సత్య గురించి రుక్మిణి అంతలా ఆలోచించడం ఏంటని దేవుడమ్మ ఆందోళన వ్యక్తం చేస్తుంది. సత్య జీవితం కోసం ఆలోచిస్తూ ఆదిత్యతో సంతోషంగా ఉండడం లేదని గుర్తిస్తుంది. ఇదే విషయాన్ని ఈశ్వర్ ప్రసాద్‌తో చెబుతుంది. సీన్‌కట్ చేస్తే రుక్మిణి చేయాల్సిన వ్రతాన్ని తను చేయకుండా చెల్లెలు సత్యను కూర్చోబెడుతుంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ బావుండాలని, అందుకు ఈ వ్రతం చెయ్యమని కోరుతుంది. ఇక సత్య వ్రతంలో కూర్చోవడాన్ని చూసిన కనకం షాకవుతుంది.ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్ జూన్ 19న 264వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..
దేవత జూన్19 : సత్య చేసింది తప్పు అని తెలిసినా రుక్మిణి వెంటేసుకొని రావడాన్ని దేవుడమ్మ సహించదు. తన మాటను లెక్కచేయకుండా ఇంటికి తేవడం ఏంటని ఈశ్వర్ ప్రసాద్‌తో చర్చిస్తుంది. సత్య గురించి ఆలోచిస్తూ ఆదిత్యతో సఖ్యతగా లేకపోవడం, ఇద్దరి దాంపత్య జీవితానికి అడ్డుగా మారుతుందని ఆందోళన పడుతుంది. సీన్ కట్ చేస్తే పిల్లలు పుట్టాలని దేవుడమ్మ రుక్మిణితో చేయించాలనుకున్న వ్రతాన్ని సత్యతో చేయించాలని రుక్మిణి భావిస్తుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు మంచి జరగాలని కోరుకుంటూ వ్రతం చేయాల్సిందిగా సత్యను కోరడంతో ఆమె షాకవుతుంది.
తన మాటకు అడ్డు చెప్పకుండా చెప్పింది చేయాల్సిందిగా కోరుతుంది. దీంతో తన వల్ల రుక్మిణి-ఆదిత్యల జీవితం ఏమైపోతుందో అని సత్య కంగారు పడుతుంది. ఇలా జరగకూడదని, వెంటనే కమలకు ఫోన్ చేస్తుంది. తనకు ఈ ఇంట్లో ఉండాలనిపించడం లేదని, అయితే ఎక్కడకు వెళ్లనీయకుండా రుక్మిణి అడ్డుపడుతందని చెప్తుంది. దీంతో ఇలా జరుగుతుందని తనకు ముందే తెలుసని, ఎలాగోలా ఇంటికి వచ్చేయమని కమల చెబుతుండగా, భాగ్యమ్మ ఫోన్ తీసుకుంటుంది. అక్కడ ఉంటేనే బావుంటుందని, ఊళ్లోకి వస్తే అందరి మాటల భరించాల్సి వస్తుందని చెప్తుంది. సీన్ కట్‌చేస్తే వ్రతంలో తన స్థానంలో సత్యను కూర్చోబెడుతుంది.
Devatha : రుక్మిణి స్థానంలో వ్రతం చేసిన సత్య.. కనకం షాక్
Published Sat, Jun 19 2021 2:29 PM | Last Updated on Sat, Jun 19 2021 7:29 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment