సోషల్ మీడియాలో అసందర్భంగా కామెంట్ చేసిన ఓ వ్యక్తికి పుణె పోలీసులు గట్టి కౌంటర్ ఇచ్చారు. సాయం కోసం ప్రయత్నించిన మహిళ ఫోన్ నెంబర్ కావాలని అడగడంతో.. పోలీసులు అతనికి తమదైన శైలిలో జవాబిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ న్యాయ విధ్యార్థిని ధనోరి పోలీస్ స్టేషన్ నెంబర్ కావాలని ట్విటర్‌లో పూణె పోలీసులను కోరింది. దీనిపై స్పందించిన పూణె పోలీసు ట్విటర్ అధికార విభాగం.. ఆ మహిళకు ధనోరి పోలీస్ స్టేషన్ నెంబర్‌ను షేర్ చేశారు. అయితే ఇక్కడే ఓ నెటిజన్ పోలీసుల ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘ప్లీజ్ నాకు ఆమె నెంబర్ ఇవ్వగలరా’ అని కామెంట్ చేశాడు.
అతను అలా కామెంట్ చేయడంపై పూణె పోలీసులు ఘాటుగా స్పందించారు. అతన్ని హెచ్చరించడంతో పాటు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సార్, ప్రస్తుతం మీ నెంబర్ తెలుసుకోవడానికి మేము ఎక్కువ ఆసక్తిగా ఉన్నాం. ఎందుకంటే.. మహిళల నెంబర్లపై మీకు ఎందుకంతా ఆసక్తి ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మీ గోప్యతకు మేము గౌరవం ఇస్తాం. అందుకే మీకు డైరక్ట్ మేసేజ్ చేస్తాం’ అని పేర్కొన్నారు. మహిళల పట్ల చులకన భావం ప్రదర్శించిన సదరు నెటిజన్‌కు పోలీసులు గట్టి కౌంటర్ ఇవ్వడంతో.. వారిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
@PuneCityPolice Can I get the number of Dhanori police station please. Need urgently!
— Nidhi Doshi (@nidhidoshi12) January 12, 2020
@PuneCityPolice can i get her number please ?
— Chiklu (@abirchiklu) January 12, 2020
Sir, we are more interested in your number currently, to understand your interest in the lady’s number. You may DM. We respect privacy. https://t.co/LgaD1ZI2IT
— PUNE POLICE (@PuneCityPolice) January 12, 2020
Comments
Please login to add a commentAdd a comment