క్రైమ్, కామెడీ థ్రిల్లర్‌గా ‘రింగ్ రోడ్’ | Ring road movie is suspense, comedy thriller | Sakshi
Sakshi News home page

క్రైమ్, కామెడీ థ్రిల్లర్‌గా ‘రింగ్ రోడ్’

Published Thu, Oct 22 2015 8:53 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 AM

విలేకరుల సమావేశంలో  రింగ్‌రోడ్ చిత్ర దర్శకుడు శరత్ అయాన్ తదితరులు

విలేకరుల సమావేశంలో రింగ్‌రోడ్ చిత్ర దర్శకుడు శరత్ అయాన్ తదితరులు

హైదరాబాద్ : సస్పెన్స్, కామెడీ, థ్రిల్లర్ కథాంశంతో తమ సినిమా రింగ్‌రోడ్ తెరకెక్కనుందని ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత తెలిపారు. చిత్ర విశేషాలను బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. దర్శకుడు దర్శకుడు శరత్ అయాన్ మాట్లాడుతూ.. తాను గతంలో తెలుగులో రెండు, బాలీవుడ్‌లో  ఒక సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశానన్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదని, ముగ్గురు హీరోలచుట్టూ కథ తిరుగుతుందన్నారు. జర్మనీకి చెందిన ఎంటీ కవిశంకర్ సంగీతం అందిస్తున్నారన్నారు.  నిర్మాత అర్జున్ మాట్లాడుతూ 23ఏళ్ల యువకుడు శరత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారన్నారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ చిత్రం నిర్మిస్తున్నామన్నారు.  చిత్ర హీరోలు అభిషేక్ ఆర్య, ప్రణీత్ రెడ్డి, జీ.వి.టిలు పాల్గొన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement