Devatha Serial Today Episode May 24th: ఆదిత్య జీవితంలోకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్న సత్య - Sakshi
Sakshi News home page

Devatha : ఆదిత్య జీవితంలోకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్న సత్య

Published Mon, May 24 2021 3:12 PM | Last Updated on Mon, May 24 2021 3:40 PM

Devatha Serial :  Satya Decides To Move Into Devudammas Home - Sakshi

సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరో తెలుసుకోవాలని రుక్మిణి భావిస్తుంది. ఇదే విషయాన్ని ఆదిత్యతో ప్రస్తావించగా, తన గురించి ఏమైనా తెలిసిందేమోనని ఆదిత్య కంగారు పడతాడు. ఇక ఇప్పటివరకు తాను చేసిన త్యాగాల వల్ల తన జీవితం నాశనం అయిపోయిందని భావించిన సత్య ఈ చీత్కారాలకు ముగింపు పలకాలని అనుకుంటుంది. అందుకోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. సత్యకు  ఏదైతే నిజం తెలియకూడదో అది తెలిసిపోయిందని భాగ్యమ్మ రుక్మిణితో చెబుతుంది. సత్య దగ్గరకు వెళ్తానని రుక్మిణి దేవుడమ్మకు చెప్తుంది. మరి దేవుడమ్మ రుక్మిణిని వాళ్ల పుట్టింటికి వెళ్లేందుకు అనుమతిస్తుందా?ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలతో దేవత సీరియల్‌ మే24న 241వ ఎపిసోడ్‌లోకి ఎంటర్‌ అయ్యింది. ఇవాల్టి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

సత్య పరిస్థితి గురించి రుక్మిణి బాధపడుతుంటుంది. తనకు అన్యాయం జరిగిందని మదనపడుతుంటుంది. అయితే సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరో తెలుసుకోవాలనుకుంటుంది. ఈలోగా ఆదిత్య అక్కడకు రావడంతో ఈ విషయాన్ని ఆదిత్యకు చెప్తుంది. దీంతో తన పేరు చెప్పిందేమోనని ఆదిత్య కంగారు పడిపోతుంటాడు. సత్య ఏమైనా చెప్పిందా అని ఆతృతగా అడుగుతాడు. ఇక సీన్‌కట్‌ చేస్తే సత్యను అలా ఇంటి నుంచి వెళ్లగొట్టడం పట్ల కనకం దేవుడమ్మను ప్రశ్నిస్తుంది. తొందరపడ్డవేమో అని అడగ్గా సత్య గురించి మరింత నీచంగా మాట్లాడుతుంది దేవుడమ్మ. ఇక తన పుట్టబోయే బిడ్డను ఈ సమాజం ఎలా స్వీకరిస్తుందో అని సత్య ఆలోచిస్తుంటుంది. ఈ ఛీత్కారాలకు, అవమానాలకు ముగింపు పలకాలని అనుకుంటుంది. ఇప్పటివరకు తాను చేసిన త్యాగాలు చాలని, ఇకపై తన జీవితం గురించి మాత్రమే ఆలోచించాలని నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం ఆదిత్యతోనే తాను ఉండాలని, మళ్లీ ఆ ఇంటికి వెళ్లాలని భావిస్తుంది.

ఇక సత్యకు తన తల్లిదండ్రులు ఎలా చనిపోయారో అన్న నిజం తెలిసిపోయిందని భాగ్యమ్మ రుక్మిణికి చెబుతుంది. దీంతో షాక్‌ అయిన రుక్మిణి సత్య ఇప్పుడు మరింత కుంగిపోతుందంటూ బాధపడుతుంటుంది. ఇలాంటి సమయంలో సత్య పక్కన తను ఉండటం ఉత్తమమని, వెంటనే సత్య దగ్గరికి వెళ్లాలని భావిస్తుంది. అయితే ఈ విషయాన్ని దేవుడమ్మతో చెప్తుంది. మరి దేవుడమ్మ రుక్మిణిని వాళ్ల పుట్టింటికి వెళ్లేందుకు అనుమతిస్తుందా? సత్య ఆదిత్య జీవితంలోకి తిరిగి వచ్చేస్తుందా అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement