారంటూ అతడిపై మండిపడుతుంది. మరోవైపు సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనా పెనిమిటీ అంటూ రుక్మిణి ఆదిత్యను ప్రశిస్తుంది. దీనికి ఆదిత్య ఏం సమాధానం చెప్తాడు? ఆ తర్వాత రుక్మిణి ఎలా రికార్ట్‌ అవుతుంది అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement