Devatha Serial Today Episode May 19th: కూతురి విషయం తెలిసి నిట్టూర్చిన భాగ్యమ్మ - Sakshi
Sakshi News home page

Devatha : కూతురి విషయం తెలిసి నిట్టూర్చిన భాగ్యమ్మ

Published Wed, May 19 2021 2:37 PM | Last Updated on Wed, May 19 2021 3:08 PM

Devatha Serial :  Ranga Celebreting After Knowing The Truth - Sakshi

సత్యను దేవుడమ్మ ఇంట్లోంచి గెంటేసిందని తెలిసి రంగా తెగ సంబంరపడిపోతాడు. ఇన్నాళ్లకు తను అనుకున్నది సాధ్యమైదంటూ ఆనందంలో మునిగితేలతాడు. ఇంక ఇంటికి రమ్మని దేవుడమ్మ అడిగినా రంగా అందుకు ఒప్పుకోడు. ఇక సత్య పరిస్థితి తెలుసుకున్న భాగ్యమ్మ నిట్టూర్చింది. తన కుటుంబానికే ఇలా ఎందుకు అవుతుదని బాధపడిపోతుంది. సత్యను రోడ్డుపై చూసిన నందా అక్కడికి వచ్చి మళ్లీ తన బుద్ది చూపించుకున్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ సత్యతో తిట్లు తింటాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలతో దేవత సీరియల్‌ మే19న  237వ ఎపిసోడ్‌లోకి ఎంటర్‌ అయ్యింది. ఇవాల్టీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

సత్యను దేవుడమ్మ ఇంట్లోంచి గెంటేసిందని తెలుసుకున్న రంగా ఎంతో సంతోషపడతాడు. తను అనుకున్నది నిజం అయిందంటూ తన ఆనందాన్ని బంతితో పంచుకుంటాడు. దేవుడమ్మ తన దగ్గరికి వచ్చి తలదించేకునే రోజు దగ్గర్లోనే ఉందని అంటుంబగా దేవుడమ్మ నుంచి రంగాకు ఫోన్‌ వస్తుంది. కనకం వచ్చిందని, వెంటనే ఇంటికి రావాలని కోరుతుంది. అయితే రంగా మాత్రం చాలా దురుసుగా మాట్లాడుతూ ఇంటికి వచ్చే ప్రసక్తే లేదని, తనకిష్టం వచ్చిందే చేస్తానని చెప్పి ఫోన్‌ పెట్టేస్తాడు.

సీన్‌ కట్‌ చేస్తే సత్యను దేవుడమ్మ ఇంట్లోంచి పంపిందన్న నిజం తెలిసి భాగ్యమ్మ తట్టుకోలేకపోయింది. ఏం పాపం చేశామని నా బిడ్డలకు ఆ దేవుడు శిక్ష వేస్తున్నాడంటూ కుంగిపోతుంది. ఇక టైం బాగోలేక ఇలాంటి గతి పట్టిందని నందా అనుకుంటుండగా రోడ్డుపై సత్య కనిపిస్తుంది. దీంతో షాకైన నందా నిన్ను కూడా గెంటేసిందా అంటూ సత్యతో సెటైరికల్‌గా మాట్లాడతాడు. నిన్ను భార్యగా ఫిక్సయ్యానని, తనతో పాటు వచ్చేయమని నందా సత్యను కోరతాడు. దీంతో గట్టి సమాధానం చెప్పిన సత్య నీ వల్లే ఇలా రోడ్డు మీదకి వచ్చానని బాధపడుతుంది. ఇంత జరిగినా బుద్ది మార్చుకోని నందా సత్య పొగరుని దింగాలని ప్లాన్‌ చేస్తుంటాడు. అదేంటో తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement