యోగిబాబుతో యాషిక రొమాన్స్‌ | Yogi Babu To Pair Up With Yashika Anand In This Film | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 16 2018 8:29 AM | Last Updated on Sun, Dec 16 2018 8:29 AM

Yogi Babu To Pair Up With Yashika Anand In This Film - Sakshi

చిన్న చిన్న పాత్రలతో కోలీవుడ్‌లో అంచెలంచెలుగా ఎదిగిన హాస్య నటుడు యోగిబాబు. అలాంటి నటుడిప్పుడు కథానాయకుడి స్థాయికి ఎదిగిపోయాడు. కోలమావు కోకిల చిత్రంలో ఏకంగా అగ్రనటి నయనతారను ఏకపక్షంగా ప్రేమించే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ హాస్య నటుడిప్పుడు చాలా మంది యువ హీరోలకంటే బిజీగా ఉన్నాడు.అందులో పాత్రలతో పాటు, కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలు ఉండడం విశేషం.

హీరోగా నటించడానికి ఎర్రగా, బుర్రగా, ఆరడుగుల అందగాడై ఉండాల్సిన అవసరం లేదని యోగిబాబు ద్వారా మరోసారి రుజువైంది. నల్లగా, పొట్టిగా, బొజ్జ వంటి ఆకారాలే యోగిబాబుకు నటుడిగా ప్లస్‌ అయ్యాయని చెప్పాలి. ప్రస్తుతం ఇతను గూర్కా, ధర్మప్రభు చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా జాంబి అనే మరో కొత్త చిత్రంలో కథానాయకుడిగా నటించే అవకాశం యోగిబాబును వరించింది.

విశేషం ఏమిటంటే ఇందులో అతనితో నటి యాషికా ఆనంద్‌ రొమాన్స్‌ చేయనుండడం. ఇరుట్టు అరైయిల్‌ మొరట్టు కుత్తు చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమై పాపులర్‌ అయిన నటి యాషికాఆనంద్‌. ఆ తరువాత బిగ్‌బాస్‌ రియాలిటీ షో సీజర్‌–2లో పాల్గొని ప్రాచుర్యం పొందిన ఈ అమ్మడు ఇప్పుడు ఓడవుమ్‌ ముడియాదు ఒళిక్కవుమ్‌ ముడియాదు, కళగు–2, చిత్రాలతో పాటు నటుడు మహత్‌తో కలిసి ఒక చిత్రంలో నటిస్తోంది.

తాజాగా యోగిబాబుతో జాంబి చిత్రంలో నటించడానికి రెడీ అయ్యింది. ఇందులో ఈ బ్యూటీ యోగిబాబుకు ప్రేయసిగా నటించబోతోందట. కామెడీ థ్రిల్లర్‌ కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని ఎస్‌–3 పిక్చర్స్‌ పతాకంపై వసంత్‌ మహాలింగం, ముత్తులింగం సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.భువన్‌నల్లన్‌ దర్శకత్వం వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement