సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకుపోయే పాశ్చాత్య దేశాలు సైతం వణికిపోచే నెంబర్ 13. దురదృష్ట సంఖ్యగా, అపశకునంగా భావిస్తాయి చాలా దేశాలు(మన దేశంలో కాదులేండి). అందుకే ఆ నెంబర్‌కు దూరంగా ఉండే యత్నం చేస్తుంటారు. అయితే ఈ నెంబర్ భారతీయ జనతా పార్టీకి కూడా అచ్చిరాదేమో అనిపిస్తోంది. ఆ సెంటిమెంట్ ఇవాళ్టి(మే 13వ తేదీ) కర్ణాటక ఎన్నికల ఓటమి ఫలితంతో బలపడగా.. అంతకు ముందు జరిగిన పరిణామాలను ఓసారి గమనిస్తే..
👉 దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని వాజ్‌పేయి నేతృత్వంలో 1996 మే 16వ తేదీన ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే, మెజార్టీని నిరూపించుకోలేకపోవడంతో కేవలం 13 రోజుల్లోనే ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేశారు.
👉 1996-1998 మధ్న రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడియాయి. ఆపైత లోక్‌సభ రద్దై, 1998 లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టకుని ఎన్టీయే కూటమిగా ఏర్పడిన బీజేపీ.. వాజ్‌పేయిని మళ్ళీ ప్రధానిని చేసింది. కానీ, ఏడాది తిరిగాక.. కూటమికి పగళ్లు వచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి అటల్‌జీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. 1999 ఏప్రిల్ 17న జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోవడంతో ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేశారు. అలా రెండోసారి వాయ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కూడా కేవలం 13 నెలల కాలం కొనసాగింది.
👉 ఇక మే 13వ తేదీ సైతం బీజేపీ కలిసి రాలేదేమో!. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఓటమి పాలైంది. అయితే అప్పుడు ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది మే 13వ తేదీనే.
👉 2004లోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే 13 సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుందో ఏమో.. ఆ ఏడాది అక్టోబర్ 13వ తేదీన జరగాల్సిన పోలింగ్‌ను వాయిదా వేయాలంటూ అప్పట్లో బీజేపీ అప్పటి మిత్రపక్షం శివసేనతో కలిసి ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఆ తేదీన సర్వ ప్రీతి అమవాస్య ఉందని, హిందువులకు పవిత్రమైన ఆ తేదీన ఎన్నికలు జరపొద్దని కోరింది. కానీ, ఈసీ ఆ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఆ ఎన్నికల్లో కూటమి దారుణంగా ఓటమిపాలైంది.
👉 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ 13 ఫలితం రిపీట్ అయ్యింది. మే 13 అంటే ఇవాళ జరిగిన కౌంటింగ్‌లో అధికార పార్టీ హోదాలో బీజేపీ కన్నడనాట దారుణంగా ఓటమి పాలైంది. దీంతో 13 సెంటిమెంట్ బీజేపీ శ్రేణుల్లో మరింత బలపడే ఛాన్స్ కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment