sentiment
-
రష్మిక డిసెంబర్ సెంటిమెంట్ రిపీట్?
-
రియల్ ఎస్టేట్ ఆఖరి ఆరు నెలలూ సానుకూలం
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో (2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు) సానుకూల పనితీరు చూపించనుంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంపై రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్‌ను నైట్‌ఫ్రాంక్, నరెడ్కో సంయుక్తంగా విడుదల చేశాయి.ఏప్రిల్–జూన్ క్వార్టర్‌కు సెంటిమెంట్ స్కోరు 65గా ఉంటే, జూలై–సెప్టెంబర్‌లో 64కు తగ్గింది. అయితే భవిష్యత్ సెంటిమెంట్ స్కోర్ మాత్రం 65 నుంచి 67కు పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో రియల్టీ పరిశ్రమ వృద్ధి పట్ల ఉన్న విశ్వాసాన్ని ఇది తెలియజేస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్, నరెడ్కో నివేదిక తెలిపింది. రియల్ ఎస్టేట్ పరిశ్రమకు సంబంధించి సరఫరా వైపు భాగస్వాములు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ల అంచనాలు, ఆర్థిక వాతావరణం, నిధుల లభ్యతను ఈ సూచీ తెలియజేస్తుంది.స్కోర్ 50గా ఉంటే తటస్థంగా, 50కి పైన సానుకూలంగా, 50కి దిగువన ప్రతికూల ధోరణిని ప్రతిఫలిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుత, భవిష్యత్ సెంటిమెంట్ రెండూ సానుకూల శ్రేణిలోనే ఉన్నట్టు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయని, పరిశ్రమ దీర్ఘకాల సామర్థ్యాలపై స్థిరమైన విశ్వాసానికి నిదర్శనమని నివేదిక పేర్కొంది. ఇళ్ల మార్కెట్లోనూ సానుకూలత: ఇళ్ల మార్కెట్లో భవిష్యత్ సెంటిమెంట్ సానుకూలంగా నమోదైంది. ధరలు పెరుగుతాయని 62 శాతం మంది అంచనా వేస్తుంటే, అమ్మకాలు పెరుగుతాయని 40 శాతం మంది భాగస్వాములు అంచనా వేస్తున్నారు. 38 శాతం మంది మార్కెట్ స్థిరంగా ఉంటుందని భాస్తున్నారు. ఆఫీస్ మార్కెట్లో లీజింగ్, సరఫరా, అద్దెల పరంగా బలమైన సానుకూలత కనిపించింది. రానున్న నెలల్లో ఆఫీస్ మార్కెట్ బలమైన పనితీరు చూపిస్తుందన్న అంచనాలున్నట్టు నివేదిక తెలిపింది.అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ బలంగా ఉండడడాన్ని సెంటిమెంట్ సూచీ తెలియజేస్తోందని నరెడ్కో ప్రెసిడెంట్ హరిబాబు పేర్కొన్నారు. ‘‘2024–25 సంవత్సరానికి జీడీపీ 7.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ చెబుతోంది. స్థిరమైన వడ్డీ రేట్లతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ మరింత బలపడుతుంది. స్థిరమైన వృద్ధికి గాను ఈ రంగం సవాళ్లను పరిష్కరించుకుని, అవకాశాలు అందిపుచ్చుకోవాలి’’అని వివరించారు. -
నాన్న... ఓ సూపర్ హీరో
చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించి, జీవితంలో మెట్టు మెట్టు పైకి ఎక్కించే నాన్నని చాలామంది తమ ‘సూపర్ హీరో’లా భావిస్తారు. అందుకే కొందరు నాన్న ప్రేమను, ఆస్తిని మాత్రమే కాదు పగను కూడా పంచుకుంటారు. నాన్నని కష్టాలపాలు చేసినవారిపై పగ తీర్చుకుంటారు. మొత్తానికి నాన్నతో ఓ ఎమోషనల్ బాండింగ్ పెంచుకుంటారు. రానున్న కొన్ని చిత్రాల్లో తండ్రీ కొడుకుల రివెంజ్, ఎమోషనల్ డ్రామా వంటివి ఉన్నాయి. నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ⇒ ‘సలార్’లో తండ్రీకొడుకుగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ గత డిసెంబరులో విడుదలైంది. ఈ చిత్రంలో కొడుకు దేవా పాత్రలో ప్రభాస్ కనిపించారు. మలి భాగం ‘సలార్: శౌర్యాంగపర్వం’లో దేవా తండ్రి ధారా పాత్రకు చెందిన విషయాలు ఉంటాయి. తండ్రికి దక్కాల్సిన ఖాన్సార్ సామ్రాజ్యాధికారం, గౌరవాన్ని తాను తిరిగి తెచ్చుకునేందుకు దేవా ఏం చేస్తాడనేది మలి భాగంలో ఉంటుందని భోగట్టా. ఫస్ట్ పార్ట్‌లో కొడుకు పాత్రలో కనిపించిన ప్రభాస్ మలి భాగంలో తండ్రీకొడుకుగా కనిపిస్తారట. ⇒ తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే కొడుకు పాత్రలో ఎన్టీఆర్‌ను ‘దేవర’ చిత్రంలో చూడబోతున్నామట. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న సినిమా ‘దేవర’. భారతదేశంలో విస్మరణకు గురైన తీర్రపాంతాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తండ్రీ కొడుకుగా ఎన్టీఆర్ నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి.. దేవర (తండ్రి పాత్ర)ను ఎవరు మోసం చేశారు? ఎందుకు చేశారు? అనేది థియేటర్స్‌లో చూడాలి. తొలి భాగం సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. తొలి భాగంలో కొడుకు పాత్ర ప్రస్తావన ఎక్కువగా, చివర్లో తండ్రి పాత్ర గురించిన పరిచయం ఉండి, రెండో భాగంలో తండ్రి పాత్ర చుట్టూ ఉన్న డ్రామాను రివీల్ చేయనున్నారట.⇒తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే కొడుకు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారని తెలిసింది. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ రామ్నందన్ పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారని భోగట్టా. రామ్నందన్ తండ్రి పేరు అప్పన్న (ప్రచారంలో ఉన్న పేరు). అప్పన్న రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటాడు. కానీ అతని స్నేహితులు కొందరు మోసం చేస్తారు. ఈ క్రమంలోనే అప్పన్న చనిపోతాడట. ఆ తర్వాత అతని కొడుకు ఐఏఎస్ ఆఫీసర్‌గా ఛార్జ్ తీసుకుని, తన తండ్రికి అన్యాయం చేసినవారికి ఎలా బుద్ధి చెప్పాడు? అన్నదే ‘గేమ్ చేంజర్’ కథ అని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో తండ్రీకొడుకుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.⇒ మా నాన్న సూపర్ హీరో అంటున్నారు సుధీర్‌బాబు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్‌రెడ్డి కంకర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తండ్రీతనయుల మధ్య సాగే అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని యూనిట్ పేర్కొంది.⇒ హాస్యనటుడు ధన్‌రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘రామం రాఘవం’. తండ్రీకొడుకు మధ్య నెలకొన్న బలమైన భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో ధన్‌రాజ్ నటిస్తున్నారు. తనయుడు బాధ్యతగా ఉండాలని తాపత్రయపడే తండ్రిగా సముద్ర ఖని, తనను తన తండ్రి అర్థం చేసుకోవడం లేదని బాధపడే కొడుకుగా ధన్‌రాజ్ కనిపిస్తారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.⇒కరోనా నేపథ్యంతో తండ్రీకొడుకుల ఎమోషన్ ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన సినిమా ‘డియర్ నాన్న’. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో సూర్యకుమార్ భగవాన్ దాస్, కొడుకు పాత్రలో చైతన్యా రావ్ నటించారు. యష్ణ చౌదరి, సంధ్య జనక్, శశాంక్, మధునందన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ‘డియర్ నాన్న’ శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా తండ్రి భావోద్వేగం ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
కేసీఆర్ సెంటిమెంట్ టెంపుల్ !
-
అందోల్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీదే అధికారం
వట్పల్లి(అందోల్): అందోలులో ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి రావడం సెంటిమెంట్‌గా మారింది. ఆ సెంటిమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగింది. నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీగా ప్రచారాలు మొదలు పెట్టాయి. ఇరు పారీ్టల అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉండగా, స్థానికంగా ఎవరు గెలిస్తే ఆ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న చర్చ ప్రారంభమైంది. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అభ్యర్థిత్వాలు ఇది వరకే ఖరారు కావడంతో ఆ రెండు పార్టీలు దూసుకుపోతున్నాయి. బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీఎస్పీ తరఫున ముప్పారం ప్రకాష్ పేరును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందోలు ఫలితాలపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 8 సార్లు కాంగ్రెస్‌దే గెలుపు అందోలు నియోజకవర్గం 1952లో ఏర్పడగా, 1967లో ఎస్సీ రిజర్వుడుగా మారింది. 1952 నుంచి 1985 వరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగించింది. 1985లో తొలిసారిగా టీడీపీ నుంచి మల్యాల రాజయ్య విజయం సాధించారు. 1989లో దామోదర రాజనర్సింహ మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో సినీనటుడు బాబూమోహన్ ఎన్నికై తిరిగి 1999–2000 సంవత్సరంలో రెండో సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే అందులో ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ నాలుగుసార్లు, ఒక్కసారి ఇండిపెండెంట్ అభ్యర్థి, రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ముహూర్తాలు కలిసొచ్చేనా? ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను ఏ తేదీన, ఏ సమయంలో వేయాలో జాతకాలు చూపించుకుంటున్నారు. ఈ సారి నామినేషన్లను పోటాపోటీగా వేసేందుకు ఇప్పటినుంచే ముహూర్తాలు చూపించుకుంటున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్రాంతికిరణ్ వేలాది మందితో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం కేవలం ఐదుగురితో కలిసి వచ్చి నామినేషన్ సమరి్పంచారు. ఈసారి కూడా హంగామాతో నామినేషన్ వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. నియోజవర్గంలో మొత్తం 2.25,714 మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళలు 1,13,646.. పురుషులు 1,12,68 మంది ఓటర్లు ఉన్నారు. -
బాలీవుడ్ బాద్ షా.. ఆ సెంటిమెంట్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే!
బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ ప్రస్తుతం జవాన్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార అతనికి జంటగా నటించింది. ఇప్పటికే పఠాన్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన కింగ్ ఖాన్.. మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే కింగ్ ఖాన్ గురించి చాలామందికి తెలియని విషయం గురించి తెలుసుకుందాం. (ఇది చదవండి: 'నేను అమ్మ గర్భంలో ఉండగా అబార్షన్ చేద్దామనుకున్నారు'.. స్టార్ హీరోయిన్!) సాధారణంగా సెలబ్రిటీలకు సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. కొందరు ఏదైనా శుభకార్యం ప్రారంభించాలన్నా తప్పనిసరిగా టైం ఫాలో అవుతారు. చాలామందికి స్టార్స్ సైతం నంబర్ సెంటిమెంట్‌ను ఫాలో కావడం చూస్తుంటాం. అలా మన కింగ్ ఖాన్ కూడా నంబర్ సెంటిమెంట్ ఉన్నట్లు తెలు,స్తోంది. ఎందుకంటే ఆయనకు ఉన్న కార్ల నంబర్లే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. కారు మాత్రమే కాదు.. ఫోన్ నంబర్ విషయంలోనూ పక్కా సెంటిమెంట్ పాటిస్తాడంటున్నారు షారుక్. తన కార్లన్నిటికీ 555 నంబర్‌నే ఆయన ఎంచుకున్నారు. అలాగే మొబైల్ నంబర్లోనూ 555 అనే నంబర్ ఉంటుందట. షారూక్ ఖాన్‌కు ఉన్న ఈ సెంటిమెంట్‌ని ఆయన కుటుంబ సభ్యులు.. స్టాఫ్ కూడా గౌరవిస్తూ తమ ఫోన్ నంబర్లో లాస్ట్ డిజిట్స్ 555 ఉండేలా చూసుకుంటారని తెలుస్తోంది. ఎంతటి సూపర్ స్టార్ అయినప్పటికీ సెంటిమెంట్స్ పాటిస్తారనేది బాద్షాను చూస్తే తెలుస్తోంది. సెలబ్రిటీలే కాదు.. ప్రముఖ రాజకీయ నాయకులు సైతం సెంటిమెంట్స్‌ను పాటించడం మనం చూస్తుంటాం. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ మూవీ, మరో థ్రిల్లర్ సిరీస్ కూడా!) -
ఏడాది క్రితం సరిగ్గా అదే రోజు ఇది RR కాదు CSK
-
అల్లు అర్జున్ సెంటిమెంట్ ప్లాన్ అదుర్స్ ఇక పుష్ప2 కలెక్షన్ ఊచకోతే
-
బీజేపీకి అచ్చిరాని 13! గతంలోనూ ఇలా..
సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకుపోయే పాశ్చాత్య దేశాలు సైతం వణికిపోచే నెంబర్ 13. దురదృష్ట సంఖ్యగా, అపశకునంగా భావిస్తాయి చాలా దేశాలు(మన దేశంలో కాదులేండి). అందుకే ఆ నెంబర్‌కు దూరంగా ఉండే యత్నం చేస్తుంటారు. అయితే ఈ నెంబర్ భారతీయ జనతా పార్టీకి కూడా అచ్చిరాదేమో అనిపిస్తోంది. ఆ సెంటిమెంట్ ఇవాళ్టి(మే 13వ తేదీ) కర్ణాటక ఎన్నికల ఓటమి ఫలితంతో బలపడగా.. అంతకు ముందు జరిగిన పరిణామాలను ఓసారి గమనిస్తే.. 👉 దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని వాజ్‌పేయి నేతృత్వంలో 1996 మే 16వ తేదీన ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే, మెజార్టీని నిరూపించుకోలేకపోవడంతో కేవలం 13 రోజుల్లోనే ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేశారు. 👉 1996-1998 మధ్న రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడియాయి. ఆపైత లోక్‌సభ రద్దై, 1998 లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టకుని ఎన్టీయే కూటమిగా ఏర్పడిన బీజేపీ.. వాజ్‌పేయిని మళ్ళీ ప్రధానిని చేసింది. కానీ, ఏడాది తిరిగాక.. కూటమికి పగళ్లు వచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి అటల్జీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. 1999 ఏప్రిల్ 17న జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ఓడిపోవడంతో ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేశారు. అలా రెండోసారి వాయ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కూడా కేవలం 13 నెలల కాలం కొనసాగింది. 👉 ఇక మే 13వ తేదీ సైతం బీజేపీ కలిసి రాలేదేమో!. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఓటమి పాలైంది. అయితే అప్పుడు ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది మే 13వ తేదీనే. 👉 2004లోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే 13 సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుందో ఏమో.. ఆ ఏడాది అక్టోబర్ 13వ తేదీన జరగాల్సిన పోలింగ్‌ను వాయిదా వేయాలంటూ అప్పట్లో బీజేపీ అప్పటి మిత్రపక్షం శివసేనతో కలిసి ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఆ తేదీన సర్వ ప్రీతి అమవాస్య ఉందని, హిందువులకు పవిత్రమైన ఆ తేదీన ఎన్నికలు జరపొద్దని కోరింది. కానీ, ఈసీ ఆ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. ఆ ఎన్నికల్లో కూటమి దారుణంగా ఓటమిపాలైంది. 👉 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ 13 ఫలితం రిపీట్ అయ్యింది. మే 13 అంటే ఇవాళ జరిగిన కౌంటింగ్‌లో అధికార పార్టీ హోదాలో బీజేపీ కన్నడనాట దారుణంగా ఓటమి పాలైంది. దీంతో 13 సెంటిమెంట్ బీజేపీ శ్రేణుల్లో మరింత బలపడే ఛాన్స్ కనిపిస్తోంది. -
తమిళ త్రివిక్రమ్ గా పాపులర్ అవుతున్న తల
-
‘జీరో’ని నమ్ముకున్న హీరో.. గోపీచంద్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?
ఆసెంటిమెంట్ను వదలను అంటున్నాడు మాచోస్టార్ గోపీచంద్. తన అపజయాలకు బ్రేక్ వేయాలి అంటే..పాత దారినే నమ్ముకోవాలి అనుకుంటున్నాడు. నెక్ట్స్ సినిమాకు కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. ఇంతకీ..మాచో స్టార్ సెంట్ మెంట్ ఏంటి అంటారా? ‘సున్నా’. ఇప్పుడు ఈ హీరో జీరోని నమ్ముకుంటున్నాడు. గోపీచంద్ కు జయం,వర్షం సినిమాలు విలన్ గా పేరు తీసుకువస్తే,యజ్నం,రణం,లక్ష్యం,సాహసం,లౌక్యం లాంటి సినిమాలు హీరోగా నిలబెట్టాయి. ఈ సినిమాలన్ని గోపి హిట్ లిస్ట్‌లోకి వచ్చాయి. గోపీకి గుర్తింపు తెచ్చిన సినిమాల టైటిల్స్ చివరలో సున్నా ఉండటం విశేషం. సున్నా టైటిల్స్ తో ఎండ్ అయినా సినిమాలు..హిట్ కావటంతో..గోపీచంద్ కూడా ఇది సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడు. టైటిల్స్ చివరలో సున్నా లేకుండా ఒంటరి,వాంటెడ్, జిల్,ఆక్సిజన్,చాణక్య ,అరడుగుల బుల్లెట్ లాంటి సినిమాలలో నటించాడు .ఈ సినిమాలన్ని డిజాస్టర్ లిస్ట్‌లోకి ఎక్కాయి. ఇలా సున్నా టైటిల్ తో ఎండ్ అయిన సినిమాలు విజయం సాధించటంతో..తన రాబోతున్న సినిమాకు కూడా పేరు చివరలో సున్నా వచ్చేలా టైటిల్ ఫిక్స్ చేశాడు. గోపీచంద్ ప్రస్తుతం..శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు .వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం,లౌక్యం లాంటి హిట్లు వచ్చాయి .ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కోసం ట్రై చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్ చివరలో సున్నా వచ్చేలా..రామ బాణం టైటిల్ ఫిక్స్ చేశారట. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు,ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి గోపీచంద్ నమ్ముకున్న సున్నా సెంటిమెంట్ వర్కౌట్ అయి..రామ బాణం విజయం సాధిస్తుందో లేదో చూడాలి. -
పూజా హెగ్డే ఐరన్ లెగ్ సెంటిమెంట్!
కల్పితాల కథ సినిమా. ఊహలకు ప్రతి రూపమే చిత్రం. అందుకే ఇది అందరికీ అందమైన రంగుల కల అయ్యింది. ఈ రంగుల ప్రపంచంలో స్థానం కోసం అందరూ శక్తి వంచన లేకుండా శ్రమిస్తారు. అయితే ఎవరు ఎప్పుడు అందలం ఎక్కుతారో ఊహాతీతమే. ఇక్కడ పైకి వస్తారు అనుకున్న వాళ్లు కనుమరుగవుతారు.. సినిమాకు పనికి రారు అని అవమానాలను ఎదుర్కొన్న వారు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఇది సినీ జగం. ఇందుకు చిన్న ఉదాహరణ నటి పూజా హెగ్డే. ఈమె నటిగా దశాబ్దం పూర్తి చేసుకుంది. తమిళం, తెలుగు, హిందీ చిత్రాలతో ఇండియన్ స్టార్ హీరోయిన్గా వెలిగిపోతోంది. అయితే తనకు ఇవి అంత సులభంగా రాలేదంటుందీ అమ్మడు. అపజయాలకు కుంగిపోకుండా, మనస్తాపానికి గురి కాకుండా మనో ధైర్యంతోనే ముందుకు అడుగులు వేయడంతోనే ఈ స్థాయి సాధ్యమైందని పేర్కొంది. 2012 ముఖముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది నటి పూజా హెగ్డే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తరువాత 2014లో ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్లో ప్రవేశించింది. అక్కడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత హిందీలో మొహంజదారో చిత్రంలో నటించింది. దీంతో బాలీవుడ్ ఆశలు అడియాశలే అ య్యాయి. అయినా మొక్కవోని ఆత్మస్థైర్యంతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకే నడిచింది. అందుకే ఇప్పుడు అగ్ర నటిగా వెలుగుతుంది. ఈ విషయాన్ని ఒక కార్యక్రమంలో ఆమె తెలిపింది. పై స్థాయికి చేరుకోవడానికి చాలా శ్రమించానని చెప్పింది. అయితే ఇప్పుడు తాను ఒక ప్రముఖ నటినని భావించలేదంది. స్టార్ నటిననే అంతస్తును తలకెక్కించుకోలేదని, ఇప్పటికీ నేల మీదే నిలబడ్డానని చెప్పింది. అయితే ఆదిలో తనను ఐరన్ లెగ్ అన్న వాళ్లే ఇప్పుడు నంబర్ వన్ హీరోయిన్ అంటున్నారని పేర్కొంది. సినిమా రంగంలో నంబర్ వన్ అనే అంతస్తు శాశ్వతం కాదన్న విషయం తనకు తెలుసంది. అందుకే దాని గురించి అస్సలు పట్టించుకోలేదని చెప్పింది. ఇక్కడ సరిగా నటించకపోతే ఎంతటి వారినైనా ప్రేక్షకులు ఇంటికి పంపించేస్తారని, వారికి నచ్చితే కొత్త వారిని కూడా ఉన్నత స్థాయిలో కూర్చొబెడుతారని నటి పూజా హెగ్డే పేర్కొంది. -
జోయా అఖ్తర్ యాక్టర్స్‌కు సెలవులివ్వదట, కారణం?
సినిమా.. ఆన్ స్క్రీన్ .. ఆఫ్ స్క్రీన్ సంగతులు భలే సరదాగా ఉంటాయి. వినోదాన్నీ పంచుతాయి. వీటిల్లో హీరోహీరోయిన్స్ గురించిన ముచ్చట్లకు ఉండే క్రేజ్ సరే.. దర్శకుల స్టయిల్ ఆఫ్ మూవీ మేకింగ్ పట్లా ఓ ఆసక్తి ఉంటుంది సినీ అభిమానులకు. ఆ ఇంటరెస్ట్నే క్యాచ్ చేశాం. ఇలా.. ! బయటకు వెళ్లిపోతారనే.. జోయా అఖ్తర్.. దర్శకురాలిగానే కాదు.. రైటర్‌గానూ ప్రసిద్ధి. రాసుకున్నదాన్ని రాసుకున్నట్టే చిత్రీకరించాలనే పట్టుదలతో ఏమీ ఉండదు. ఏదైనా సీన్‌ను షూట్ చేస్తున్నప్పుడు కొత్త ఐడియా తడితే మార్చడానికి ఏమాత్రం వెనుకాడదు. రీటేక్స్ విషయంలో చాలా లిబరల్గా ఉంటుంది. వైవిధ్యమైన నటీనటులతో సినిమాలు చేయడం ఆమెకు ఇష్టం. సాంఘిక అంశాలు, నిజ జీవితాల్లోని అనుబంధాలను మిళితం చేసి సినిమాలు తీయడం ఆమె ప్రత్యేకత. ‘దిల్ ధడక్నే దో’లోని అక్కాతమ్ముడి బాండింగ్‌కు.. తన తోబుట్టువు ఫర్హాన్ అఖ్తర్‌తో తనకున్న అనుబంధమే ప్రేరణట. సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌లో యాక్టర్స్‌కు సెలవులివ్వదట.. నటీనటులు కథా పాత్రల్లోంచి బయటకు వెళ్లిపోతారనే భయంతో. నో డీటైలింగ్.. సంజయ్ లీలా భన్సాలీ .. సినిమాల్లో డీటైలింగ్స్ మిస్ అవడు కానీ నటీనటులకు మాత్రం ఎక్కువ డీటైల్స్ ఇవ్వడు. ఏ మూవీకైనా కొన్నేళ్ల ముందుగానే స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిపెట్టుకుంటాడు. ఆయన చిత్రాల్లోని చాలా సన్నివేశాలు.. తాను చిన్నప్పుడు ఎరిగిన మనుషులు, తిరిగిన ఊళ్లు, పెరిగిన వాతావరణాన్ని తలపించేవిగా ఉంటాయిట. డార్క్ స్టోరీ అనురాగ్ కశ్యప్ సినిమాలు ఎక్కువగా డార్క్ టాపిక్స్ మీదే ఉంటాయి. కారణం.. ఆయన చైల్డ్ అబ్యూజ్ విక్టిమ్ కావడమే. తన సినిమాల్లోని క్యారెక్టర్స్ గురించి నటీనటులకు ఎలాంటి సూచనలివ్వడు. స్క్రిప్ట్‌ను క్షుణ్ణంగా చదివి నటీనటులే ఆయా క్యారెక్టర్స్‌ను అర్థం చేసుకోవాలి. సీన్స్ బాగా రావడానికి.. తమ జీవితాల్లో జరిగిన డార్క్ ఇన్సిడెంట్స్ను గుర్తుతెచ్చుకొమ్మని నటీనటులకు చెప్తాడట. రీటేక్స్ను ఇష్టపడడు. -
ఆల్‌టైమ్ గరిష్టానికి రియల్టీ సెంటిమెంట్
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో సెంటిమెంట్ 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరినట్టు నైట్ ఫ్రాంక్ నరెడ్కో సర్వేలో వెల్లడైంది. వచ్చే ఆరు నెలల కాలానికి సైతం బుల్లిష్‌గా ఉన్నట్టు డెవలపర్లు వెల్లడించారు. ఇళ్లకు, వాణిజ్య ప్రాజెక్టులకు డిమాండ్ బలంగా ఉండడంతో ప్రస్తుత, భవిష్యత్తు సెంటిమెంట్ ఇండెక్స్ నూతన రికార్డు స్థాయికి చేరినట్టు నైట్‌ఫ్రాంక్–నరెడ్కో విడుదల చేసిన ‘రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్’ తెలియజేసింది. ప్రస్తుత సెంటిమెంట్ (డెవలపర్ల వైఖరి) నూతన గరిష్ట స్థాయి 68కి చేరుకోవడం డెవలపర్లు వారి ప్రాజెక్టుల విషయంలో సానుకూలంగా ఉన్నట్టు తెలియజేస్తోందని ఈ సర్వే నివేదిక తెలిపింది. భవిష్యత్తు సెంటిమెంట్ స్కోరు కూడా రికార్డు స్థాయిలో 75కు చేరింది. వచ్చే ఆరు నెలల కాలానికి కూడా డెవలపర్లు, ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్ పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. 50కు పైన స్కోరును ఆశావాదంగాను, 50 స్థాయిలో ఉంటే తటస్థంగా, 50కు దిగువన నిరాశావాదంగా పరిగణిస్తారు. రానున్న రోజుల్లో మరింత జోరు ‘‘ప్రస్తుత సెంటిమెంట్ స్కోరు 2021 నాలుగో త్రైమాసికంలో 65గా ఉంటే, 2022 మొదటి మూడు నెలల్లో 68కి పెరిగింది. రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ మంది భాగస్వాములకు గత ఆరు నెలల్లో మార్కెట్ ఎంతో సానుకూలంగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ మూడో విడతను అధిగమించింది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం అనిశ్చితి ప్రభావాలేవీ రియల్ ఎస్టేట్ మీద చూపించలేదు’’అని ఈ నివేదిక పేర్కొంది. కరోనా విపత్తుతో స్తబ్దుగా మారిన వాణిజ్య రియల్ ఎస్టేట్ కూడా వృద్ధిని చూస్తున్నట్టు తెలిపింది. కరోనా ప్రొటోకాల్స్ అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేసినందున రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ పరిశ్రమ మంచి జోరు చూపించొచ్చని నివేదిక అంచనా వేసింది. ‘‘నివాస గృహాల మార్కెట్లో వృద్ధి ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ రంగం అంతటా సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. చాలా కంపెనీలు తమ సిబ్బందిని తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయి. దీంతో ఆఫీస్ స్పేస్ డిమాండ్ కూడా క్రమంగా వృద్ధి చెందుతోంది’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బజాజ్ తెలిపారు. -
ఎంపీ అభ్యర్థులకు సెంటిమెట్ దేవుళ్లు
రామారెడ్డి: రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి(రామారెడ్డి) శ్రీకాలభైరవుడు, మద్దికుంట గ్రామంలోని శ్రీబుగ్గరామలింగేశ్వరుడి ఆలయాలు ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీ అభ్యర్థులకు సెంటిమెట్ దేవుళ్లుగా మారారు. ఈ రెండు ఆలయాల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికలకు ముందు, గెలుపు తర్వాత దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రవీందర్‌రెడ్డి కాలభైరవుడికి పూజలు చేసిన తర్వాతే ప్రచారం ప్రారంభించారు. అలాగే ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే నల్లమడుగు సురేందర్ కాలభైరవుడిని దర్శించుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డి కాలభైరవుడికి పూజలు నిర్వహించి ప్రచారం ఆరంభించారు. అలాగే కామారెడ్డి ఎమ్మెల్యేలుగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన గంప గోవర్ధన్, షబ్బీర్ అలీతో పాటు బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి బుగ్గరామలింగేశ్వరుడిని దర్శించుకున్న తర్వాతే ఎన్నికల ప్రచారం చేశారు. ప్రస్తుం పార్లమెంట్ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ కాలభైరవుడిని దర్శించుకుని ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి బుగ్గరామలింగేశ్వరుడికి పూజలు చేసిన తర్వాతే రంగంలోకి దిగారు. ఇలా అభ్యర్థులకు కాలభైరవస్వామి, బుగ్గరామలింగేశ్వరస్వామి సెంటిమెంట్ దేవుళ్లుగా మారారు. -
కళ్యాణదుర్గ్ భవనం.. రఘువీరాకు భయం
సాక్షి, కళ్యాణదుర్గం : ఎన్నికల వేళ రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు చాలా కామన్. నామినేషన్ దగ్గర నుంచి ప్రచారం వరకూ ఒక్కొక్కరూ ఒక్కో సెంటిమెంట్‌ను నమ్మడం చూస్తుంటాం. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డికి మాత్రం వాస్తు సెంటిమెంట్ ఉంది. తాను మంత్రిగా ఉన్న సమయం లో కళ్యాణదుర్గంలో రూ.కోట్లు వెచ్చించి నిర్మించుకున్న సొంత భవనం (కళ్యాణదుర్గ్ భవనం) ఆయనకు అచ్చిరాలేదంట. అందుకే ఇప్పుడు కళ్యాణదుర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన ఆయన ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే కార్యాలయం ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. పార్వతి నగర్లో అద్దెకు తీసుకున్న భవనంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆ ఇంటి వాస్తే కారణమట! 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన రఘువీరారెడ్డి మంత్రి పదవులు కూడా చేపట్టారు. అదే సమయంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పెద్ద భవంతిని నిర్మించారు. మహా నేత వైఎస్సార్ అకాల మరణం అనంతరం.. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడగా ఆ సమయంలో జరిగిన పోరాటాలతో మంత్రిగా ఉన్న రఘువీరా ఉక్కిరిబిక్కిరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో ఆయన పెనుకొండకు మకాం మార్చారు. అక్కడ ఘోరంగా ఓడి పోయారు. పీసీసీ అధ్యక్షుడి పదవి దక్కించుకున్న ఆయన.. రాష్ట్రంలో ము ఖ్యమైన నేతలనూ కాపాడుకోలేకపోయారు. కేవలం వాస్తు సరిగాలేని ఇంట్లో ఉండటం వల్లే ఇవన్నీ జరిగాయని ఆయన భావిస్తున్నారు. ఐదేళ్ల పాటు చుట్టపు చూపుగా కళ్యాణదుర్గం వచ్చి వెళ్లిన ఆయన... 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయడానికి సిద్ధమయ్యారు. కళ్యాణదుర్గం భవనానికి వాస్తు సరిగా లేదని పార్వతి నగర్లో అద్దె భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యకలాపాలు నడుపుతున్నారు. అక్కడినుంచే ఆర్ఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. -
అక్కడ మంత్రి అయితే ఇంటికే!
సాక్షి,మైలవరం : రాజకీయాల్లో ఒక్కొక్క చోట.. ఒక్కో రకం సెంటిమెంట్ రాజ్యమేలుతుంటాయి. మైలవరం నియోజకవర్గంలో ఒక సెంటిమెంట్ ప్రచారంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి ఖాయం అనేది ఆ సెంటిమెంట్. 1983 ఎన్నికల నుంచి ఇదో సెంటిమెంట్‌గా మారింది. మైలవరం నుంచి చనమోలు వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆర్ ఆండ్ బీ శాఖ మంత్రిగా పనిచేశారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 1989లో కోమటి భాస్కరరావు ఎమ్మెల్యేగా విజయం సాధించి మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా పదవినలంకరించారు. తదనంతరం కనుమరుగయ్యారు. 1999లో వడ్డే శోభనాద్రీశ్వరరావు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొంది వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో పరాజయం తప్పలేదు. 2004 ఎన్నికల్లో చనమోలు వెంకట్రావు గెలుపొంది, పదవీ కాలం పూర్తి కాకుండానే మృతి చెందారు. 2009, 2014 ఎన్నికల్లో దేవినేని ఉమామహేశ్వరరావు విజయం సాధించారు. 2014 ఎన్నికల తరువాత ఆయన జలవనరుల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో మైలవరం అభ్యర్థిగా మరోసారి పోటీలో ఉన్నారు. ఈ దఫా ఎటువంటి ఫలితాలు వస్తాయో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
పేటలో కొత్తవారికే అందలం
సాక్షి, చిలకలూరిపేట : చిలకలూరిపేట నియోజకవర్గం 2004 వరకు ఎన్నికల ఫలితాల్లో నూతన విశిష్టత చాటుకునేది. ఇక్కడ ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ కొత్తగా పోటీ చేసే వారికే అనుకూలంగా ఉంటాయి. ఈ నియోజకవర్గానికి తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. తొలి సారి పొటీ పడిన ఇద్దరు అభ్యర్థుల్లో సీపీఐ తరఫున పోటీ చేసిన కరణం రంగారావు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి పి.నాగయ్యపై గెలిచారు. పదేళ్ల పాటు నియోజకవర్గం ప్రకాశం జిల్లా మార్టూరులోకి వెళ్లింది. తిరిగి 1967లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ తొలిసారి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థి కందిమళ్ల బుచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూతి వెంకటేశ్వర్లుపై విజయం సాధించారు. 1972 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండోసారి పోటీ చేసిన కందిమళ్ల బుచ్చయ్యపై తొలిసారి రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొబ్బాల సత్యనారాయణ గెలిచారు. 1978లో తొలిసారి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్య, జనతాపార్టీకి చెందిన భీమిరెడ్డి సుబ్బారెడ్డిపై విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో కొత్తగా రంగంలోకి దిగిన డాక్టర్ కాజా కృష్ణమూర్తి రెండోసారి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్యపై విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో టీడీపీ తరఫున కొత్తగా రంగంలోకి దిగిన డాక్టర్ కందిమళ్ల జయమ్మ, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి సోమేపల్లి సాంబయ్యపై విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్యపై గెలుపొందారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ బలపరిచిన ఇండిపెండింట్ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన మర్రిరాజశేఖర్, టీడీపీకి చెందిన ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచారు. ఆ తదుపరి జరిగిన రెండు ఎన్నికల్లో మాత్రమే పాత అభ్యర్థులు పోటీ చేశారు. ప్రస్తుతం 2019లో టీడీపీ తరుఫున ప్రత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తుండగా, వైఎస్సార్ సీపీ తరఫున కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విడదల రజని బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి తొలిసారి పోటీ చేసిన అభ్యర్థులకే అండగా నిలుస్తున్న నియోజకవర్గం సెంటిమెంట్ పునరావృతం అవుతుందని, రజనికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
కరుణించవమ్మా మహాలక్ష్మి..
సాక్షి, విజయవాడ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఏ పార్టీ అయినా సరే.. చిట్టినగర్ జంక్షన్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అవి అసెంబ్లీ ఎన్నికలైనా..కార్పొరేషన్ ఎన్నికలైనా సరే చిట్టినగర్‌కు చేరుకుని పూజలు చేస్తే విజయం సాధిస్తారని నమ్మకం. గతంలో ఒకరిద్దరు మాత్రమే అమ్మవారికి దర్శించుకునే వారు. అయితే ఈ దఫా వారి సంఖ్య ఎక్కువైంది. పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం ఈ ఆనవాయితీ పాటించారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరపున పోటీలో ఉన్న వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కోరాడ విజయ్‌కుమార్ మహాలక్ష్మి అమ్మవారిని, శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నామినేషన్ వేశారు. జనసేన అభ్యర్థి పోతిన మహేష్ కూడా చిట్టినగర్ జంక్షన్ నుంచి సోమవారం ర్యాలీ ప్రారంభిస్తారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో అత్యంత కీలకమైన చిట్టినగర్ జంక్షన్ నుంచే రాజకీయం ప్రారంభంకావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. -
అమ్మో.. ఆ పదవులు మాకొద్దు!
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో సెంటిమెంట్లకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఫలానా గుడికి వెళితే.. పదవి మటాష్ అన్న ప్రచారం ఉంటే.. నాయకులెవరూ పద విలో ఉన్నంతకాలం అటువైపు కన్నెత్తి చూడరు. అలాగే.. ఫలానా పదవి చేపడితే రాజకీయ భవిష్యత్తు ఉండదు.. అన్న ప్రచారం సాగితే.. దాన్ని చేపట్టేందుకు చాలా తక్కువ మంది ముందుకొస్తారు. అవే స్పీకర్, ఆర్టీసీ చైర్మన్, పీఏసీ చైర్మన్ పదవులు. తెలుగు రాజకీయాల్లో రాజకీయ నాయకులంతా వీటిని చేపట్టాలంటే వెను కడుగు వేస్తారు. ఈ పదవులు చేపట్టాక రాజకీయంగా ఒడిదుడుకులు తప్పవన్న సంప్రదాయం చాలా ఏళ్లుగా రాజకీయ నాయకుల్లో బలంగా నాటుకుపోయింది. ఆర్టీసీలో అడుగుపెడితే అంతేనా ఆర్టీసీ చైర్మన్ పదవి చేపట్టినవారూ రాజకీయంగా ఇబ్బందులు పడతారన్న ప్రచారం ఉంది. గతంలో ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేసిన గోనె ప్రకాశ్‌రావుకు ఆ తర్వాత రాజకీయాల్లో ప్రభ తగ్గింది. క్రమంగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఇదే పదవిని చేపట్టిన సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్.సత్యనారాయణ చైర్మన్‌గా తప్పుకొన్నాక ప్రత్యక్ష రాజకీయాల జోలికే వెళ్లట్లేదు. ఇటీవల ఆర్టీసీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సోమారపు సత్యనారాయణ కూడా తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆర్టీసీ సెంటిమెంట్ మరోసారి పునరావృతమైందంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. పీఏసీ చైర్మన్.. తెలంగాణలో పీఏసీ చైర్మన్ పదవులు చేపట్టినవారికి పలు ఆటంకాలు ఏర్పడ్డాయి. గత అసెంబ్లీలో పీఏసీ చైర్మన్‌గా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత, నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి 2015 ఆగస్టులో గుండెపోటుతో మరణించారు. దీంతో ఈ పదవిని కాంగ్రెస్‌కే చెందిన పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి చేపట్టారు. 2016 మార్చిలో ఆయన కూడా అనారోగ్యంతో మరణించారు. దీంతో పీఏసీ చైర్మన్ పదవి చేపట్టేందుకు అంతా ఆలోచించారు. ఆఖరికి ఆ పదవిని మరో సీనియర్ నాయకురాలు గీతారెడ్డి చేపట్టారు. 2018 ఎన్నికల్లో ఆమె కూడా ఓటమి చవిచూశారు. దీంతో పీఏసీ చైర్మన్ పదవి వల్లే గీతారెడ్డి ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానిస్తున్నారు. కొనసాగిన స్పీకర్ సెంటిమెంట్ స్పీకర్ పదవిపైనా పలువురు గులాబీ నేతలు విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ పదవి చేపడితే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని, తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతారన్న సెంటిమెంటు చాలా ఏళ్లుగా ఉంది. గత స్పీకర్ మధు సూదనాచారి ఓటమితో అది మరోసారి పునరావృతమైంది. గతంలో స్పీకర్‌గా వ్యవహరించిన సురేశ్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్ లాంటి వారిని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. దీంతో ఈసారి స్పీకర్ పదవి ఎవరిని వరించినా వారు కూడా రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదని నేతలు కాస్త ఆందోళన చెందుతున్నారు. -
అక్కడ ప్రచారం నిర్వహిస్తే సీఎం కావడమే..!
సాక్షి,మోర్తాడ్(బాల్కొండ): ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నా సెంటిమెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు ఎంతో మంది ఉంటారు. రాజకీయ నాయకుల్లో ఎక్కువ మంది సెంటిమెంట్‌ను నమిన్నట్లే ప్రజలు కూడా సెంటిమెంట్‌పై చర్చించుకోవడం, పందాలు కాయడం చేస్తుంటారు. అలాంటి సెంటిమెంట్ ఒక్కటి ఏర్గట్ల మండల కేంద్రంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏర్గట్ల మండల కేంద్రం లోని బస్టాండ్ ప్రాంతంలో ఉన్న నక్సల్స్ అమరవీరుల స్మారక స్థూపం పక్కన ఉన్న రోడ్డుపై ప్రచారం నిర్వహించిన రెండు పార్టీల ముఖ్య నాయకులు ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలను నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్య మంత్రులుగా బాధ్యతలను నిర్వహించిన విషయం పక్కన పెడితే ఇద్దరు నేతలు మాత్రం ఏర్గట్ల వాసులు సెంటిమెంట్‌గా భావిస్తున్న స్థలం వద్ద నుంచి ప్రచారం నిర్వహించడం వల్లనే వారు ముఖ్యమంత్రులుగా ఎంపికయ్యారని నమ్ముతున్నారు. 1982లో టీడీపీని సినీనటుడు ఎన్టీఆర్ స్థాపించి చైతన్యరథంలో పార్టీ గురించి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్గట్లలోని బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు. 1983లో టీడీపీ ఘనవిజయం సాధించడంతో ఆయన సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. ఏర్గట్లలో ఎన్టీఆర్ ప్రసంగించడం ఆ తరువాతనే ఆయన సీఎం అయ్యారని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే మరోసారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విషయంలోనూ రుజువు కావడంతో ఏర్గట్ల ప్రజలకు సెంటిమెంట్ బలపడింది. 2004 సాధారణ ఎన్నికల్లో భాగంగా బస్సుయాత్రను నిర్వహించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మోర్తాడ్ నుంచి పాలెం, తిమ్మాపూర్‌ల మీదుగా ఏర్గట్లకు చేరుకున్నారు. గతంలో ఎన్టీఆర్ నిర్వహించిన స్థలం వద్దనే వైఎస్సార్ ప్రచార సభను కొనసాగించారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో సీట్లను దక్కించుకోవడంతో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఏర్గట్ల బస్టాండ్ వద్ద ఒక సారి ఎన్టీఆర్, మరోసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలు ప్రచారం నిర్వహించడం వల్లనే వారికి సీఎం అయ్యే అవకాశం లభించిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల మాదిరిగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఇక్కడ ప్రచారం నిర్వహించలేదు. ఏర్గట్లలో ప్రచారం నిర్వహించిన ఇద్దరు ముఖ్య నాయకులలో ఆ ఇద్దరు సీఎంలుగా ఎంపిక కావడంతో ఏర్గట్ల స్థల ప్రభావం రాజకీయంగా ఎంతో ఉందని కూడా నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా సెంటిమెంట్లకు విలువ ఇచ్చేవారికి అనుగుణంగా పరిస్థితులు అనుకూలించడం విశేషం అని చెప్పవచ్చు. -
ఆ పల్లెలో ప్రచారం మొదలు పెడితే విజయం ఖాయం!
సాక్షి,బోధన్(నిజామాబాద్) : ఆ పల్లెలో ప్రచారం మొదలు పెడితే ఎన్నికల్లో విజయం ఖాయమని రాజకీయ నేతల నమ్మకం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మె ల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేసే రాజకీయ పార్టీల నేతలు ఆ పల్లె నుంచే ప్రచారం ప్రారంభించే పొలిటికల్ సెంటీ మెంట్ 20 ఏళ్లుగా కొనసాగుతోంది. అదే బోధన్ మండలంలోని బర్దీపూర్ గ్రామం. మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈశన్య దిశలో ఉన్నా చిన్న పల్లెటూరు.. రాజకీయ నాయకులు ప్రచారం ఈ పల్లె నుంచే మొదలు పెడితే విజయం సిద్ధిస్తుందని జ్యోతిష్క్యుల సూచనలను నియోజక వర్గ అభ్యర్థులు అనుసరిస్తున్నారు. ఈ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆయలంలో దైవ దర్శనం చేసుకుని, పూజలు నిర్వహించి ప్రచారాన్ని మొదలు పెట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి 1999 ఎన్నికల్లో బర్దీపూర్ గ్రామం నుంచి ప్రచారం మొదలు పెట్టి విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికలతో పాటు తాజాగా 2018 ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించారు. అయితే 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి ఓడిపోయారు. ఈ విషయం తెలిసి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఈ గ్రామం నుంచే ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. 2014 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ కూడా ఈ గ్రామం నుంచి ప్రచారం మొదలు పెట్టారు. పొలిటికల్ సెంటిమెంట్‌తో బర్దీపూర్ గ్రామానికి ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తాజా మాజీ ఎమ్మెల్యే షకీల్ బర్దీపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుని అబివృద్ధికి కృషి చేశారు. -
ఆ క్షేత్రం నుంచి ప్రచారం ప్రారంభిస్తే విజయమే..!
