unlucky
-
బీజేపీకి అచ్చిరాని 13! గతంలోనూ ఇలా..
సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకుపోయే పాశ్చాత్య దేశాలు సైతం వణికిపోచే నెంబర్ 13. దురదృష్ట సంఖ్యగా, అపశకునంగా భావిస్తాయి చాలా దేశాలు(మన దేశంలో కాదులేండి). అందుకే ఆ నెంబర్‌కు దూరంగా ఉండే యత్నం చేస్తుంటారు. అయితే ఈ నెంబర్ భారతీయ జనతా పార్టీకి కూడా అచ్చిరాదేమో అనిపిస్తోంది. ఆ సెంటిమెంట్ ఇవాళ్టి(మే 13వ తేదీ) కర్ణాటక ఎన్నికల ఓటమి ఫలితంతో బలపడగా.. అంతకు ముందు జరిగిన పరిణామాలను ఓసారి గమనిస్తే.. 👉 దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని వాజ్‌పేయి నేతృత్వంలో 1996 మే 16వ తేదీన ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే, మెజార్టీని నిరూపించుకోలేకపోవడంతో కేవలం 13 రోజుల్లోనే ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేశారు. 👉 1996-1998 మధ్న రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడియాయి. ఆపైత లోక్‌సభ రద్దై, 1998 లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టకుని ఎన్టీయే కూటమిగా ఏర్పడిన బీజేపీ.. వాజ్‌పేయిని మళ్ళీ ప్రధానిని చేసింది. కానీ, ఏడాది తిరిగాక.. కూటమికి పగళ్లు వచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి అటల్జీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. 1999 ఏప్రిల్ 17న జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోవడంతో ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేశారు. అలా రెండోసారి వాయ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కూడా కేవలం 13 నెలల కాలం కొనసాగింది. 👉 ఇక మే 13వ తేదీ సైతం బీజేపీ కలిసి రాలేదేమో!. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఓటమి పాలైంది. అయితే అప్పుడు ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది మే 13వ తేదీనే. 👉 2004లోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే 13 సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుందో ఏమో.. ఆ ఏడాది అక్టోబర్ 13వ తేదీన జరగాల్సిన పోలింగ్‌ను వాయిదా వేయాలంటూ అప్పట్లో బీజేపీ అప్పటి మిత్రపక్షం శివసేనతో కలిసి ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఆ తేదీన సర్వ ప్రీతి అమవాస్య ఉందని, హిందువులకు పవిత్రమైన ఆ తేదీన ఎన్నికలు జరపొద్దని కోరింది. కానీ, ఈసీ ఆ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఆ ఎన్నికల్లో కూటమి దారుణంగా ఓటమిపాలైంది. 👉 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ 13 ఫలితం రిపీట్ అయ్యింది. మే 13 అంటే ఇవాళ జరిగిన కౌంటింగ్‌లో అధికార పార్టీ హోదాలో బీజేపీ కన్నడనాట దారుణంగా ఓటమి పాలైంది. దీంతో 13 సెంటిమెంట్ బీజేపీ శ్రేణుల్లో మరింత బలపడే ఛాన్స్ కనిపిస్తోంది. -
ఇదేమి రిక్రూటింగ్ పాలసీ: ఫోన్ నంబర్ మార్చుకుంటేనే ఉద్యోగం!
ఓ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకపోవడానికి ప్రధాన కారణాలేముంటాయి? అతనికి సరైన క్వాలిఫికేషన్స్ లేకపోవడం, ఆ పొజిషన్‌కు సరిపోడను కోవడం.. వగైరా. కానీ కేవలం ఫోన్ నెంబర్ లో ఓ దురదృష్టకరమైనసంఖ్య ఉందని చెప్పి.. అభ్యర్థులను తిరస్కరించింది ఓ చైనీస్ ఎడ్యుకేషన్ కంపెనీ. ఫోన్‌నెంబర్‌లోని 5వ స్థానంలో నెంబర్ 5 ఉన్న అభ్యర్థులను వెనక్కి పంపించేసింది. ఆ ఉద్యోగం తప్పనిసరిగా కావాలనుకుంటే... మొబైల్ నెంబర్ మార్చుకొని రావాలని సూచించింది. గాంగ్డాంగ్లోని షెంగెన్కు చెందిన ఎడ్యుకేషన్ కంపెనీ పెట్టిన ఈ నిబంధన చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎంత అభివృద్ధి చెందినా.. ఇప్పటికీ అతీత శక్తులను, మూఢనమ్మకాలను అనుసరించే చైనా సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తపై వాడీవేడి చర్చ నడుస్తోంది. ఎడ్యుకేషన్ కంపెనీ ఇలాంటి పిచ్చి రిక్రూటింగ్ పాలసీలు పెట్టడమేంటని మండిపడుతున్నారు. ఇది వివక్ష చూపడమే నంటున్నారు. ఉద్యోగులను కాకుండా జ్యోతిష్యం చెప్పే ‘ఫెంగ్ షూయ్ మాస్టర్’ను రిక్రూట్ చేస్తే మంచిదని ఎద్దేవా చేస్తున్నారు. అయితే... పురాతన చైనీస్ భవిష్యవాణి ‘బుక్ ఆఫ్ చేంజెస్’ ప్రకారం ఐదు దురదృష్టకరమైన సంఖ్యని, అందుకే కొందరు దాన్ని అనుసరిస్తారని చైనీస్ సంఖ్యాశాస్త్ర నిపుణుడు, బ్లాగర్ జిమెంజున్ చెబుతున్నాడు. -
అత్యంత దురదృష్టవంతులు వీరే.. ఏకంగా రూ.31 కోట్లు మిస్సయ్యారు
లండన్: లాటరీ టికెట్ అంటే ఓ రకంగా చెప్పాలంటే జూదం. లక్షల్లో టికెట్ కొంటే ఒక్కరిని మాత్రమే అదృష్టం వరిస్తుంది. అలా మన ఇంటికి వచ్చిన అదృష్టాన్ని.. మన చేతులారా మనమే పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది.. ఆ బాధను వర్ణించడానికి మాటలు చాలవు. గత 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు బ్రిటన్‌కు చెందిన మార్టిన్ టాట్ అతడి భార్య కే. వీరి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో వీరికంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరని జాలిపడుతున్నారు. కారణం ఏంటంటే ఈ జంట కొన్న టికెట్‌కే లాటరీ తగిలింది. అది కూడా ఏ కోటి, రెండు కోట్లో కాదు.. ఏకంగా 31 కోట్ల రూపాయలు. కానీ ఏం లాభం వారి దగ్గర ఆ టికెట్ లేదు. లాటరీ తగిలిన ఆనందం కన్నా టికెట్ పొగుట్టుకున్న విషమే వారిని ఎక్కువ బాధించింది. 20 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పటికి వారిని ఎంతో బాధిస్తుంది. ఆ వివరాలు.. (చదవండి: ఆటో డ్రైవర్‌ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.12 కోట్లు) ఇరవై ఏళ్ల అనగా 2001 సంవత్సరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మార్టిన్, అతడి భార్య కే ప్రతి వారం లాటరీ గేమ్‌లో పాల్గొనేవారు. ఈ క్రమంలో ఓ సారి అదృష్టం బాగుండి కే కొన్న టికెట్‌కే లాటరీ తగిలింది. దాని విలువ ఏకంగా 31 కోట్ల రూపాయలు. ఇక తమ కష్టాలు అన్ని తీరిపోతాయి.. కోటీశ్వరులం అవుతామని కలలు కంటున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. కే కొన్న లాటరీ టికెట్ కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో కే లాటరీ నిర్వహిస్తున్న యాజమాన్యం దగ్గరకు వెళ్లి.. తాను కొన్న టికెట్‌కే లాటరీ తగిలిందని.. కావాలంటే తన టికెట్ నంబర్ని కంప్యూటర్లో చెక్ చేయవచ్చని కోరింది. కానీ సదరు కంపెనీ ససేమిరా అన్నది. టికెట్‌ని తీసుకువచ్చి చూపిస్తేనే ప్రైజ్‌మనీని ఇస్తామని స్పష్టం చేసింది. 30 రోజుల్లోపు పోగొట్టుకున్న టికెట్‌ని తీసుకువస్తే.. ప్రైజ్‌మనీని వారికి అందజేస్తామంది. కానీ దురదృష్టం కొద్ది టికెట్ దొరకలేదు. ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. చేతికొచ్చిన ముద్ద నోటికందకుండా పోయిందే అంటూ కే దంపతుల పరిస్థితిపై జాలి పడ్డారు జనాలు. (చదవండి: యూరోకప్ టోర్నమెంట్ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ.10 కోట్లు) ఈ లాటరీ ప్రైజ్‌మనీ కోసం కే దంపతులు ఐదు సంవత్సరాల పాటు పోరాటం చేశారు. కానీ లాభం లేకుండాపోయింది. ఈ క్రమంలో వారి మధ్య బంధం కూడా బీటలు వారింది. 31 కోట్ల రూపాయలు చేతికందకుండా పోయాననే బాధతో ఇరువురు ఒకరినొకరు దూషించుకోసాగారు. అలా వారి సంసారంలో కలహాలు మొదలయ్యాయి. చివరకు వారిద్దరు విడాకులు తీసుకున్నారు. పాపం లాటరీ ప్రైజ్‌మనీ దక్కలేదు.. ఇటు వివాహ బంధం నిలవలేదు. వీరి గురించి విన్న ప్రతి ఒక్కరు ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతులు వీరేనని సానుభూతి చూపుతారు. చదవండి: నిజాయతీ: చేతికి దొరికిన రూ.7 కోట్లు తిరిగిచ్చేశారు -
ప్రేమలో నాకెపుడూ చుక్కెదురే..
ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన కిక పెళ్లి యోగం లేదేమోనని బెంగ పడుతున్నాడట. ఇటీవల ఒక మీడియా సంస్థ నిర్వహిస్తున్న రియాల్టీ షో కు విచ్చేసిన సల్మాన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా పెళ్లి ఎపుడు అని మీడియా ప్రశ్నించినపుడు తాను ఆ విషయంలో ఎపుడూ దురదృష్ట వంతుడినేనని సమాధానం ఇచ్చాడట. అంతేకాదు.. పెళ్లి చేసుకోవాలని తాను ఉవ్విళ్లూరుతున్నానని.. పడి చచ్చిపోతున్నానని ..అయితే తనకు అదృష్టం కలసి రావడం లేదని వ్యాఖ్యానించాడు. ఎపుడూ అవతలి వ్యక్తి( అమ్మాయి) ఆమోదం కోసం ఎదురు చూడాల్సి వస్తోందని తెలిపాడు. పెళ్లి విషయంలో మగాళ్లు చేసేదేమీ లేదని..అంతా ఆడవాళ్లే నిర్ణయిస్తారని కమెంట్ చేశాడు. కాగా బాలీవుడ్ బాచిలర్ బాబు సల్మాన్ తరచూ ప్రేమ వివాదాల్లో నిలవడం మామూలే. గతంలో అగ్ర హీరోయిన్లతో ప్రేమాయణం సాగించడం.. అది పెళ్లి దాకా రాకపోవడం తెలిసిందే. సంగీతా బిజ్లాని , ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ తదితర స్టార్ హీరోయిన్లు ఈ కోవలోకి వస్తారు. అయితే ఇటీవల లులియా వాంతూర్ తో పెళ్లి దాదాపు ఖాయమనే వార్తలు బీ టౌన్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.