టొరెంటోలో ఘనంగా ప్రారంభమైన తెలుగు చిత్రం | Vennela Kishore Upcoming Comedy Thriller Movie Starts in Toronto | Sakshi
Sakshi News home page

టొరెంటోలో ఘనంగా ప్రారంభమైన తెలుగు చిత్రం

Published Mon, Dec 12 2022 12:47 PM | Last Updated on Mon, Dec 12 2022 12:47 PM

Vennela Kishore Upcoming Comedy Thriller Movie Starts in Toronto - Sakshi

6 సినిమాస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో సూర్య బెజవాడ నిర్మాతగా తెరకెక్కుతున్న ఓ సినిమా రీసెంట్‌గా టొరెంటో తెలుగు ప్రేక్షకల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా టొరెంటో అపూర్వ శ్రీవాస్థవ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నో అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిలింస్‌కు దర్శకత్వం వహించిన వరుణ్ కోరుకొండ తొలిసారి ఫీచర్ ఫిలింను డైరెక్ట్ చేయబోతున్నారు. తన చిత్రాల తరహాలోనే థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతొంది.

కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతోన్న ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్‌, నటుడు వెన్నెల కిషోర్‌లో పాటు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలో కనిపంచనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ వరుణ్‌ కొరుకొండ మాట్లాడుతూ.. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను, టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను విడుదల చేస్తామని చెప్పారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర నిర్మాత సూర్య బెజవాడ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement