Company Sparks Controversy By Rejecting Applicants With Number 5 - Sakshi

ఇదేమి రిక్రూటింగ్‌ పాలసీ: ఫోన్‌ నంబర్‌ మార్చుకుంటేనే ఉద్యోగం!

Published Mon, Sep 19 2022 7:48 AM | Last Updated on Mon, Sep 19 2022 9:17 AM

Company Sparks Controversy by Rejecting Applicants With Number 5 - Sakshi

ఓ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకపోవడానికి ప్రధాన కారణాలేముంటాయి? అతనికి సరైన క్వాలిఫికేషన్స్‌ లేకపోవడం, ఆ పొజిషన్‌కు సరిపోడను కోవడం.. వగైరా. కానీ కేవలం ఫోన్‌ నెంబర్‌ లో ఓ దురదృష్టకరమైనసంఖ్య ఉందని చెప్పి.. అభ్యర్థులను తిరస్కరించింది ఓ చైనీస్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీ. ఫోన్‌నెంబర్‌లోని 5వ స్థానంలో నెంబర్‌ 5 ఉన్న అభ్యర్థులను వెనక్కి పంపించేసింది. ఆ ఉద్యోగం తప్పనిసరిగా కావాలనుకుంటే... మొబైల్‌ నెంబర్‌ మార్చుకొని రావాలని సూచించింది. గాంగ్‌డాంగ్‌లోని షెంగెన్‌కు చెందిన ఎడ్యుకేషన్‌ కంపెనీ పెట్టిన ఈ నిబంధన చూసి జనం నవ్వుకుంటున్నారు.

ఎంత అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ అతీత శక్తులను, మూఢనమ్మకాలను అనుసరించే చైనా సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఎడ్యుకేషన్‌ కంపెనీ ఇలాంటి పిచ్చి రిక్రూటింగ్‌ పాలసీలు పెట్టడమేంటని మండిపడుతున్నారు. ఇది వివక్ష చూపడమే నంటున్నారు. ఉద్యోగులను కాకుండా జ్యోతిష్యం చెప్పే ‘ఫెంగ్‌ షూయ్‌ మాస్టర్‌’ను రిక్రూట్‌ చేస్తే మంచిదని ఎద్దేవా చేస్తున్నారు. అయితే... పురాతన చైనీస్‌ భవిష్యవాణి ‘బుక్‌ ఆఫ్‌ చేంజెస్‌’ ప్రకారం ఐదు దురదృష్టకరమైన సంఖ్యని, అందుకే కొందరు దాన్ని అనుసరిస్తారని చైనీస్‌ సంఖ్యాశాస్త్ర నిపుణుడు, బ్లాగర్‌ జిమెంజున్‌ చెబుతున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement