Devatha : సత్యకు సంబంధం చూసిన కనకం.. కోపగించుకున్న ఆదిత్య | Devatha Serial : Adithya Loses His Cool After Kanakam Brings A Proposal | Sakshi
Sakshi News home page

Devatha : సత్యకు సంబంధం చూసిన కనకం.. కోపగించుకున్న ఆదిత్య

Published Fri, Jun 11 2021 3:06 PM | Last Updated on Fri, Jun 11 2021 3:13 PM

Devatha Serial : Adithya Loses His Cool After Kanakam Brings A Proposal  - Sakshi

కనకం తీరు మారదు. తన భర్త రంగా చేసిన పనికి ఇంట్లో అందరినీ ఆడిపోసుకుంటుంది. దేవుడమ్మ కూడా తనకు న్యాయం చేయలేదంటూ ఫైర్‌ అవుతుంది. ఇక అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో సత్యను టార్గెట్‌ చేసిన కనకం ఆమెను అనరాని మాటలు అంటుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డ అనాథే అవుతాడు తప్పా మహారాజు కాలేదని సూటిపోటి మాటలతో సత్య మనసుకు గాయం చేస్తుంది.  మరోవైపు కనకం మాటలకు ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. సత్య విషయంలో కలగజేసుకోవద్దని, తన పనేంటో అది మాత్రమే చూసుకోవాలని చెప్పి స్వీట్‌ వార్నింగ్‌ ఇస్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్‌ జూన్‌ 11న 257వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

కనకం తన భర్త రంగా బంతితో తిరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారంటూ రాజ్యం భర్తను నిందిస్తుంటుంది. తనకు అన్యాయం చేశారంటూ ఆడిపోసుకుంటుంది. మరోవైపు రాజ్యం తోనూ తగువు పెట్టుకుంటుంది. అందరికి అన్నీ తెలిసినా ఎవరూ ఏమీ చేయలేదని అసహనం వ్యక్తం చేస్తుంది. దీంతో దేవుడమ్మ వచ్చాక తేల్చుకోవాలని రాజ్యం బదులిస్తుంది. సీన్‌ కట్‌ చేస్తే.. అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. ఇదే సరైన టైం అనుకుందో ఏమో కానీ కనకం సత్యను టార్గెట్‌ చేస్తుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరో ఇంతవరకు తెలియదని, ఇక తన జీవితం నాశనం అని అంటుంది. అంతేకాకుండా తండ్రి లేకుండా పెరిగే బిడ్డ అనాథే అవుతాడు తప్పా మహారాజు కాలేదని సూటిపోటి మాటలతో సత్య మనసుకు గాయం చేస్తుంది. కనకం మాటలకు సత్య చాలా బాధపడుతుంది.

ఈశ్వర్‌ ప్రసాద్‌ కూడా ఇక ఈ టాపిక్‌ ఆయేయాలని చెప్పినా కనకం మాత్రం తీరు మార్చుకోదు. సత్యకు తన ఊళ్లో ఒక తెలిసిన వ్యక్తి ఉన్నాడని, తను 10వ తరగతి వరకు చదువుకున్నాడని, ఆ అబ్బాయిని సత్యకు ఇచ్చి పెళ్లి చేద్దాం అని కనకం సూచిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆదిత్య ఉక్రోషానికి లోనవుతాడు. సత్య విషయం నీకెందుకు పిన్నీ అంటూ తీవ్ర స్థాయిలో కోపం వ్యక్తం చేస్తాడు. వేరే వాళ్ల విషయాలు అంత పట్టించుకోవడం అవసరం లేదని, తన పని తాను చేసుకోవాలంటూ హితవు పలుకుతాడు. ఇంకోసారి సత్య గురించి కలగజేసుకుంటే బాగుండదని స్వీట్‌ వార్నింగ్‌ ఇస్తాడు. ఆదిత్య మాటలకు షాకైన రుక్మిణి తనకు ఇంత కోపం ఎందుకు వస్తుందని ఆలోచనలో పడిపోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement