comedy thriller
-
కామెడీ.. థ్రిల్
పరుచూరి సుదర్శన్, శ్రీ జంటగా రవికిషోర్ బాబు చందిన దర్శకత్వంలో ఓ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు ‘రూమర్స్ డిస్ట్రాయ్ లైఫ్స్’ అనేది ఉపశీర్షిక. యన్. పాండు రంగారావు, కోయ చిన్నరెడ్డయ్య నిర్మిస్తున్న చిత్రం ఇది. శనివారం సుదర్శన్ బర్త్ డే. ఈ సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. యోగి, దొరబాబు, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ బాబి, సునీతా మోహన్, రాజేశ్వరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య. -
టొరెంటోలో ఘనంగా ప్రారంభమైన తెలుగు చిత్రం
6 సినిమాస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో సూర్య బెజవాడ నిర్మాతగా తెరకెక్కుతున్న ఓ సినిమా రీసెంట్గా టొరెంటో తెలుగు ప్రేక్షకల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా టొరెంటో అపూర్వ శ్రీవాస్థవ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నో అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిలింస్‌కు దర్శకత్వం వహించిన వరుణ్ కోరుకొండ తొలిసారి ఫీచర్ ఫిలింను డైరెక్ట్ చేయబోతున్నారు. తన చిత్రాల తరహాలోనే థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతొంది. కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతోన్న ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్, నటుడు వెన్నెల కిషోర్‌లో పాటు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలో కనిపంచనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వరుణ్ కొరుకొండ మాట్లాడుతూ.. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను, టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేస్తామని చెప్పారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర నిర్మాత సూర్య బెజవాడ పేర్కొన్నారు. -
యోగిబాబుతో యాషిక రొమాన్స్
చిన్న చిన్న పాత్రలతో కోలీవుడ్‌లో అంచెలంచెలుగా ఎదిగిన హాస్య నటుడు యోగిబాబు. అలాంటి నటుడిప్పుడు కథానాయకుడి స్థాయికి ఎదిగిపోయాడు. కోలమావు కోకిల చిత్రంలో ఏకంగా అగ్రనటి నయనతారను ఏకపక్షంగా ప్రేమించే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ హాస్య నటుడిప్పుడు చాలా మంది యువ హీరోలకంటే బిజీగా ఉన్నాడు.అందులో పాత్రలతో పాటు, కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు ఉండడం విశేషం. హీరోగా నటించడానికి ఎర్రగా, బుర్రగా, ఆరడుగుల అందగాడై ఉండాల్సిన అవసరం లేదని యోగిబాబు ద్వారా మరోసారి రుజువైంది. నల్లగా, పొట్టిగా, బొజ్జ వంటి ఆకారాలే యోగిబాబుకు నటుడిగా ప్లస్ అయ్యాయని చెప్పాలి. ప్రస్తుతం ఇతను గూర్కా, ధర్మప్రభు చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా జాంబి అనే మరో కొత్త చిత్రంలో కథానాయకుడిగా నటించే అవకాశం యోగిబాబును వరించింది. విశేషం ఏమిటంటే ఇందులో అతనితో నటి యాషికా ఆనంద్ రొమాన్స్ చేయనుండడం. ఇరుట్టు అరైయిల్ మొరట్టు కుత్తు చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమై పాపులర్ అయిన నటి యాషికాఆనంద్. ఆ తరువాత బిగ్‌బాస్ రియాలిటీ షో సీజర్–2లో పాల్గొని ప్రాచుర్యం పొందిన ఈ అమ్మడు ఇప్పుడు ఓడవుమ్ ముడియాదు ఒళిక్కవుమ్ ముడియాదు, కళగు–2, చిత్రాలతో పాటు నటుడు మహత్తో కలిసి ఒక చిత్రంలో నటిస్తోంది. తాజాగా యోగిబాబుతో జాంబి చిత్రంలో నటించడానికి రెడీ అయ్యింది. ఇందులో ఈ బ్యూటీ యోగిబాబుకు ప్రేయసిగా నటించబోతోందట. కామెడీ థ్రిల్లర్ కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని ఎస్–3 పిక్చర్స్ పతాకంపై వసంత్ మహాలింగం, ముత్తులింగం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.భువన్నల్లన్ దర్శకత్వం వహించనున్నారు. -
తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘జిగేల్’
కథ సినిమాతో హీరోగా పరిచయం అయిన అరుణ్ ఆదిత్ ఇటీవల గరుడవేగ సినిమాతో మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘జిగేల్’. శ్రీ ఇందిరా కంబైన్స్ పతాకంపై అల్లం నాగార్జున నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాలో అరుణ్ ఆదిత్ సరసన ‘జంబ లకిడి పంబ’ ఫేమ్ సిద్ధి ఇద్నాని కథానాయికగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మల్లి యేలూరి మాట్లాడుతూ.. ‘కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతొన్న జిగేల్ తొలి షెడ్యూల్ పూర్తయింది. జులై 30 నుంచి రెండో షెడ్యూల్ మొదలవుతుంది. ఆగస్ట్ 20 వరకు జరిగే చిత్రీకరణతో టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. సెప్టెంబర్‌లో సినిమా టోటల్ షూట్ పూర్తి చేస్తామన్నా’రు. చిత్ర నిర్మాత అల్లం నాగార్జున మాట్లాడుతూ.. ‘భారీ తారాగణంతో , కథకు తగ్గ బడ్జెట్ తో తెరకెక్కనున్న హైక్వాలిటీ చిత్రం ‘జిగేల్’. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ది బెస్ట్ టీమ్ వర్క్ చేస్తున్నారు. కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. మా టీమ్ అందరికి జిగేల్ మంచి పేరును తీసుకువస్తుందన్నా’రు. -
థ్రిల్లింత.. నవ్వింత...
‘‘కొన్ని అదృశ్య శక్తుల వల్ల చిత్రాంగద జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొంది?’’ అన్నదే ‘చిత్రాంగద’ కథాంశం’’ అని నిర్మాతలు గంగపట్నం శ్రీధర్, రెహమాన్ అన్నారు. అంజలి ప్రధాన పాత్రలో ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రాంగద’. తమిళంలో ‘యార్నీ’ పేరుతో విడుదలవుతోంది. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో సురక్‡్ష ఎంటర్టైన్ మెంట్ అధినేత మల్కాపురం శివకుమార్ ఈ నెల 10న విడుదల చేస్తున్నారు. తమిళంలో కూడా అదే రోజున ఈ చిత్రం విడుదల కానుంది. ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని థ్రిల్లర్ కామెడీ జానర్లో రూపొందిన చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా ఉంటుంది. స్కీ్రన్ లైట్‌గా ఉన్న ఈ చిత్రంలోని ట్విస్ట్‌లు ప్రేక్షకులను షాక్ గురి చేస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేష్, స్వామినాథన్, కెమెరా: బాల్‌రెడ్డి (హైదరాబాద్), జేమ్స్ క్వాన్, రోహిన్ (యూఎస్ఎ), సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి. -
నవ్వులే....నవ్వులు!
బుల్లితెరపై తమ హాస్యంతో ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తున్న ధన్‌రాజ్, ‘షకలక’ శంకర్, ‘చమ్మక్’ చంద్ర, ‘రాకెట్’ రాఘవ, ‘సుడిగాలి’ సుధీర్ వెండితెరపై సందడి చేయనున్నారు. వీరి కాంబినేషన్లో నెల్లుట్ల ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో కళ్యాణిరామ్ నిర్మిస్తున్న చిత్రం ‘బంతిపూల జానకి’. దీక్షాపంత్ కథా నాయిక. ఈ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ ఏడాదింలో విజయం సాధించే చిత్రాల జాబితాల్లో కచ్చితంగా ఉంటుం దన్న నమ్మకం ఉంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్. బాబు, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్. -
హాస్యరస విచిత్రం...!
సినిమా నేపథ్యంలో సాగే కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘చిత్రం భళారే విచిత్రం’. చాందిని, మనోజ్‌నందం, అనీల్కల్యాణ్ ముఖ్యతారలుగా ప్రకాశ్ బలుసు దర్శకత్వంలో పి.ఉమాకాంత్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ-‘‘రెగ్యులర్ ఫార్మట్‌కు భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: కనకేశ్ రాథోడ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాము. -
క్రైమ్, కామెడీ థ్రిల్లర్‌గా ‘రింగ్ రోడ్’
హైదరాబాద్ : సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్ కథాంశంతో తమ సినిమా రింగ్‌రోడ్ తెరకెక్కనుందని ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత తెలిపారు. చిత్ర విశేషాలను బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. దర్శకుడు దర్శకుడు శరత్ అయాన్ మాట్లాడుతూ.. తాను గతంలో తెలుగులో రెండు, బాలీవుడ్లో ఒక సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశానన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదని, ముగ్గురు హీరోలచుట్టూ కథ తిరుగుతుందన్నారు. జర్మనీకి చెందిన ఎంటీ కవిశంకర్ సంగీతం అందిస్తున్నారన్నారు. నిర్మాత అర్జున్ మాట్లాడుతూ 23ఏళ్ల యువకుడు శరత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారన్నారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ చిత్రం నిర్మిస్తున్నామన్నారు. చిత్ర హీరోలు అభిషేక్ ఆర్య, ప్రణీత్ రెడ్డి, జీ.వి.టిలు పాల్గొన్నారు. -
సరికొత్త కామెడీ థ్రిల్లర్
సత్య సింహా, రుచిక, రాజ్‌పుత్, హారిణి ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతోంది. దాసరి గంగాధర్ దర్శకుడు. గోపూజి కిరణ్ నిర్మాత. ఈ చిత్రం ముహూర్తపు దృశ్యానికి వ్యాపారవేత్త శ్రీరంగం సత్య కెమె రా స్విచాన్ చేయగా, సీనియర్ దర్శకుడు వి.సాగర్ క్లాప్ కొట్టారు. శిరీష్ భరద్వాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. సరికొత్త కామెడీ థ్రిల్లర్ కథాంశంతో సాగే చిత్రమిదని దర్శకుడు చెప్పారు. వచ్చేవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: కార్తీక్ నాయుడు శనక్కాయల, సహ నిర్మాత: పెండ్యాల చక్రవర్తి, లైన్ ప్రొడ్యూసర్: పిట్ల పాండు, సమర్పణ: డి.ఎం.ఎం.సదన్. -
త్రీ మంకీస్ - 26
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 26 - మల్లాది వెంకటకృష్ణమూర్తి మగాళ్ళల్లా బాయ్ కట్ క్రాఫ్ హెయిర్ స్టైల్. జీన్స్ పేంట్. టి షర్ట్. పాలరాయిలా తెల్లటి చర్మం. చూపరులని ఇట్టే ఆకట్టుకునే అందం ఆమెది. బట్టల సబ్బు కోసం ఆ విభాగంలోకి వచ్చిన కపీష్ ఆమెని, ఆమె రెండు చేతులతో లాఘవంగా తోసే రెండు ట్రాలీలని చూశాడు. వాటి నిండుగా బ్రష్‌లు, చీపుళ్ళు, క్లీనింగ్ లోషన్లు, హేండ్ శానిటైజర్స్, డెటాల్ బాటిల్స్... ‘‘మే ఐ హెల్ప్ యు?’’ అడిగాడు. ‘‘ఓ! థాంక్స్’’ ఆమె కృతజ్ఞతగా చెప్పింది. ఓ ట్రాలీని తోస్తూ ఆమె పక్కనే నడుస్తూ అడిగాడు. ‘‘మీరు హాస్టల్లో ఉంటారా?’’ ‘‘ఊహూ. దేనికలా అనుకున్నారు?’’ ‘‘ఈ సామాను చూసి’’ ‘‘సిల్లీ. ఇవన్నీ మా ఇంటికే.’’ ఆమెది చాలా పెద్ద ఇల్ల్లై ఉంటుందని, అంటే ధనవంతురాలు అయి ఉంటుందని కూడా కపీష్ భావించాడు. ‘‘మీరు నార్త్ ఇండియనా?’’ అడిగాడు. ‘‘కాదు. తెలంగాణియన్ని. ఏం?’’ ‘‘మీ చర్మం రంగు ఏపిలో కాని, తెలంగాణాలో కాని అరుదు. తమన్నాలా నార్త్ వాళ్ళు బాగా తెల్లగా ఉంటారు.’’ ‘‘మా నాన్న యుపి. మా అమ్మ ఏపి. నేను తెలంగాణియన్ని.’’ ఆ వస్తువులకి ఆమె చెకౌట్ కౌంటర్లో బిల్‌ని చెల్లించాక పార్కింగ్ లాట్ దాకా వెళ్ళి టాటా సఫారీలో వాటిని ఎక్కించాడు. ‘‘మీ ఫోన్ నంబర్?’’ నసిగాడు. ‘‘మీది చెప్పండి.’’ ఆమె తన సెల్ తీసి అతను చెప్పే నంబర్ని నొక్కి కాల్ చేసింది. అతని సెల్‌ఫోన్ మోగాక చెప్పింది. ‘‘ఫీడ్ చేసుకోండి. నా పేరు స్వచ్ఛ.’’ ‘‘స్వేచ్ఛా?’’ ‘‘కాదు. స్వచ్ఛ.’’ ‘‘మీ నాన్న గారి పేరు భారత్ కదా?’’ ‘‘కాదు. భరత్.’’ ‘‘నా పేరు కపీష్. సూపర్ బజార్ అని ఏడ్ చేసుకుంటే నేను గుర్తుండచ్చు’’ సూచించాడు. ‘‘ఆ అవసరం లేదు. ఏ హంసవర్ధనో, మృగాంకో అయితే గుర్తుండకపోవచ్చు. కపీష్ లాంటి పేరు ఎవరికీ ఉండదని పందెం. బై’’ ఆమె వాహనం వెళ్ళిన రెండు నిమిషాలకి స్వచ్ఛకి కాల్ చేశాడు. ‘‘యస్ మిస్టర్ కపీష్. ఏదైనా కింద పడిందా? అప్పటికీ కింద చూసే ఎక్కానే?’’ స్వచ్ఛ మాటలు వినిపించాయి. ‘‘నాకు ఎందుకో దిగులుగా ఉంది’’ అతను చెప్పాడు. ‘‘దేనికి దిగులు?’’ ‘‘దేనికి కాదు. ఎవరి మీద అని అడగండి... మీ మీద... మళ్ళీ ఎప్పుడు చూస్తానో అని! సాయంత్రం మీరు ఫ్రీనేనా?’’ ‘‘ఏ టైంకి?’’ ‘‘ేన బిట్విన్ సిక్స్ అండ్ సెవెన్.’’ ‘‘ఐ యామ్ నాట్ ష్యూర్... యస్ ఫ్రీ’’ మొహమాటపడి చెప్పింది. ‘‘గుడ్. జివికె మాల్లోని ఫుడ్ కోర్టులో కలుద్దామా?’’ ‘‘వైనాట్?’’ ‘‘థాంక్స్. డన్.’’ ‘‘మీకు ఏం ఇష్టం?’’ అడిగాడు. ‘‘మీకు?’’ స్వచ్ఛ అడిగింది. ‘‘మోమోస్ ఓకే?’’ ‘‘ఫైన్. నాన్ ఫేనింగ్, టేస్టీ’’ కపీష్ లేచి వెళ్ళి ఓరియెంటల్ వెజ్ మోమోలు రెండు ప్లేట్లని కొన్నాడు. ఇటీవల మోమోలు ఫుడ్ కోర్టుల్లో ప్రాచుర్యం పొంది యువతని ఆకర్షిస్తున్నాయి. మైదా పిండిని చపాతీలా వత్తి అందులో కేరట్, కేబేజ్, కేప్సికం, ఉల్లిపాయ, బ్రకోలి తరుగుని, అల్లం వెల్లుల్లి, సోయాసాస్, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని ఉంచి అర్ధచంద్రాకారంలో మడిచి పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించి, సోయా, చిలీ సాస్‌లతో సర్వ్ చేసే ఈ సింగపూర్, సౌత్ కొరియా స్నాక్ ఇప్పుడు ఇండియాలో ఇంకా స్ట్ట్రీట్ ఫుడ్‌గా (రోడ్ల మీద బళ్ళ మీదకి) రాలేదు. వెజిటబుల్స్ బదులు చికెన్, ప్రాన్స్, ఫిష్ మొదలైనవి కూడా పెట్టి మోమోలు తయారు చేస్తారు. వాటిని చూసి ఆమె హేండ్ బేగ్లోంచి హేండ్ శానిటైజర్ తీసి అతని చేతులని చాపమని అతని అరచేతుల మీద, తన అరచేతుల మీద పోసి చెప్పింది. ‘‘క్లీన్లీనెస్ ఈజ్ నెక్ట్ ్సటు గాడ్లీనెస్’’ ‘‘అఫ్కోర్స్. అఫ్కోర్స్.’’ ఆమెతో అరగంట పైనే కబుర్లు చెప్పాడు. ఆమె తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో పెలైట్. తల్లి ఫిజియోథెరపిస్ట్. ‘‘నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ భాషలోని పదాల మీద డాక్టరేట్ చేస్తున్నాను.’’ ‘‘ఓ! పదాల పుట్టుక మీద రీసెర్చా?’’ ‘‘కాదు. నేను ప్రత్యామ్నాయ పదాల మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఆ క్రమంలో ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పదాల కన్నా ఇంకాస్త స్పష్టమైన పదాలని సృష్టించే ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నాను.’’ ‘‘అంటే?’’ ‘‘అమెరికా ఇందులో అందె వేసిన చెయ్యి. ఇలా అక్కడ సృష్టించబడ్డ కొత్త పదాలు ఇంగ్లీష్ స్పీకింగ్ దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. ‘సెకండ్ హేండ్ కారు’ అనగానే అదేదో నాసిరకంది అన్న భావన కలుగుతుంది. కాబట్టి ఆ పరిశ్రమ వారు ‘యూజ్డ్ కార్స్’ అనే కొత్త పేరుని సృష్టించారు. ఇప్పుడు అదీ నాసిరకం అనిపించి ‘ప్రీ-ఓన్డ్ కార్స్’ అనే పదాన్ని సృష్టించారు. ఇలాగే నీగ్రోలని బ్లాక్స్ అనే వాళ్ళు. చర్మం రంగు వివక్షత సరి కాదని ఇప్పుడు ‘ఆఫ్రో-అమెరికన్స్’ అనే పదాన్ని సృష్టించారు. ఈ తరహాలో నేను సృష్టించిన కొన్ని పదాలని మా ప్రొఫెసర్ పేనల్ అప్రూవ్ చేసింది. పేరుని బట్టి ఆ వస్తువేదో స్ఫురించాలి.’’ ‘‘గ్రేట్! కంగ్రాట్స్. మీరు సృష్టించిన పదాలు ఏమిటి?’’ కపీష్ ఆసక్తిగా అడిగాడు. (ఫింగర్ పాంట్స్ అంటే?) -
త్రీ మంకీస్ - 24
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 24 మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘అవును. మీకెలా తెలుసు?’’ ‘‘కొన్ని వద్దన్నా తెలిసిపోతూంటాయి. రెండు కేపిటల్స్, రెండు అంకెలు గల ఓ ఎనిమిది నించి పది అక్షరాల పదాన్ని రాయండి’’ సూచించింది. ఐ లవ్ యు లో ఐ బదులు ఒకటి, ఎల్ బదులు నాలుగు వేశాడు. వైయులని కేప్స్లో రాసి చూపించి అడిగాడు. ‘‘ఇది ఓకేనా?’’ ‘‘ఓకే. దీన్ని ఇప్పుడు టైప్ చేసి సబ్మిట్ చేయండి.’’ చివరలో ఆమె పేరు సీతాని కలిపి టైప్ చేసి సబ్మిట్ చేశాడు. పాస్వర్డ్ ఏక్సెప్టెడ్. వెల్కం. నౌ యు ఆర్ ది ప్రౌడ్ ఓనర్ ఆఫ్ ఎకౌంట్ ఇన్ ఫేస్బుక్ అని వచ్చింది. ‘‘ఇంత సింపులా?’’ ఆశ్చర్యపోయాడు. ‘‘వెల్కం టు ఎఫ్బి ఫేమిలీ’’ సీత చిరునవ్వుతో చెప్పింది. ‘‘ఓ! మీరు కూడా ఎఫ్‌బిలో ఎకౌంట్ తెరిచారా?’’ అడిగాడు. ‘‘అవును. స్టేటస్ మార్చుకోడానికి వచ్చాను.’’ ‘‘స్టేటస్ మార్చడమేమిటి? ఎఫ్‌బిలో ఒక్క మాట మీదే ఉండకూడదా?’’ ‘‘ఉండకూడదు.’’ ఆమె ఓపికగా లైక్స్, కామెంట్స్, ఛాట్స్ గురించి, స్టేటస్ మార్చుకోవడం గురించి, ఫ్రెండ్ రిక్వెస్ట్ గురించి బోధించింది. అతన్నించి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని పంపించుకుని ఏక్సెప్ట్ చేని చెప్పింది. ‘‘నేనేం పెట్టినా మీ ఎఫ్బి అకౌంట్లో కనిపిస్తుంది. మీరు అన్నిటికీ లైక్‌లు కొడుతూండాలి. ఎన్ని లెక్స్ వస్తే అంత గొప్ప’’ చెప్పింది. ‘‘లైకేనా? లవ్ కొడతాను’’ వానర్ చెప్పాడు. ‘‘ఇంకా ఆ సౌకర్యం జుకర్‌బెర్గ్ గారు ఇవ్వలేదు. కాబట్టి ప్రస్థుతానికి లైక్ కొట్టండి చాలు.’’ ‘‘జుకర్‌బెర్గ్ గారెవరు?’’ ‘‘ఎఫ్బి బ్రహ్మ లెండి. ఆయన గురించి ఆనక చెప్తా కాని మీరు లేస్తారా?’’ ఆ తర్వాత నిత్యం వానర్ ఎఫ్బిలోకి వెళ్ళి ఆమె పోస్ట్ చేేన ఫొటోలకి లైక్ కొట్టసాగాడు. టివి సీరియల్ చూస్తూ ఆమె అమ్మమ్మ మాడకొట్టిన ముద్ద పప్పు ఫొటోకి లైక్ కొట్టాడు. ఆమె వండిన మొదటి ఆనపకాయ ఆమ్లెట్ (కర్టసీ సాక్షి టివి చానల్)కి లైక్ కొట్టాడు. ఆవిడ నానమ్మకి కాలు విరిగిన ఫొటోకి, ఆవిడ తల్లికి బిపి వచ్చిందన్న ఫొటోకి కూడా లైక్ పెట్టాడు. ఐతే సీతా హరిహరన్ అందుకు కోప్పడలేదు. ఆమె పెట్టిన జోక్స్‌కి కూడా లైక్ పెట్టాడు. వాటిలో ఇదొకటి. నేషనల్ రోబట్- మన్మోహన్ సింగ్ నేషనల్ జోక్ - రజనీకాంత్ నేషనల్ సీక్రెట్ - సోనియా నేషనల్ ఇష్యూ - సల్మాన్ ఖాన్ పెళ్ళి నేషనల్ గెస్ట్స్ - కసబ్, అఫ్జల్ గురు నేషనల్ పేలెస్ - తీహార్ నేషనల్ బేంక్ - స్విస్బేంక్ నేషనల్ డిస్‌గ్రేస్ - ఆంధ్ర ప్రదేశ్ విభజనా విధానం నేషనల్ బర్డ్ - ట్విటర్ నేషనల్ బుక్- ఫేస్బుక్ యధేచ్చగా అతనితో కాఫీడేకి వెళ్ళి సీతా హరిహరన్ గంటల తరబడి మాట్లాడుతూ కూర్చునేది. ఆమె సమక్షంలో వానర్‌కి కాలం తెలీకుండా గడిచిపోయేది. ఇలా లాస్ట్ టర్మ్ దాకా సాగింది. వానర్ ఆ క్రమంలో ఎఫ్బి వ్యసనపరుడైపోయాడు. అందులోకి వెళ్ళేందుకు తలుపు ఉందని తెలుసు కాని బయటకి వచ్చేందుకు తలుపు లేదని తెలీలేదు. అభిమన్యుడికి, ఫేస్బుక్లో ఎకౌంట్ ఉన్న వారికి మధ్య పెద్దగా తేడా ఉండదు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి తేలిగ్గా వెళ్ళగలడు. తిరిగి బయటకి ఎలా రావాలో తెలీదు. ఫేస్బుక్ అకౌంట్ హోల్డర్స్‌కి కూడా అదే సమస్య. ఇక బయటకి రాలేరు. అందులో ఉండనూ లేరు. కాలేజీ ఇంకో రోజులో మూసేస్తారనగా సీతా హరిహరన్ అతనితో ఓ విషయం సీరియస్‌గా చర్చించాలని, కాఫీడేలో కలవమని ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. అది పెళ్ళి గురించని వానర్ తేలిగ్గా ఊహించాడు. ‘‘మై డియర్ వాన్ (ఆమె అతన్ని పిలిచే ముద్దు పేరు) ఇక మనం విడిపోతున్నాం. ఇదే నువ్వు తాగించే ఆఖరి కాఫీ’’ చెప్పింది. పక్కలో బాంబు పడ్డట్లుగా అదిరిపడ్డ వానర్ అడిగాడు. ‘‘అదేమిటి?’’ ‘‘అవును వాన్. ఇంక మనం కలవబోం.’’ ‘‘ఏం?’’ ‘‘నన్ను నీకన్నా రెయిన్ బాగా ప్రేమిస్తున్నాడు.’’ ‘‘రెయినా? వాడెవడు?’’ ‘‘మా సీనియర్. పేరు వర్షిష్. నేను నిన్న రాత్రి కూర్చుని బేరీజు వేసుకున్నాను. అబ్బే! నీ ప్రేమ అతని ప్రేమ ముందు ఇట్టే తేలిపోయింది.’’ ‘‘ఎలా తెలిసింది?’’ కాఫీని, కోపాన్ని మింగి అడిగాడు. (వానర్, సీత హరిహరన్‌ల ప్రేమ ఎందుకు ఫ్లాప్ అయింది?)