Devatha Serial Today Episode May 14th: నందా గురించి రుక్మిణితో నిజం చెప్పేసిన సత్య - Sakshi
Sakshi News home page

Devatha : నందా గురించి రుక్మిణితో నిజం చెప్పేసిన సత్య

Published Fri, May 14 2021 2:33 PM | Last Updated on Fri, May 14 2021 7:18 PM

Devatha Serial : Satya Reveals Truth About Nanda To Rukmini - Sakshi

నందా-సత్యలు ప్రేమికులు కాదని నిర్ధారణకు వచ్చిన రుక్మిణి, కనకం. సత్య సీమంతానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన దేవుడమ్మ. మరోవైపు నందా ఆగడాలు భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సత్య. నందా నిజస్వరూపాన్ని బయటపెట్టిన సత్య. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలతో దేవత సీరియల్‌ 233వ ఎపిసోడ్‌లోకి ఎంటర్‌ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

కనకం వేసిన మాస్టర్‌ ప్లాన్‌తో నందా-సత్యలు దొరికిపోతారు. వాళ్లు చెప్పే సమాధానాలు ఒక్కటీ మ్యాచ్‌ కాకపోవడంతో సత్య-నందాలు ప్రేమికులు కాదని నిర్ధారణకు వస్తారు. దీంతో నిజం ఎలా అయినా బయటపెట్టి సత్య జీవితాన్ని కాపాడాలని అనుకుంటారు. సీన్‌ కట్‌చేస్తే ఈశ్వర్‌ ప్రసాద్‌కు కాల్‌ చేసిన దేవుడమ్మ తాను త్వరలోనే ఇంటికి వస్తున్నానని ఈలోగా సత్య సీమంతానికి కావల్సిన ఏర్పాటు చేయాలని చెప్తుంది. దీంతో ఫంక్షన్‌ హాలు సహా అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలని ఈశ్వర్‌ ప్రసాద్‌ మిగతా కుటుంబసభ్యులకు చెప్తాడు.

ఇక సత్య కోసం ఒక నగను బహుమతిగా ఇచ్చిన నందా, సత్యపై ప్రేమ ఒలకొబోస్తూ దీని ధర 2 లక్షలు ఉంటుందని బిల్డప్‌ ఇస్తాడు. దీంతో సత్యపై నందాకు ఎంతో ప్రేమ ఉందని, అసలు ఏమీ అర్థం కావట్లేదు అని రుక్మిణి కనకంతో అంటుంది. అయితే నందా ఇచ్చిన నగను చూస్తుండగా అనుకోకుండా కిందపడి విరిగిపోతుంది. నగను తదేకంగా పరిశీలించిన కనకం ఇది గిల్టు నగ అని తేల్చేస్తుంది. దీంతో నందాపై కోపంతో రగిలిపోయిన రుక్మిణి అసలు ఈ నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందో తెలుసుకోవాలని సత్యను అడుగుతుంది.

అయితే అప్పటికే సత్య ఆత్మహత్యయత్నినికి ప్రయత్నించిదని తెలుసుకున్న రుక్మిణి సత్యపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావంటూ నిలదీస్తుంది. నందాపై రుక్మిణికున్న అనుమానాలను పటాపంచులు చేస్తూ నందా గురించి నిజాలు బయటపెట్టేసింది సత్య. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు నందా కారణం కాదని, అసలు తామిద్దరికి ఎటువంటి సంబంధం లేదన్న నిజాన్ని బట్టబయలు చేసేస్తుంది. దీంతో మరి నీ కడుపుతో పెరగుతున్న బిడ్డకు తండ్రెవరు అని రుక్మిణి నిలదీస్తుంది. మరి సత్య నిజం చెప్పేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement