Malladi Venkata Krishna Murthy
-
రెండు రెళ్లు యాభై
-
నేను చూసిన క్రైస్తవత్వం...
ప్రపంచంలోని ప్రతి మతం పవిత్రమైనదే. అవి బోధించే అంశాలు మానవులకి ఉపయోగపడేవే. మతం పేరిట కొందరి ప్రవర్తనా తీరు వలన మతాన్నే ద్వేషించే పరిస్థితి ప్రపంచంలో ఉంది. ఒక్కో ‘మది’ది ఒక్కోతీరు. హిందూమతం దైవ భక్తికి పెద్దపీట వేసింది. దృష్టిని ప్రపంచం మీద కాక, పరమాత్మ మీద నిలిపి ఉంచాలని హిందూమతం బోధించే భక్తి మార్గం. క్రైస్తవ మతమేమో సాటివారికి సాయం చేయాలని బోధిస్తూ, త్యాగానికి, సేవకి పెద్ద ప్రాముఖ్యతని ఇచ్చింది. కొందరు క్రిస్టియన్సలోని త్యాగశీలులకి చెందిన ఉదంతాలు తెలుసుకుంటే నాకు ఒళ్లు పులకరిస్తుంది. క్రీ.శ. 1202లో ఇటలీలోని అస్సీ అనే చిన్న ఊరిలో ఓ ధనవంతుడుండేవాడు. అతని ఇరవై ఏళ్ల కొడుకు ఫ్రాన్సిస్ తన మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అతనికి గంట మోగుతున్న చప్పుడు వినిపించింది. ఆరోజుల్లో కుష్టువ్యాధికి మందులేదు. వాళ్లని ఊళ్లోకి అనుమతించేవారు కాదు. ఊరికి దూరంగా కాలనీలో ఆ వ్యాధిగ్రస్తులు ఉండేవారు. ఒకవేళ వారు ఊళ్లోకి రావాల్సి వస్తే, ఊరి బయట ఉన్న గంట మోగించి వస్తారు. అప్పుడంతా తప్పుకుంటారు. ఆ గంట విని ఆయన పక్కకి తప్పుకునేలోగా ఓ కుష్ఠు వ్యాధిగ్రస్థుడు అతనికి ఎదురు పడ్డాడు. వ్యాధితో శరీరం, మొహం వికారంగా అయిపోయి ఆ రోగిని ఎవరు చూసినా అసహ్యించు కుంటారు. ఐతే ఫ్రాన్సిస్‌కి ఆ రోగి పరిస్థితి చూడగానే హృదయం ద్రవించింది. అతని దగ్గరకు వెళ్లి అతనిని చూడగానే రెండడుగులు వెనక్కి వేసినందుకు క్షమాపణ చెప్పి, తన జేబులోని డబ్బంతా ఇచ్చి, ఆ రోగిని ఆలింగనం చేసుకున్నాడు. అతని ఔదార్యానికి కళ్లల్లో నీళ్లు తిరిగిన ఆ రోగి... ‘‘మనిషి స్పర్శ ఎలా ఉంటుందో మరిచిపోయాను. నాకది మీరు గుర్తు చేశారు’’ అన్నాడు. ఆ యువకుడే నేటికీ క్రిస్టియన్స్ అంతా కొలిచే మహాత్ముడు ‘సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీ’. మరో సంఘటన. అది జనవరి 1945. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. పోలెండ్‌లోని జడోర్జూ అనే చిన్ని గ్రామంలోని రైల్వేస్టేషన్‌లోకి ఓ యువకుడు ప్రవేశించాడు. అక్కడ పొడుగు చారల ఖైదీ దుస్తులు ధరించిన పదమూడేళ్ల అమ్మాయి కూర్చుని ఉంది. సరైన భోజనం లేని అమె మరణానికి దగ్గరగా ఉంది. ‘‘ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు?’’ క్రిస్టియన్ ఫాదర్ అయిన ఆ యువకుడు ఆమెను అడిగాడు. ‘‘నా పేరు ఎడిట్ జైరర్. నాలుగేళ్లుగా నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ నుంచి తప్పించుకున్నాను. నా స్వగ్రామానికి వెళ్లి నా తల్లిదండ్రులను, సోదరినిని కలుసు కోవాలని బయలుదేరాను’’ చెప్పిందామె. అతను వెళ్లి బ్రెడ్, టీకప్పుతో వచ్చి వాటిని ఆమెకు ఇచ్చి ఆకలిని తీర్చాడు. క్రాకోకి వెళ్లే రైలు రాగానే ఆ యువకుడు బల హీనంగా ఉన్న ఆమెని ఎత్తుకుని, పెట్టెలోకి మోసుకెళ్లాడు. జంతువులను రవాణా చేసే ఆ పెట్టెలో ఆమెకి చలి నించి రక్షణగా తన ఒంటి మీది కోటుని కప్పాడు. భగవంతుని ఆశీస్సులు ఆమెకి లభించాలని ప్రార్థన చేస్తానని చెప్పాడు. తన దగ్గర ఉన్న డబ్బులు ఆమెకు ఇచ్చేశాడు. ‘‘మీ పేరు? ఆమె అడిగింది. ‘‘కరోల్ ఓటైలా’’ జవాబు చెప్పాడు. 1994లో ఇజ్రాయెల్‌లోని ఐఫా అనే ఊరిలో నివసిస్తున్న ఎడిట్ ఓ రోజు దిన పత్రిక చదువుతూంటే ‘కరోల్ ఓటైలా’ అనే పేరు కనిపించింది. ఆమె జీవితంలో మరిచిపోలేని పేరు అది. తనని కాపాడినది వారే అయితే అతన్ని ఓసారి కలుసుకుని కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉందని ఓ ఉత్తరం రాసి పోస్టు చేసింది. అయితే ఉత్తరానికి కొద్ది జాప్యం తర్వాత జవాబు వచ్చింది. అది అందుకున్నాక ఎడిట్ 1995లో ఇజ్రాయిల్ నించి యూరప్‌కు వెళ్లినప్పుడు రోమ్‌లోని వాటికన్ సిటీ వెళ్లి పోప్ జాన్‌పాల్-2ని కలుసుకుంది. త్యాగానికి ప్రతీక అయిన ఆ యువకుడే అత్యున్నత క్రిస్టియన్ మతాధికారి ‘పోప్’ అయ్యాడు. ఆ ఖైదీకి అతను సహాయం చేయడం నాజీ సైనికులు చూసి ఉంటే, అతన్ని అక్కడికక్కడే కాల్చి చంపేవారు. అలాగే ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ నుంచి మత ప్రచారానికి ఓ ఫాదర్‌ని 1932లో పంజాబ్‌కి పంపించారు. అతని పేరు జాన్ లియోపోర్న్. జాన్ ఉత్తర పంజాబ్‌లోని ఓ గ్రామంలో తను నమ్మిన సిద్ధాంతాలని ప్రచారం చేయసాగాడు. ఓ రోజు కొందరు గ్రామ పెద్దలు జాన్ని రచ్చబండ దగ్గరకి పిలిపించారు. అతనితో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. రచ్చబండ చుట్టూ మనుషులు అతనికి అడ్డుగా నిలబడి అక్కడినించి కదలనివ్వలేదు. గంట... పది గంటలు... రోజు... మూడు రోజులు అలా గడిచాయి. అతనికి తాగడానికి నీళ్లు ఇచ్చారు తప్ప ఎవరూ భోజనం పెట్టలేదు. ఐదో రోజు అతను నీరసంతో వాలిపోయాడు. ఆరో రోజు గ్రామపెద్ద అతని తలని తన ఒళ్లో ఉంచుకుని, నిమ్మరసం తాగించి తర్వాత భోజనం పెట్టి చెప్పాడు. ‘‘మేమంతా మిమ్మల్ని ఇన్ని రోజులు పరీక్షించాం. ఆహారం ఇవ్వకుండా, కదలనివ్వకుండా చేసినందుకు మీరు మమ్మల్ని తిడతారని, ద్వేషిస్తారని ఎదురుచూశాం. అదే జరిగితే మిమ్మల్ని గ్రామం నించి బహిష్కరించాలనుకున్నాం. మీరు ఇన్ని రోజులు బోధించిన ‘క్షమ’ మీలో నిజంగా ఉందో లేదో ఇలా పరీక్షించినందుకు క్షమించండి. ఇప్పుడు మీ మతం గురించి, జీసస్ గురించి చెప్పండి.’’ ఒకటా? రెండా? ఇలాంటి ఎన్నో ఉదంతాలు చదివిన నాకు క్రిస్టియానిటీకి దగ్గరయ్యే కొన్ని అదృష్టాలు కలిగాయి. నా ప్రమేయం లేకుండానే క్రిస్టియన్స్‌కి, పవిత్రమైన కొన్ని ప్రదేశాలని నా విదేశీ పర్యటనల్లో సందర్శించడం జరిగింది. టర్కీలోని కుశదాసి ద్వీపానికి ఆగస్ట్ 2010లో వెళ్లాను. క్రీస్తును శిలువ వేశాక, ఆయన ప్రధాన శిష్యులలో ఒకరైన సెయింట్ జాన్ జెరూసలేం నించి ఈ కుశదాసి ద్వీపానికి వచ్చారు. స్థానికుల కథనం ప్రకారం, రోమన్స్ తనని హింసించడం మొదలయ్యాక, జీసస్ తన శిష్యుడు సెయింట్ జాన్ని తన తల్లి మేరీ మాతని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లమని కోరారు. ఈ ద్వీపంలోని ఓ ఇంట్లో మేరీమాత తన ఆఖరి సంవత్సరాలు, తుదిశ్వాస వదిలేదాక గడిపింది. ఈ విషయం కుడా ప్రపంచానికి దైవికంగా తెలియడం విశేషం. 1774-1824 మధ్య జర్మనీలో జీవించిన క్రిస్టియన్ నన్ క్యాథరీనా ఎమెరిష్కి వర్జిన్ మేరీ చివరి దశలో జీవించిన కుశదాసి ద్వీపంలోని ఈ ఇంటి తాలూకు దర్శనాలు కలిగాయి. ఈ ఇల్లు సముద్రానికి ఎంత దూరంలో ఉన్నది, అక్కడ ఉన్న వృక్షజాతి, ఎన్నడూ జర్మనీ దేశాన్ని వదలని క్యాథరీనాకి కలలో కనిపించాయి. ఆమె అవన్నీ ఒక పుస్తకంలో రాసింది. కుశదాసికి 395 కిలోమీటర్ల దూరంలోని స్మిర్ణా (ఇజ్మిత్) అనే ఊరికి చెందిన లాజరస్ ఆ పుస్తకాన్ని చదవడం జరిగింది. 1891లో అతను ఇక్కడికి వచ్చి, ఆ పుస్తకంలోని గుర్తుల ప్రకారం ఆ ఇంటి కోసం అన్వేషించాడు. ఈ ద్వీపంలోని ఓ మోనాస్ట్రీకి చెందిన శిథిలమైన చర్చ్‌ని కనుగొన్నాడు. ఆ చర్చ్ మేరీ మాత తన చివరి దశలో నివసించిన ఇల్లుగా గుర్తించాడు. దీని పునాదులు క్రీస్తుశకం ఒకటో శతాబ్దానికి చెందినవని శాస్త్రజ్ఞులు నిర్ధారించాక, ఆ పునాదుల మీదే మళ్లీ ఇంటిని నిర్మించారు. వేల మంది పర్యాటకులు ఈ ఇంటిని సందర్శిస్తున్నారు. మా బస్సులో ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా, సెర్బియా, ఇంగ్లండ్, టర్కీ, గ్రీస్ మొదలైన దేశాలకి చెందినవారు కూడా ఉన్నారు. క్యూలో ఈ ఇంట్లోకి వెళ్తే, లోపల మేరీమాత విగ్రహం ఉంది. ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్‌ని ఫీలయ్యే గుణం నాలో నాకు తెలీకుండానే ఏర్పడింది. కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో, మరికొన్ని ప్రధాన ఆలయాల్లో నేను ఫీలైన వైబ్రేషన్స్‌ని ఇక్కడ స్పష్టంగా ఫీలయ్యాను. అలాంటి చోట్ల నాకు తెలియకుండానే కన్నీళ్లూ, ఆనందంతో కూడిన దుఃఖం కలుగుతాయి. ఈ ఇంట్లో కూడా నాకు ఆ అనుభవం కలిగింది. క్రిస్టియన్స్లోని ఓ తెగవారు జీసస్‌ని కాక, మేరీమాతని కొలుస్తారు. ఓ ఆస్ట్రేలియన్ ఆలయం బయట నాతో చెప్పాడు. ‘‘మేరీ ఈజ్ ద ల్యాడర్ ఆఫ్ హెవెన్’’ (స్వర్గానికి మేరీ మాత నిచ్చెన). ఫర్ మదర్ మేరీ హాజ్ డిసెండెడ్ ఫ్రమ్ హెవెన్ ఇన్ టు దిస్ వరల్డ్ (ఎందుకంటే మేరీ మాత స్వర్గం నుంచి ఈ ప్రపంచంలోకి దిగి వచ్చింది) దట్స్‌వై హర్ మెన్ మైట్ ఎసెండ్ ఫ్రమ్ ద ఎర్త్ టు హెవెన్ (మేరీ మాత ద్వారా మనుషులు భూమి నుంచి స్వర్గానికి వెళ్లగలరు). ఆగస్ట్ 2011లో పోలెండ్‌లోని క్రాకోని సందర్శించాను. మా గైడ్ అక్కడి ఓ చర్చిని చూపింది. పోప్ జాన్ పాల్-2 క్రిస్టియన్ ఫాదర్ అయిన కొత్తల్లో ఆ చర్చ్‌లోనే పనిచేసేవాడని చెప్పింది. ఆ సమయంలో ఆయన కరీల్ ఓ టైలా (మొదట్లో చెప్పిన ఉదంతంలోని వ్యక్తి) మాత్రమే. పోప్ జాన్‌పాల్-2 నివసించిన ఇంటిని కూడా (హాస్టల్ లాంటిది) చూశాను. బేలూరులోని రామకృష్ణ పరమహంస నివసించిన గదిని చూసిన సంతోషం లాంటిది ఈ ఇంటిని చూస్తే కలిగింది. అలాగే క్రాకో నగరానికి దక్షిణాన గల ఓటైలా పుట్టిన వడోవైజ్ అనే ఊళ్లోని ఆయన ఇంటిని కూడా మా గైడ్ స్మార్తా చూపించింది. ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చారు. ఆయన తిరిగిన నేలని బస్‌లోంచి చెప్పులు లేకుండా దిగి స్పర్శించాను. ఆది శంకరాచార్య పుట్టిన కాలడిని సందర్శిస్తే కలిగిన ఆనందం కలిగింది. క్రాకోలో ఆయన చదివిన సెమినరీ (క్రిస్టియన్ మతాచార్యుల కాలేజ్)ని కూడా మా గైడ్ బస్సులోంచి చూపించింది. వడోవైజ్తో ఆయన్ని బాప్టైజ్ చేసిన చర్చిలో, ఆయన మరణానికి మునుపు వైద్యులు చిన్న సీసాల్లో తీసుకున్న రక్తాన్ని ఉంచారని గైడ్ చెప్పింది. సెప్టెంబర్ 2014లోని సాలమాంకా నుంచి పోర్చుగల్‌లోని లిస్బన్‌కి బస్సులో వెళుతూ ఉన్నప్పుడు ‘అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా (పోర్చుగీస్ భాషలో నోసా సెన్హోరాడి ఫాతిమా) క్షేత్రాన్ని చూశాను. 1916లో 9 ఏళ్ల లూషియ శాంటోస్, ఆ పాప కజిన్స్ జెసింటా మార్డో(6), ఫ్రాన్స్స్పో మార్డో(9)లకి బ్లెస్డ్ వర్జిన్ మేరీ దర్శనం లభించింది. గొర్రెలు కాచుకునే ఈ పిల్లలు ఫాతిమా అనే ఊరుకి సమీపంలోని అల్జేస్ ట్రీవ్ అనే గ్రామానికి చెందినవారు. గొర్రెలతో వెళితే మేరీమాత ఈ ముగ్గురికి దర్శనం ఇచ్చింది. ఆ పిల్లలకి చదువు రాదు. ఇంటికి వచ్చాక ఆ సంగతి పెద్దలకి చెబితే వాళ్లు కొట్టిపారేశారు. ఆ తర్వాత అనేక సార్లు మేరీమాత దర్శనం వారికి లభించింది. ఓసారి నరకంలోని అగ్నిలో పాపపు ఆత్మలు కాలడం కూడా వారు చూశారు. ఇది చూసిన జెసింతా మనసులో గట్టి ముద్ర పడింది. పిల్లల వర్ణన ప్రకారం ఆమె చేతిలో రోజరీ (జపమాల) ఉండటంతో ఆమెకి ‘అవర్ లేడీ ఆఫ్ రోజరీ’ అనే పేరు, అవర్ లేడీ ఆఫ్ ద మోస్ట్ హోలీ రోజరీ అనే పేరు, ఫాతిమా గ్రామం దగ్గర జరగడంతో ‘అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా’ అనే పేర్లు వచ్చాయి. మేరీ పిల్లలకి చెప్పిన భవిష్యత్తులో రెండో ప్రపంచ యుద్ధం, మరికొన్ని దేశాల మధ్య యుద్ధాలు లాంటివి కూడా ఉన్నాయి. ఆమె దైవాన్ని ఎలా ప్రార్థించాలి, ఆరాధించాలి, త్యాగాలు ఎలా చేయాలి మొదలైనవి పిల్లలకి చెప్పింది. 13మే 1917న జెసింటా సూర్యుడుకన్నా కాంతివంతమైన మేరీమాత నుంచి అత్యంత శక్తివంతమైన కాంతికిరణాలు వెలువడుతుండగా చూసింది. ఆ విషయం తల్లికి చెబితే ఇరుగు, పొరుగు దాన్ని జోక్‌గా కొట్టేశారు. తరువాత 13, జూన్‌లో, 13 జూలైలో కూడా పిల్లలకి మేరీమాత దర్శనం ఇచ్చి మూడు రహస్యాలని చెప్పింది. వీటిని త్రీ సీక్రెట్స్ ఆఫ్ ఫాతిమాగా పిలుస్తారు. (ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే అంశాలే). 1941కల్లా వీటిలోని రెండు నిజంగా జరగడంతో 1943లో బిషప్ మూడో రహస్యం చెప్పమంటే నిరాకరించింది. అది రాసిన కాగితాన్ని కవర్లో ఉంచి, సీల్ చేసి 1960 దాకా తెరవకూడదని కోరింది. 2000లో పోప్ జాన్ పాల్ ॥దీన్ని చదివి అధికారికంగా ప్రకటించగా దాన్ని కాన్సెక్రీషన్ ఆఫ్ రష్యా అని పిలుస్తారు. తర్వాత పెద్దలు కూడా దీన్ని నమ్మి 13 ఆగస్టు 1917న మదర్ మేరీ దర్శనం అవుతుందని అక్కడికి వెళ్లారు. కానీ కాలేదు. ఫ్రాన్సిస్కో 1919లో జెసింటో మార్చి 1920లో చిన్నతనంలోనే మరణించారు. లుసింటా 13 ఫిబ్రవరి 2005న 97వ ఏట మరణించింది. పిల్లలు ఇద్దరి సమాధుల్ని, అవర్ లేడీ ఫాతిమాకి కట్టిన చర్చిని సందర్శించాను. సమీపంలో ఉన్న ఫౌంటెన్లోని నీరు పవిత్రమైనదని చెప్తారు. ఇది తాగితే వ్యాధులు పోతాయట! ఓ సీసాలో ఈ నీటిని తెచ్చి హెబ్సిబారాణి అనే క్రిస్టియన్ ఫ్రెండ్‌కి ఇచ్చాను. కాళ్లు పడిపోయిన వాళ్లు చర్చికి ముందే మోకాళ్ల మీద లోపలికి నడిచి వెళ్తే కాళ్లు బాగవుతాయని స్థానికులు చెప్పారు. ఇక్కడ అనేక మంది మానసిక రోగులు కూడా కనిపించారు. వారికి కూడా స్వస్థత చేకూరుతుందట! 13 మే 1946న పోప్ పయాస్-2 ఇక్కడికి అవర్ లేడీ ఫాతిమా విగ్రహానికి కిరీటాన్ని అమర్చారు. ఎందుకో మేరీ మాత మరణించిందని చెప్పిన కుశదాసిలోని వైబ్రేషన్ నాకు ఈ చర్చిలో కలగలేదు. నేను చూసిన మరో క్రిస్టియన్ విశేషం - అక్టోబర్ 2015లో జర్మన్‌లోని లేడీ ముసా అరబిక్ భాషలో దీని ఆర్థం ‘వ్యాలీ ఆఫ్ మోజెస్ ’. జుడాయిజమ్‌లో, ఇస్లామ్‌లో, క్రిస్టియానిటీలో, బహాయిజమ్లో మోజెస్ ముఖ్యమైన ప్రవక్త. జర్మన్ రాజధాని అమ్మన్ నుంచి ప్రాచీన నగరం పెట్రాకి వెళ్లే దారిలో లేడీ మూసా దగ్గర 240 కిలోమీటర్ల దూరంలో బస్ ఆగింది. మోజెస్ ప్రవక్త ఈ ఎడారి నుంచి వెళ్తూ దానిని అనుసరించేవారి దాహాన్ని తీర్చడానికి ఓ రాతిని కొడితే అది పగిలి నీరు వెలువడిందని బైబిల్ కథనం. ఆ రోజుల్లో పెట్రాని పాలించిన నబాటియన్స్ ఈ నీటి బుగ్గకి అనేక చిన్న కాలువలను తవ్వి పెట్రా నగరానికి దీన్ని తరలించారు. దీనికి గార్డియన్ ఆఫ్ పెట్రా, మోజెస్ వెల్, మోజెస్ వాటర్ స్ప్రింగ్, టోంచ్ ఆరన్ అని పేర్లు. మోజెస్ సోదరులైన అహరోను సమాధి ఈ ప్రాంతంలోనే ఉందని నమ్మకం. ఎక్కడుందో ఎవరికీ తెలియదు. మోజెస్ వెంట ఉండే వారు ఈ ఎడారిలో తప్పిపోయామని పరమాత్మ నిజంగా ఉంటే తమకు నీరు ఇవ్వాలని కోరితే మోజెస్ దైవాన్ని ప్రార్థించి ఈ నీటి బుగ్గని సృష్టించాడని గైడ్ చెప్పింది. బైబిల్లో పేర్కొన్న ఈ ప్రదేశాన్ని 1931లో కనుగొన్నారు. పోప్ జాన్ పాల్-2 కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించారు. మోజెస్ సమాధి కూడా ఇక్కడే ఎక్కడో కొండమీద ఉందట. కానీ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఆయన జ్ఞాపకార్థం మౌంట్ నెబూ మీద ఉంచిన ఆ విగ్రహాన్ని కూడా దర్శించాను. సమీపంలోని మదాబా అనే గ్రామంలోని పురాతన చర్చిలో ఓ పురాతన మొజాయిక్ మ్యాప్ ఉంది. ఆ రోజుల్లో జెరూసలేం భూమికి మధ్యలో ఉందని నమ్మేవారు. క్రీ.శ. 542కి చెందిన ఈ మ్యాప్‌లో మెడిటేరియన్ సీ, ఈస్ట్రన్ డిజర్ట్స, డెడ్‌సీ జెరికో, బెత్లెహేమ్, జోర్డన్, లెబనాన్ లాంటి క్రిస్టియన్ పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. మోజెస్ స్ప్రింగ్ నుంచి కూడా నీటిని పట్టి తెచ్చి కొందరు క్రిస్టియన్ మిత్రులకి ఇచ్చాను. అవకాశం ఉంటే జెరూసలేం, బెత్లెహేమ్ దర్శించాలని, క్రీస్తు శిలువతో నడిచిన దారిలోని మట్టిని స్పృశించాలని నా ఆశ. అలాగే మెక్సికో సిటీ ప్రాంతం లోని టెపియాక్ కూడా చూడాలని ఉంది. అక్కడకు కూడా మేరీమాత గొర్రెలు కాచుకునే ఓ కుర్రాడికి దర్శనాన్ని ఇచ్చింది! 9 డిసెంబర్ 1531న గొర్రెలు కాచుకునే జువాన్ డియాగో అనే పదిహేనేళ్ల కుర్రాడికి చుట్టూ కాంతితో ఉన్న పదహారేళ్ల యువతి దర్శనమిచ్చి, చర్చిని కట్టమని స్థానిక భాషలో కోరింది. అతను బిషప్‌కి ఈ విషయం చెపితే రుజువు కోరాడు. సాధారణ ప్రజలు ఉపయోగించే బట్ట (తిల్మా) మీద వర్జిన్ మేరీ ముఖం ప్రత్యక్షమైంది! నేటికీ ఆ బట్ట మీద మేరీ మాత బొమ్మని చూడొచ్చు. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఆ బట్ట ఈ పాటికి నశించిపోవాలి. అయినా అది చెక్కు చెదరకుండా ఉండడం అద్భుతం అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ప్రతి మతంలోనూ నేనున్నానని పరమాత్మ ఇలా గుర్తు చేస్తూనే ఉంటాడు. మనం చేయాల్సింది ఆయన బోధనలను పాటిస్తూ ఆయన్ని మరచిపోకపోవడం. ఓ రోజు లండన్‌లోని అతి పెద్ద చర్చి సెయింట్ పాల్ క్యాథడ్రిల్‌లో ఓ పేదరాలు నేలమీద మోకాళ్ల మీద కూర్చొని దైవ ప్రార్థన చేస్తూ, పక్కన ఎవరో కూర్చోవడం గమనించింది. చూస్తే ఆవిడ బ్రిటిష్ రాణి విక్టోరియా! దాంతో వెంటనే ఆ పేదరాలు లేచి మరో చోటికి వెళ్లి కూర్చుని ప్రార్థించ సాగింది. విక్టోరియా మహారాణి కూడా లేచి ఆ పేదరాలి పక్కన, దైవ ప్రార్థనకి మోకాళ్ల మీద కూర్చొని ఆమె చెవిలో చెప్పింది. ‘‘నేను సింహాసనం మీద ఉన్నప్పుడే రాణిని. దేవుని సన్నిధిలో మనమంతా సమానమే. లేచి వెళ్లకు.’’ ప్రతి మతం వారు గుర్తుంచుకోదగ్గ, ఆచరించదగ్గ గొప్ప విషయాన్ని ఆ మహారాణి అంత అందంగా చెప్పింది. - మల్లాది వెంకటకృష్ణమూర్తి -
ఆధారం
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 3క్వేల్ కౌంటీ డిప్యూటీ షెరీఫ్ మిల్లర్‌కి ఓ శవం గురించి ఫోన్లో సమాచారం అందింది. వెంటనే అతను సముద్ర తీరానికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ కొందరు జనం గుమిగూడి ఉన్నారు. ఆ శవం ముప్పయ్యేళ్ల యువకుడిది. అతన్ని కొందరు అప్పటికే గుర్తు పట్టారు. అతని పేరు కాల్హాన్. అతని చేతులకు, కాళ్లకు కట్టిన తాళ్లవల్ల అతన్ని సముద్రంలో ముంచి చంపారని మిల్లర్ గ్రహించాడు. ""™ాళ్లను జలచరాలను కొరకడంతో శవం పైకి తేలి, ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్లుంది’’... పోలీస్ డాక్టర్ స్టెబిన్స్, శవానికి అంటుకున్న సముద్రపు నాచుని చూపించి చెప్పాడు. శవాన్ని మార్చురీకి తరలించారు. కాల్హాన్ని ఎవరు చంపితే లాభం ఉంో మిల్లర్ విచారించాడు. కాల్హాన్కి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంది. ఆమె పేరు లూసీ లీ. ఏదైనా కారణంతో ఆమె చంపి ఉంటుందని మిల్లర్ భావించాడు. లూసీ స్థానిక రెస్టారెంట్లో వెయిట్రస్‌గా పని చేస్తోంది. ఆట్టే ఆదాయం లేని ఆమె ఓ చిన్న గదిలో నివసిస్తోంది. కాల్హాన్ భార్య మేరీకి కూడా అతణ్ని చంపే అవకాశం ఉందని మిల్లర్ గ్రహించాడు. ఎందుకంటే, లూసీ లీ గురించి వారి మధ్య అనేకసార్లు పోట్లాట జరిగిన సంగతి హతుడి ఇరుగు పొరుగు చెప్పారు.కాల్హాన్ సోదరుడు జెర్రీకి కూడా అతడి మరణం వల్ల లాభం చేకూరుతుందని విచారణలో మిల్లర్‌కి తెలిసింది. తండ్రి వీలునామా ప్రకారం అన్నదమ్ములిద్దరూ ఆస్తులు పంచుకున్నా... కాల్హాన్ మరణిస్తే అతని ఆస్తి సోదరుడైన జెర్రీకి చెందుతుంది తప్ప భార్యకి కాదు. ఆ వీలునామా రాసే సమయానికి మేరీ అతడికి కేవలం గర్ల్‌ఫ్రెండే. మిల్లర్ ఆ ముగ్గురి ఎలిబీలనీ పరిశీలించాలి అనుకున్నాడు. కాని హత్య జరిగిన తేదీ, సమయం తెలిపే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా అందలేదు. మర్నాడు ఉదయం మిల్లర్‌కి డాక్టర్ స్టెబిన్స్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ తెచ్చి ఇచ్చాడు. అందులోని ఓ విషయం మిల్లర్‌ని ఆశ్చర్యపరిచింది.హత్య జరిగిన సమయంలో ఆ ముగ్గురు అనిమానితుల ఎలిబీలనీ పరిశీలించాడు. లూసీ లీ ఆ సమయంలో తను పనిచేసే రెస్టారెంట్లో ఓ చిన్న పిల్లవాడి పుట్టినరోజు పార్టీకి వెయిట్రస్ పనిలో ఉందని తేలిపోయింది. ఇక హతుడి భార్య మేరీ, సోదరుడు జెర్రీ తమ ఇళ్లలో ఉన్నామని చెప్పారు. వారిద్దరిలో ఎవరు హంతకులో తెలుసుకోవాల్సి ఉంది. అందుకే ఇద్దరు అనుమానితులతో ఓ అబద్ధం చెప్పాడు. ‘‘హతుడి ఊపిరితిత్తుల్లో, పొట్టలో ఉన్న నీరు తాజా నీరు. స్విమ్మింగ్‌పూల్‌కి చెందినది. సముద్రంలో మరణిస్తే ఉప్పు నీళ్లు ఉండాలి. మీరు బాడీని సముద్రం ఒడ్డుకి తరలిస్తుండగా చూసిన ఇద్దరు సాక్షులున్నారు.’’మేరీ తాను హంతకురాలిని కాని కచ్చితంగా చెప్పింది. కాని జెర్రీ ముఖం మాత్రం వాడిపోయింది. తర్వాత డాక్టర్ కూడా హతుడి ఊపిరి తిత్తుల్లో ఉన్న నీటిలోని క్లోరిన్, జెర్రీ స్విమ్మింగ్ పూల్ నీటిలో ఉన్న క్లోరిన్ లెవెల్‌తో సరిపోయిందని నిర్ధారించాడు. మూలం: రిచర్డ్ హార్డ్‌విక్ కథ -
చేయని హత్య
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 1 అమెరికన్ చరిత్రకి చెందిన ఓ రహస్యం నాకు అనుకోకుండా తెలిసింది. దాని కోసం నేనెక్కడికీ వెళ్ళి వెదకలేదు. అది మా ఇంట్లోనే తెలిసింది. మేం చాలా తరాలుగా న్యూయార్క్‌లో నివసిస్తున్నాం. డిసెంబర్ 21, 1820న రిచర్డ్ హిల్‌లో వేలిక్ స్ట్రీట్‌లోని ఓ ఇంటిని మా తాతకి తాత ఏంథోనీ పోర్టర్ కొన్నాడు. దానికి ‘మార్టియర్ హౌస్’ అనే పేరు కూడా పెట్టాడు. న్యూయార్క్‌లోని డౌన్ టౌన్లో గల అతి కొద్ది పురాతన ఇళ్ళలో అదొకటి. స్థానిక చట్టం ప్రకారం దాన్ని పడగొట్టకూడదు. లేకపోతే, ఈపాటికి అక్కడో స్కై స్క్రేపర్ వచ్చి ఉండేది. ఆ రోజు నేను వంట గదిలోని చిమ్నీకి ఉన్న ఓ ఇటుక వదులవడం గమనించాను. దాన్ని సర్దడానికి తీస్తే దాని వెనక నాకు ఓ కవర్ కనిపించింది. తెల్ల రంగు కవర్ గోధుమ రంగులోకి మారడంతో అది పురాతన కవర్ అని గ్రహించాను. అందులోని ఉత్తరం ఎవరికి రాశారో కాని అది ఆ ఇంట్లోంచి ఎందుకనో బయటకి వెళ్లలేదు అని గ్రహించాను. రాసిన వారు దాన్ని అక్కడ ఎందుకు దాచారా అనుకుంటూ ఆ కవర్ని చింపి ఆసక్తిగా చదివాను. జూలై 29, 1776న, న్యూయార్క్‌లోని లెఫ్టినెంట్ జనరల్ సర్ విలియం హోవే అనే బ్రిటిష్ సైనిక కమాండర్‌కి రాసినదా ఉత్తరం. బాతు ఈకతో దళసరి కాగితం మీద రాసిన ఆ ఉత్తరంలోని అక్షరాలు వెలిసిపోయినా, లేత తోపు రంగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఉత్తరం అమెరికన్ చరిత్రనే మార్చి వేన ఉదంతం గల ఉత్తరం అని దాన్ని చదవగానే నాకు అర్థమైంది. ఎస్టీమ్డ్ అండ్ రెస్పెక్టెడ్ లెఫ్టినెంట్ జనరల్ సర్ విలియం హోవే... ఈ ఉత్తరం మీకు అందేసరికి తిరుగుబాటు దళాలకి నాయకత్వం వహించే జార్జి వాషింగ్టన్ మరణిస్తాడు. తల లేని పాము కొంతసేపు కొట్టుకున్నా దాని వల్ల ప్రమాదం ఎలా ఉండదో, అలా తిరుగుబాటు దళాలు కూడా ఇక ప్రమాదరహితం అవుతాయి. నేను కూడా చంపబడొచ్చు. ఐతే అది నాకూ, నా కుటుంబ సభ్యులకి మాత్రమే విషాదకరం. బ్రిటిష్ సామ్రాజ్యానికి మాత్రం ఇది ఆనందకరమవుతుంది. జనరల్ వాషింగ్టన్ దగ్గర వంటవాడిగా పనిచేన నేను మీకు వారి పథకాలు, సైనికుల కదలికల గురించిన సమాచారం ఇస్తూ వస్తున్నాను. ఇప్పుడు బ్రిటిష్ రాజరికానికి గూఢచారిగా మరింత ప్రాముఖ్యం గల సేవని అందించబోతున్నాను. పంటి నొప్పితో బాధపడే వాషింగ్టన్ కొద్ది రోజులుగా ఒంటరిగా భోజనం చేస్తున్నాడు. ఈ రాత్రి ఆయనకి నేను ఉల్లిపాయలు, బంగాళదుంపలలో ఎద్దు మాంసం కలిపి వండే వంటకంలో ప్రాణాంతకమైన స్కార్లెట్ పండుని కలుపుతున్నాను. వాషింగ్టన్ సాహని., యుద్ధ నిపుణుడు. మర్యాద గల మనిషి. తిరుగుబాటు దళాలన్నీ ఆయన్ని గౌరవిస్తాయి. అందువల్ల కింగ్ జార్జి పాలన ఇక్కడ కొనసాగడానికి వీలుగా అతని అడ్డంకిని తొలగించడానికి నేను ఈ రాత్రి తనని చంపుతున్నాను. ఈ ఉత్తరం మళ్ళీ పూర్తి చేస్తాను. పని పూర్తయింది. జనరల్ వాషింగ్టన్ భోజనం చేసి పడుకోడానికి వెళ్ళాడు. ఇక రేపు ఉదయం నిద్ర లేవడు. నేను ఈ ఇంట్లోంచి పారిపోయే అవకాశం లేదు. గట్టి కాపలా ఉంది. రేపు వాషింగ్టన్ విషప్ర యోగంతో మరణించాడని తెలీగానే నన్ను తిరుగుబాటుదారులు చిత్రవధ చేసి చంపుతారు. నేను విషంతో మరణించడానికి ఇష్టపడను. ఉరి వేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. నేను నిత్యం వంటలో ఉపయోగించే కార్వింగ్ నైఫ్‌ని ఉపయోగించి మరణించదలుచుకున్నాను. ఎందుకంటే దాని వినియోగంలో నేను నిపుణుడ్ని. నా భార్యాపిల్లల దక్షతని నేను కింగ్ జార్జికి వదిలి వెళ్తున్నాను. నా పేరు, గౌరవం నాశనమైనా సరే, నేను బ్రిటిష్ సామ్రాజ్యానికి చక్కటి సేవ చేశాననే తృప్తితో పోతాను.డియర్ సర్. ఉంటాను. మీ విధేయుడు, గౌరవనీయమైన సేవకుడు - జాన్ బెయిలీ అమెరికాలో ఓ ప్రముఖ రాజకీయవేత్త హత్య జరగడం ఒక్క జార్జి వాషింగ్టన్ విషయంలోనే సంభవించి ఉండేది. ఐతే ఆ తర్వాత జార్జి వాషింగ్టన్ 1799 దాకా, అంటే మరో ఇరవై మూడేళ్ళు జీవించాడని మనం పాఠాల్లో చదువుకున్నాం. వాషింగ్టన్ మీద హత్యాయత్నం జరిగిందని, ముఖ్యంగా జూలై, 1776లో జరిగిందని ఎక్కడా నమోదు కాలేదు. ఐనా జాన్ బెయిలీ తను చేయని హత్యకి ఫలితం అనుభవించాలనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు! ఎందుకని? సమాధానం తెలుసుకోడానికి నేను ఆసక్తిగా న్యూయార్క్ లైబ్రరీకి వెళ్ళి స్కార్లెట్ మొక్క గురించి లైబ్రేరియన్‌ని అడిగాను. ఆమె కొన్ని రిఫరెన్స్ పుస్తకాలని తిరగేశాక ఓ పుస్తకం ఇచ్చింది. ‘‘ఇందులో మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది’’ అని చెప్పింది. నేను ఓ మూలకి వెళ్ళి కూర్చుని దాని ఇండెక్స్‌ని చదివాను. స్కార్లెట్ ఫ్రూట్ వివరం కనిపించింది. వెంటనే ఆ పేజీని తిప్పాను. అక్కడ ఉన్న స్కార్లెట్ ఫ్రూట్ ఫొటోని కొద్ది క్షణాలు చూశాను. అమెరికాలో 1825 దాకా ఆ పండు విషపూరితం అని నమ్మేవారని రాసిన వాక్యం కూడా చదివాను. ఇప్పుడు ఆ నమ్మకం అబద్ధం అని అందరికీ తెలుసు. ఆ ఫొటోలో ఉన్నది ఒకప్పుడు స్కార్లెట్ ఫ్రూట్‌గా పిలవబడ్డ టొమేటో! మూలం: రిచర్డ్ ఎంగార్డన్ కథ -
త్రీ మంకీస్ - 26
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 26 - మల్లాది వెంకటకృష్ణమూర్తి మగాళ్ళల్లా బాయ్ కట్ క్రాఫ్ హెయిర్ స్టైల్. జీన్స్ పేంట్. టి షర్ట్. పాలరాయిలా తెల్లటి చర్మం. చూపరులని ఇట్టే ఆకట్టుకునే అందం ఆమెది. బట్టల సబ్బు కోసం ఆ విభాగంలోకి వచ్చిన కపీష్ ఆమెని, ఆమె రెండు చేతులతో లాఘవంగా తోసే రెండు ట్రాలీలని చూశాడు. వాటి నిండుగా బ్రష్‌లు, చీపుళ్ళు, క్లీనింగ్ లోషన్లు, హేండ్ శానిటైజర్స్, డెటాల్ బాటిల్స్... ‘‘మే ఐ హెల్ప్ యు?’’ అడిగాడు. ‘‘ఓ! థాంక్స్’’ ఆమె కృతజ్ఞతగా చెప్పింది. ఓ ట్రాలీని తోస్తూ ఆమె పక్కనే నడుస్తూ అడిగాడు. ‘‘మీరు హాస్టల్లో ఉంటారా?’’ ‘‘ఊహూ. దేనికలా అనుకున్నారు?’’ ‘‘ఈ సామాను చూసి’’ ‘‘సిల్లీ. ఇవన్నీ మా ఇంటికే.’’ ఆమెది చాలా పెద్ద ఇల్ల్లై ఉంటుందని, అంటే ధనవంతురాలు అయి ఉంటుందని కూడా కపీష్ భావించాడు. ‘‘మీరు నార్త్ ఇండియనా?’’ అడిగాడు. ‘‘కాదు. తెలంగాణియన్ని. ఏం?’’ ‘‘మీ చర్మం రంగు ఏపిలో కాని, తెలంగాణాలో కాని అరుదు. తమన్నాలా నార్త్ వాళ్ళు బాగా తెల్లగా ఉంటారు.’’ ‘‘మా నాన్న యుపి. మా అమ్మ ఏపి. నేను తెలంగాణియన్ని.’’ ఆ వస్తువులకి ఆమె చెకౌట్ కౌంటర్లో బిల్‌ని చెల్లించాక పార్కింగ్ లాట్ దాకా వెళ్ళి టాటా సఫారీలో వాటిని ఎక్కించాడు. ‘‘మీ ఫోన్ నంబర్?’’ నసిగాడు. ‘‘మీది చెప్పండి.’’ ఆమె తన సెల్ తీసి అతను చెప్పే నంబర్ని నొక్కి కాల్ చేసింది. అతని సెల్‌ఫోన్ మోగాక చెప్పింది. ‘‘ఫీడ్ చేసుకోండి. నా పేరు స్వచ్ఛ.’’ ‘‘స్వేచ్ఛా?’’ ‘‘కాదు. స్వచ్ఛ.’’ ‘‘మీ నాన్న గారి పేరు భారత్ కదా?’’ ‘‘కాదు. భరత్.’’ ‘‘నా పేరు కపీష్. సూపర్ బజార్ అని ఏడ్ చేసుకుంటే నేను గుర్తుండచ్చు’’ సూచించాడు. ‘‘ఆ అవసరం లేదు. ఏ హంసవర్ధనో, మృగాంకో అయితే గుర్తుండకపోవచ్చు. కపీష్ లాంటి పేరు ఎవరికీ ఉండదని పందెం. బై’’ ఆమె వాహనం వెళ్ళిన రెండు నిమిషాలకి స్వచ్ఛకి కాల్ చేశాడు. ‘‘యస్ మిస్టర్ కపీష్. ఏదైనా కింద పడిందా? అప్పటికీ కింద చూసే ఎక్కానే?’’ స్వచ్ఛ మాటలు వినిపించాయి. ‘‘నాకు ఎందుకో దిగులుగా ఉంది’’ అతను చెప్పాడు. ‘‘దేనికి దిగులు?’’ ‘‘దేనికి కాదు. ఎవరి మీద అని అడగండి... మీ మీద... మళ్ళీ ఎప్పుడు చూస్తానో అని! సాయంత్రం మీరు ఫ్రీనేనా?’’ ‘‘ఏ టైంకి?’’ ‘‘ేన బిట్విన్ సిక్స్ అండ్ సెవెన్.’’ ‘‘ఐ యామ్ నాట్ ష్యూర్... యస్ ఫ్రీ’’ మొహమాటపడి చెప్పింది. ‘‘గుడ్. జివికె మాల్లోని ఫుడ్ కోర్టులో కలుద్దామా?’’ ‘‘వైనాట్?’’ ‘‘థాంక్స్. డన్.’’ ‘‘మీకు ఏం ఇష్టం?’’ అడిగాడు. ‘‘మీకు?’’ స్వచ్ఛ అడిగింది. ‘‘మోమోస్ ఓకే?’’ ‘‘ఫైన్. నాన్ ఫేనింగ్, టేస్టీ’’ కపీష్ లేచి వెళ్ళి ఓరియెంటల్ వెజ్ మోమోలు రెండు ప్లేట్లని కొన్నాడు. ఇటీవల మోమోలు ఫుడ్ కోర్టుల్లో ప్రాచుర్యం పొంది యువతని ఆకర్షిస్తున్నాయి. మైదా పిండిని చపాతీలా వత్తి అందులో కేరట్, కేబేజ్, కేప్సికం, ఉల్లిపాయ, బ్రకోలి తరుగుని, అల్లం వెల్లుల్లి, సోయాసాస్, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని ఉంచి అర్ధచంద్రాకారంలో మడిచి పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించి, సోయా, చిలీ సాస్‌లతో సర్వ్ చేసే ఈ సింగపూర్, సౌత్ కొరియా స్నాక్ ఇప్పుడు ఇండియాలో ఇంకా స్ట్ట్రీట్ ఫుడ్‌గా (రోడ్ల మీద బళ్ళ మీదకి) రాలేదు. వెజిటబుల్స్ బదులు చికెన్, ప్రాన్స్, ఫిష్ మొదలైనవి కూడా పెట్టి మోమోలు తయారు చేస్తారు. వాటిని చూసి ఆమె హేండ్ బేగ్లోంచి హేండ్ శానిటైజర్ తీసి అతని చేతులని చాపమని అతని అరచేతుల మీద, తన అరచేతుల మీద పోసి చెప్పింది. ‘‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్ట్ ్సటు గాడ్లీనెస్’’ ‘‘అఫ్కోర్స్. అఫ్కోర్స్.’’ ఆమెతో అరగంట పైనే కబుర్లు చెప్పాడు. ఆమె తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో పెలైట్. తల్లి ఫిజియోథెరపిస్ట్. ‘‘నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ భాషలోని పదాల మీద డాక్టరేట్ చేస్తున్నాను.’’ ‘‘ఓ! పదాల పుట్టుక మీద రీసెర్చా?’’ ‘‘కాదు. నేను ప్రత్యామ్నాయ పదాల మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఆ క్రమంలో ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పదాల కన్నా ఇంకాస్త స్పష్టమైన పదాలని సృష్టించే ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నాను.’’ ‘‘అంటే?’’ ‘‘అమెరికా ఇందులో అందె వేసిన చెయ్యి. ఇలా అక్కడ సృష్టించబడ్డ కొత్త పదాలు ఇంగ్లీష్ స్పీకింగ్ దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. ‘సెకండ్ హేండ్ కారు’ అనగానే అదేదో నాసిరకంది అన్న భావన కలుగుతుంది. కాబట్టి ఆ పరిశ్రమ వారు ‘యూజ్డ్ కార్స్’ అనే కొత్త పేరుని సృష్టించారు. ఇప్పుడు అదీ నాసిరకం అనిపించి ‘ప్రీ-ఓన్డ్ కార్స్’ అనే పదాన్ని సృష్టించారు. ఇలాగే నీగ్రోలని బ్లాక్స్ అనే వాళ్ళు. చర్మం రంగు వివక్షత సరి కాదని ఇప్పుడు ‘ఆఫ్రో-అమెరికన్స్’ అనే పదాన్ని సృష్టించారు. ఈ తరహాలో నేను సృష్టించిన కొన్ని పదాలని మా ప్రొఫెసర్ పేనల్ అప్రూవ్ చేసింది. పేరుని బట్టి ఆ వస్తువేదో స్ఫురించాలి.’’ ‘‘గ్రేట్! కంగ్రాట్స్. మీరు సృష్టించిన పదాలు ఏమిటి?’’ కపీష్ ఆసక్తిగా అడిగాడు. (ఫింగర్ పాంట్స్ అంటే?) -
