Devatha Serial Today Episode June 3rd: పసరు మందుతో సత్యను చంపాలనుకున్న కమల - Sakshi
Sakshi News home page

Devatha : పసరు మందుతో సత్యను చంపాలనుకున్న కమల

Published Thu, Jun 3 2021 2:58 PM | Last Updated on Thu, Jun 3 2021 9:40 PM

Devatha Serial : Basha Condemns Kamalas Arrogant bBehaviour - Sakshi

రుక్మిణి జీవితం నాశనం అవుతుందంటూ కమల బాధపడిపోతుంది. దీనంతటికి కారణం సత్యే అని తనపై కోపం పెంచుకుంటుంది. సత్యను చంపేస్తే ఎవరికి ఏ బాధ ఉండదని నిర్ణయించుకుంటుంది. సీన్‌ కట్‌ చేస్తే సత్య-ఆదిత్యలు మరోసారి రుక్మిణి కంటపడతారు. సత్యను ఆదిత్య స్వయంగా తన చేత్తో ఎత్తుకొని తీసుకెళ్లడం చూసి రుక్మిణి గుండె పగులుతుంది. వాళ్లు మాట్లాడుకుంటున్న మాటల విని మరింత బాధపడిపోతుంది. ఇది నిజం కావొద్దంటూ ప్రార్థిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్‌ జూన్‌3న 250వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

దేవత జూన్‌ 3 : సత్య-ఆదిత్యలపై తనకున్న అనుమానం గురించి రుక్మిణి కమలతో పంచుకుంటుంది. తాను స్వయంగా తయారుచేసిన రాధాకృష్ణల బొమ్మ సత్యను ఇస్తే అది ఆదిత్య దగ్గరికి ఎలా వచ్చిందంటూ సందేహం వ్యక్తం చేస్తుంది. దీంతో రుక్మిణి జీవితం నాశనం అవుతుందంటూ కమల బాధపడిపోతుంది. త్వరలోనే ఈ నిజం బయటకు వచ్చేస్తుందేమో అని కంగారు పడిపోతుంది. దీనంతటికి కారణం సత్యే అని తనపై కోపం పెంచుకుంటుంది. ఎంత వద్దని చెప్పినా సత్య అక్కడికి పోయి రుక్మిణి జీవితాన్ని నాశనం చేస్తోందంటూ తనపై కక్ష పెంచుకుంటుంది. దీంతో ఓ పసరు మందు నూరి సత్యకు తినిపించాలనుకుంటుంది. అది ఏం మందు అని భాష అడగ్గా సత్యను చంపేద్దామనుకుంటున్నా అని కమల చెప్పిన సమాధానంతో భాష షాక్‌ అవుతాడు.

దీనంతటికి కారణం సత్యే అని, అసలు సత్యనే, తన కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపేస్తే అప్పుడు ఎవరికీ ఏ బాధ ఉండదని కమల బదులిస్తుంది. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? చీమకు కూడా హాని చేయని నువ్వు ప్రాణం తీసేంత ధైర్యం ఉందా అంటూ కమల చేస్తోన్న తప్పును ఎత్తిచూపుతాడు. ఇలాంటివి చేయోద్దని గట్టిగా చెప్తాడు. మరోవైపు సత్య కాలికి ఏదో గుచ్చుకొని బాధపడుతుంటే ఆదిత్య అక్కడికి వస్తాడు. సత్యను చూసి తట్టుకోలేక తనను ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఆ దృశ్యం రుక్మిణి కంటపడటంతో గుండె పగిలినంత పని అయ్యింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఇది నిజం కాకూదంటూ ప్రార్థిస్తుంది. కలలో కూడా ఇలాంటిది జరగడకూడదని అనుకుంటుంది. సత్య-ఆదిత్యల ప్రేమ విషయం మున్ముందు ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందో తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement