Devatha : సత్యను తనతో ఇంటికి తీసుకెళ్లిన రుక్మిణి | Devatha Serial : Satya Arrives To Devudammas House | Sakshi
Sakshi News home page

Devatha : సత్యను తనతో ఇంటికి తీసుకెళ్లిన రుక్మిణి

Published Sat, May 29 2021 3:04 PM | Last Updated on Sat, May 29 2021 3:04 PM

Devatha Serial : Satya Arrives To Devudammas House - Sakshi

రుక్మిణి సత్యను తనతో పాటు తీసుకెళ్లడానికి భాగ్యమ్మ ఇంటికి వెళ్తుంది. వద్దని కమల ఎంత చెప్పినా రుక్మిణి వినిపించుకోదు. మరోవైపు తన వ్యూహాం అమలవుతున్నందుకు సత్య మురిసిపోతుంది. పైకి మాత్రం వద్దని నటిస్తూ లోలోపల సంబరపడిపోతుంది. ఇక సత్యను చూడగానే కనకం మండిపోతుంది. తనను ఇంట్లోకి రానివచ్చేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్‌ మే29న 246వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

దేవుడమ్మ ఇంట్లోకి ఎలా అయినా వెళ్లాలని సత్య పథకం పన్నుతుంది. ఇందుకు తగ్గట్లుగానే తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని, ఇక బతకడమే వ్యర్థమని డ్రామాలు ఆడుతుంది. అదే సమయంలో అక్కడికి రుక్మిణి వస్తుంది. నువ్వు చచ్చి ఇంక ఎంత మందిని చంపుతావాంటూ సత్యపై కోప్పడుతుంది. సత్యను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లడానికే వచ్చానని చెప్తుంది. అయితే సత్యపై ఇప్పటికే దేవుడమ్మకు చాలా కోపం ఉందని, ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లడం మంచిది కాదని కమల వారిస్తుంది. అయినప్పటికీ రుక్మిణి సత్యను తనతో పాటు తీసుకెళ్తుంది. ఇక సత్యను రుక్మిణి ఇంట్లోకి తెస్తుండగా కనకం అడ్డుపడుతుంది.
 

దేవుడమ్మ ఇంట్లో లేని సమయంలో సత్యను తీసుకురావడం కరెక్ట్‌ కాదని చెప్తుంది. పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకొని, నందాను తీసుకొచ్చి మోసం చేసిందని ఇలాంటి వ్యక్తిని లోపలికి తేవద్దని మందలిస్తుంది. దీంతో ఆదిత్య అడ్డుపడి తన తల్లి ఊళ్లోకి రాగానే తానే సంజాయషీ చెప్పుకుంటానని చెప్తాడు. సత్య గురించి తప్పుగా మాట్లాడొద్దని కనకంతో వాదిస్తాడు. ఇక సత్యను లోపలికి తీసుకెళ్లమని రుక్మిణికి చెప్పడంతో ఆమె సత్యను ఇంట్లోకి తీసుకెళ్లుంది. ఆదిత్య విషయం ముందే తెలియడంతో కనకం మండిపోతుంది. త్వరలోనే ఈ నిజం తెలిసి మీరంతా గుండె పగిలి ఏడుస్తారని తనలో తానే అనుకుంటుంది. ఇక సత్యను ఇంట్లోకి రానిచ్చినందుకు రుక్మిణి ఆదిత్యకు ధన్యవాదాలు తెలుపుతుంది. తనను దేవుడిలా ప్రశంసిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement