ఆధారం
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 3క్వేల్
కౌంటీ డిప్యూటీ షెరీఫ్ మిల్లర్‌కి ఓ శవం గురించి ఫోన్‌లో సమాచారం అందింది. వెంటనే అతను సముద్ర తీరానికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ కొందరు జనం గుమిగూడి ఉన్నారు. ఆ శవం ముప్పయ్యేళ్ల యువకుడిది. అతన్ని కొందరు అప్పటికే గుర్తు పట్టారు. అతని పేరు కాల్‌హాన్. అతని చేతులకు, కాళ్లకు కట్టిన తాళ్లవల్ల అతన్ని సముద్రంలో ముంచి చంపారని మిల్లర్ గ్రహించాడు.
""™ాళ్లను జలచరాలను కొరకడంతో శవం పైకి తేలి, ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్లుంది’’... పోలీస్ డాక్టర్ స్టెబిన్స్, శవానికి అంటుకున్న సముద్రపు నాచుని చూపించి చెప్పాడు. శవాన్ని మార్చురీకి తరలించారు. కాల్‌హాన్‌ని ఎవరు చంపితే లాభం ఉంో మిల్లర్ విచారించాడు. కాల్‌హాన్‌కి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంది. ఆమె పేరు లూసీ లీ. ఏదైనా కారణంతో ఆమె చంపి ఉంటుందని మిల్లర్ భావించాడు. లూసీ స్థానిక రెస్టారెంట్‌లో వెయిట్రస్‌గా పని చేస్తోంది. ఆట్టే ఆదాయం లేని ఆమె ఓ చిన్న గదిలో నివసిస్తోంది.
కాల్‌హాన్ భార్య మేరీకి కూడా అతణ్ని చంపే అవకాశం ఉందని మిల్లర్ గ్రహించాడు. ఎందుకంటే, లూసీ లీ గురించి వారి మధ్య అనేకసార్లు పోట్లాట జరిగిన సంగతి హతుడి ఇరుగు పొరుగు చెప్పారు.కాల్‌హాన్ సోదరుడు జెర్రీకి కూడా అతడి మరణం వల్ల లాభం చేకూరుతుందని విచారణలో మిల్లర్‌కి తెలిసింది. తండ్రి వీలునామా ప్రకారం అన్నదమ్ములిద్దరూ ఆస్తులు పంచుకున్నా... కాల్‌హాన్ మరణిస్తే అతని ఆస్తి సోదరుడైన జెర్రీకి చెందుతుంది తప్ప భార్యకి కాదు. ఆ వీలునామా రాసే సమయానికి మేరీ అతడికి కేవలం గర్ల్‌ఫ్రెండే.
మిల్లర్ ఆ ముగ్గురి ఎలిబీలనీ పరిశీలించాలి అనుకున్నాడు. కాని హత్య జరిగిన తేదీ, సమయం తెలిపే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా అందలేదు.
మర్నాడు ఉదయం మిల్లర్‌కి డాక్టర్ స్టెబిన్స్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ తెచ్చి ఇచ్చాడు. అందులోని ఓ విషయం మిల్లర్‌ని ఆశ్చర్యపరిచింది.హత్య జరిగిన సమయంలో ఆ ముగ్గురు అనిమానితుల ఎలిబీలనీ పరిశీలించాడు. లూసీ లీ ఆ సమయంలో తను పనిచేసే రెస్టారెంట్లో ఓ చిన్న పిల్లవాడి పుట్టినరోజు పార్టీకి వెయిట్రస్ పనిలో ఉందని తేలిపోయింది. ఇక హతుడి భార్య మేరీ, సోదరుడు జెర్రీ తమ ఇళ్లలో ఉన్నామని చెప్పారు. వారిద్దరిలో ఎవరు హంతకులో తెలుసుకోవాల్సి ఉంది. అందుకే ఇద్దరు అనుమానితులతో ఓ అబద్ధం చెప్పాడు.
‘‘హతుడి ఊపిరితిత్తుల్లో, పొట్టలో ఉన్న నీరు తాజా నీరు. స్విమ్మింగ్‌పూల్‌కి చెందినది. సముద్రంలో మరణిస్తే ఉప్పు నీళ్లు ఉండాలి. మీరు బాడీని సముద్రం ఒడ్డుకి తరలిస్తుండగా చూసిన ఇద్దరు సాక్షులున్నారు.’’మేరీ తాను హంతకురాలిని కాని కచ్చితంగా చెప్పింది. కాని జెర్రీ ముఖం మాత్రం వాడిపోయింది. తర్వాత డాక్టర్ కూడా హతుడి ఊపిరి తిత్తుల్లో ఉన్న నీటిలోని క్లోరిన్, జెర్రీ స్విమ్మింగ్ పూల్ నీటిలో ఉన్న క్లోరిన్ లెవెల్‌తో సరిపోయిందని నిర్ధారించాడు.
మూలం: రిచర్డ్ హార్డ్‌విక్ కథ