త్రీ మంకీస్ - 24
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 24 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘అవును. మీకెలా తెలుసు?’’ ‘‘కొన్ని వద్దన్నా తెలిసిపోతూంటాయి. రెండు కేపిటల్స్, రెండు అంకెలు గల ఓ ఎనిమిది నించి పది అక్షరాల పదాన్ని రాయండి’’ సూచించింది. ఐ లవ్ యు లో ఐ బదులు ఒకటి, ఎల్ బదులు నాలుగు వేశాడు. వైయులని కేప్స్లో రాసి చూపించి అడిగాడు. ‘‘ఇది ఓకేనా?’’ ‘‘ఓకే. దీన్ని ఇప్పుడు టైప్ చేసి సబ్మిట్ చేయండి.’’ చివరలో ఆమె పేరు సీతాని కలిపి టైప్ చేసి సబ్మిట్ చేశాడు. పాస్వర్డ్ ఏక్సెప్టెడ్. వెల్కం. నౌ యు ఆర్ ది ప్రౌడ్ ఓనర్ ఆఫ్ ఎకౌంట్ ఇన్ ఫేస్బుక్ అని వచ్చింది. ‘‘ఇంత సింపులా?’’ ఆశ్చర్యపోయాడు. ‘‘వెల్కం టు ఎఫ్బి ఫేమిలీ’’ సీత చిరునవ్వుతో చెప్పింది. ‘‘ఓ! మీరు కూడా ఎఫ్‌బిలో ఎకౌంట్ తెరిచారా?’’ అడిగాడు. ‘‘అవును. స్టేటస్ మార్చుకోడానికి వచ్చాను.’’ ‘‘స్టేటస్ మార్చడమేమిటి? ఎఫ్‌బిలో ఒక్క మాట మీదే ఉండకూడదా?’’ ‘‘ఉండకూడదు.’’ ఆమె ఓపికగా లైక్స్, కామెంట్స్, ఛాట్స్ గురించి, స్టేటస్ మార్చుకోవడం గురించి, ఫ్రెండ్ రిక్వెస్ట్ గురించి బోధించింది. అతన్నించి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని పంపించుకుని ఏక్సెప్ట్ చేని చెప్పింది. ‘‘నేనేం పెట్టినా మీ ఎఫ్బి అకౌంట్లో కనిపిస్తుంది. మీరు అన్నిటికీ లైక్‌లు కొడుతూండాలి. ఎన్ని లెక్స్ వస్తే అంత గొప్ప’’ చెప్పింది. ‘‘లైకేనా? లవ్ కొడతాను’’ వానర్ చెప్పాడు. ‘‘ఇంకా ఆ సౌకర్యం జుకర్‌బెర్గ్ గారు ఇవ్వలేదు. కాబట్టి ప్రస్థుతానికి లైక్ కొట్టండి చాలు.’’ ‘‘జుకర్‌బెర్గ్ గారెవరు?’’ ‘‘ఎఫ్బి బ్రహ్మ లెండి. ఆయన గురించి ఆనక చెప్తా కాని మీరు లేస్తారా?’’ ఆ తర్వాత నిత్యం వానర్ ఎఫ్బిలోకి వెళ్ళి ఆమె పోస్ట్ చేేన ఫొటోలకి లైక్ కొట్టసాగాడు. టివి సీరియల్ చూస్తూ ఆమె అమ్మమ్మ మాడకొట్టిన ముద్ద పప్పు ఫొటోకి లైక్ కొట్టాడు. ఆమె వండిన మొదటి ఆనపకాయ ఆమ్లెట్ (కర్టసీ సాక్షి టివి చానల్)కి లైక్ కొట్టాడు. ఆవిడ నానమ్మకి కాలు విరిగిన ఫొటోకి, ఆవిడ తల్లికి బిపి వచ్చిందన్న ఫొటోకి కూడా లైక్ పెట్టాడు. ఐతే సీతా హరిహరన్ అందుకు కోప్పడలేదు. ఆమె పెట్టిన జోక్స్‌కి కూడా లైక్ పెట్టాడు. వాటిలో ఇదొకటి. నేషనల్ రోబట్- మన్మోహన్ సింగ్ నేషనల్ జోక్ - రజనీకాంత్ నేషనల్ సీక్రెట్ - సోనియా నేషనల్ ఇష్యూ - సల్మాన్ ఖాన్ పెళ్ళి నేషనల్ గెస్ట్స్ - కసబ్, అఫ్జల్ గురు నేషనల్ పేలెస్ - తీహార్ నేషనల్ బేంక్ - స్విస్బేంక్ నేషనల్ డిస్‌గ్రేస్ - ఆంధ్ర ప్రదేశ్ విభజనా విధానం నేషనల్ బర్డ్ - ట్విటర్ నేషనల్ బుక్- ఫేస్బుక్ యధేచ్చగా అతనితో కాఫీడేకి వెళ్ళి సీతా హరిహరన్ గంటల తరబడి మాట్లాడుతూ కూర్చునేది. ఆమె సమక్షంలో వానర్‌కి కాలం తెలీకుండా గడిచిపోయేది. ఇలా లాస్ట్ టర్మ్ దాకా సాగింది. వానర్ ఆ క్రమంలో ఎఫ్బి వ్యసనపరుడైపోయాడు. అందులోకి వెళ్ళేందుకు తలుపు ఉందని తెలుసు కాని బయటకి వచ్చేందుకు తలుపు లేదని తెలీలేదు. అభిమన్యుడికి, ఫేస్బుక్లో ఎకౌంట్ ఉన్న వారికి మధ్య పెద్దగా తేడా ఉండదు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి తేలిగ్గా వెళ్ళగలడు. తిరిగి బయటకి ఎలా రావాలో తెలీదు. ఫేస్బుక్ అకౌంట్ హోల్డర్స్‌కి కూడా అదే సమస్య. ఇక బయటకి రాలేరు. అందులో ఉండనూ లేరు. కాలేజీ ఇంకో రోజులో మూసేస్తారనగా సీతా హరిహరన్ అతనితో ఓ విషయం సీరియస్‌గా చర్చించాలని, కాఫీడేలో కలవమని ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. అది పెళ్ళి గురించని వానర్ తేలిగ్గా ఊహించాడు. ‘‘మై డియర్ వాన్ (ఆమె అతన్ని పిలిచే ముద్దు పేరు) ఇక మనం విడిపోతున్నాం. ఇదే నువ్వు తాగించే ఆఖరి కాఫీ’’ చెప్పింది. పక్కలో బాంబు పడ్డట్లుగా అదిరిపడ్డ వానర్ అడిగాడు. ‘‘అదేమిటి?’’ ‘‘అవును వాన్. ఇంక మనం కలవబోం.’’ ‘‘ఏం?’’ ‘‘నన్ను నీకన్నా రెయిన్ బాగా ప్రేమిస్తున్నాడు.’’ ‘‘రెయినా? వాడెవడు?’’ ‘‘మా సీనియర్. పేరు వర్షిష్. నేను నిన్న రాత్రి కూర్చుని బేరీజు వేసుకున్నాను. అబ్బే! నీ ప్రేమ అతని ప్రేమ ముందు ఇట్టే తేలిపోయింది.’’ ‘‘ఎలా తెలిసింది?’’ కాఫీని, కోపాన్ని మింగి అడిగాడు. (వానర్, సీత హరిహరన్‌ల ప్రేమ ఎందుకు ఫ్లాప్ అయింది?)