సాక్షి, ధర్పల్లి (నిజామాబాద్): రామడుగు ప్రాజెక్ట్ గ్రామ శివారులోని హరిహర క్షేత్ర ఆలయం నుంచి పార్టీల అభ్యర్థులు ప్రచార సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. 2004లోని అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లోని టీఆర్ఎస్ అభ్యర్థి కేశ్‌పల్లి గంగారెడ్డి ఇదే హరిహర క్షేత్ర ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ప్రచార సెంటిమెంట్‌లోని హరిహర క్షేత్రం నుంచే మండలంలోని మొదటి సారిగా పూజలు నిర్వహించి, ర్యాలీ తీయడంతోనే ఎన్నికల్లో గెలిచానని అప్పట్లో కేశ్‌పల్లి గంగారెడ్డి ఎమ్మెల్యే హోదాల్లో ఏర్పాటు చేసిన సభలో చెప్పేవారు. 2014 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో దిగిన బాజిరెడ్డి గోవర్ధన్ హరిహర క్షేత్ర ఆలయం నుంచే ప్రచార ర్యాలీ నిర్వహించి 26 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. 2018 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో దిగిన మాజీ తాజా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవల రామడుగు ప్రాజెక్ట్ గ్రామంలోని హరిహర క్షేత్రంలోని పూజలు చేసి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. శ్రీరాముడు వనవాసం చేసిన రోజుల్లో ఇదే బాటగా వెళుతూ ఈ ప్రాంతంలోని శివలింగాన్ని తయారు చేసిన ప్రతిష్ఠించి శ్రీరాముడు పూజలు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇదే శివలింగం పక్కనే శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ ఆలయాన్ని హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి ఏ పని మొదలు పెట్టిన విజయం వరిస్తుందని ప్రజల్లో నమ్మకం ఉంది. ఇదే నమ్మకంతో ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు సైతం ప్రచార సెంటిమెంట్‌గా వాడుతున్నారు. -
గౌరవాన్ని తిన్న ఆకలి
ముసలితనం అంటే బాల్యం మళ్లీ తిరిగిరావడమే. నాలుక తప్ప మిగిలిన అన్ని జ్ఞానేంద్రియాల శక్తి కోల్పోయింది చిన్నమ్మ. ఆమె కాళ్లు, చేతులు, కళ్లు అన్నీ ఉడిగిపోయినై. ఇంట్లోవాళ్లు ఆమెకు వేళకు భోజనం పెట్టకపోయినా, చాలినంత పెట్టకపోయినా ఇల్లు అదిరేలా ఏడుస్తుంది. ఆమె భర్త పోయి చాలా కాలమైంది. కొడుకు కూడా తరుణప్రాయంలోనే చనిపోయాడు. చెల్లెలి కొడుకు పండిత్ బుద్ధిరామ్ తప్ప ఆమెకు ఎవరూ లేరు. అతడి దగ్గరే ఉంటోంది. ఆమెకున్న ఆస్తినంతా అతడి పేర రాసింది. రాసేముందు అతడు పెద్ద వాగ్దానాలే చేశాడుగానీ అన్నీ కల్లలైపోయాయి. ఆమె ఆస్తి వల్ల ఏడాదికి రెండు వందల రూపాయలకు తక్కువ ఆదాయం రాదు. అయినా ఆమెకు కడుపునిండా తిండే పెట్టరు. దీనికి బుద్ధిరామ్‌ను నిందించాలా, ఆయన భార్య రూపనా అన్నది అర్థం కాదు. బుద్ధిరామ్ నిజానికి బుద్ధిమంతుడే, డబ్బులను ఖర్చు పెట్టాల్సిన అవసరం రానంతవరకు. రూపకు ముక్కుమీదే కోపం. కానీ దైవభీతి పరురాలు. మొత్తం కుటుంబంలో చిన్నమ్మకు ఎవరిమీదైనా ప్రేమ ఉందంటే అది లాడ్లీ. బుద్ధిరామ్ ముగ్గురు పిల్లల్లోకీ చిన్నది. మొదటి ఇద్దరు మగవాళ్లు. తల్లిదండ్రులను బట్టే పిల్లల ప్రవర్తన ఉన్నట్టు ఈ ఇద్దరూ ముసలామెను ప్రతిదానికీ ఏడిపిస్తారు. ఒకడు గిచ్చి పరుగెడతాడు, ఇంకొకడు నీళ్లు జల్లుతాడు. ఇంట్లో ఏదైనా మిఠాయి చేసినప్పుడు అన్నలు గుంజుకుంటారని తన భాగాన్ని అమ్మమ్మ గదిలోకి వెళ్లి తింటుంది లాడ్లీ, తినుబండారాలు అంటే పడిచచ్చే అమ్మమ్మ తన మిఠాయిలో వాటా కోరుతుందని తెలిసీ. కానీ రౌడీ అన్నలు లాక్కునేదానితో పోలిస్తే అమ్మమ్మకు పోయేది తక్కువే కాబట్టి ఏం ఫరవాలేదు. రాత్రి వేళ. బుద్ధిరామ్ ఇంట్లో షెహనాయ్ వినిపిస్తోంది. ఊళ్లోని పిల్లలు కళ్లు పెద్దవి చేసుకుని దాన్ని ఆనందిస్తున్నారు. అతిథులకు క్షురకుడు మర్దన చేస్తున్నాడు. ఒక కవిగాయకుడు కవిత్వాన్ని వినిపిస్తుంటే, అతిథులు ‘వహ్వా’ ‘వహ్వా’ అంటున్నారు. ఇంగ్లీషు చదువుకున్న యువకులు ఈ మూర్ఖులతో కలవడం తమ స్థాయికి తగదని దూరంగా నిలుచున్నారు. ఈరోజు బుద్ధిరామ్ పెద్దకుమారుడు సుఖ్‌రామ్‌కు వరపూజ జరుగుతోంది. రూప విందు పనుల్లో హడావుడిగా ఉంది. మట్టిపొయ్యిల మీద పెద్ద మూకుళ్లు పెట్టారు. ఒకదాన్లో పూరీ, కచోరీ, ఇంకోదాన్లో రుచికరమైన కూరలు తయారవుతున్నాయి. నెయ్యి వాసన గాలితో వ్యాపిస్తోంది. తన గదిలో ఉన్న చిన్నమ్మకు ఈ వాసన సోకి ప్రాణం పోతోంది. నాకు కచ్చితంగా ఈ పూరీలు తేరు, అందరూ తినేసివుంటారు, నాకేమీ ఉంచరు అని తలుచుకుని ఆమె నీరయింది. ఏడుపొచ్చినా ఇంటికి అశుభమని దిగమింగుకుంది. అబ్బా, ఏం ఘుమఘుమ! నా గురించి ఎవరికి పట్టింది? ఎండిపోయిన రొట్టెలు పెట్టడానికే వాళ్లకు చేతులు రావు, ఈ తీపి పూరీలు నాకు వడ్డిస్తారా? లాడ్లీ ఇవ్వాళ ఇటువైపు రాలేదు. ఇద్దరు మగవాళ్లు మామూలుగానే రారు. అసలు ఇంకా ఏమేం వండుతున్నారో తెలిస్తే బాగుండు. పూరీలను తలుచుకోగానే చిన్నమ్మ నోట్లో నీళ్లూరినై. ఆమె ఊహలకు రెక్కలు వచ్చినై. బంగారు రంగులో కాలి, మృదువుగా తుంచుకోగలిగే పూరీలు ఆమె కళ్ల ముందు నర్తించినై. చిన్నమ్మకు వెళ్లి మూకుడు ముందు కూర్చోబుద్ధయింది. చేతులు నేలకు ఆన్చి, పాక్కుంటూ గడపదాటి బయటకు వచ్చి, మూకుడు ముందుకు చేరింది. రూప ఆ సమయంలో ఆత్రంగా ఒక గది నుంచి ఇంకో గదికీ, మూకుళ్ల దగ్గరికీ, భోజన సామగ్రి పెట్టిన చోటుకీ తిరుగుతోంది. ఎవరో వస్తారు, బుద్ధిరామ్ సాబ్ లస్సీ తెమ్మంటున్నాడని చెబుతారు. మరెవరో వస్తారు, ఇంకేదో ఇమ్మంటారు. ఈలోపు ఒకరు వచ్చి, ఇంకా భోజనాలకు ఎంత సమయం పడుతుందని అడుగుతారు. ఎవరి మీదా అరవడానికి లేదు. అరిచామా ఈ మాత్రం పనులు వెళ్లదీసుకోలేక పోయిందని బంధువులు దెప్పుతారు. దాహంతో ఆమె గొంతు తడారిపోతోంది. మూకుళ్ల వేడి ఒంటిని మాడుస్తోంది. గుక్కెడు నీళ్లు తాగడానికిగానీ విసనకర్రతో ఊపుకోవడానికిగానీ ఆమెకు తీరుబడి లేదు. ఆ సమయంలో ముసలామె మూకుడు ముందు కూర్చోవడం రూప కంటబడింది. ఆమె కోపం నాషాళానికి ఎక్కింది. ‘అప్పుడే నీ కడుపు కాలిపోతోందా? అది కడుపా, కయ్యా? కదలకుండా నీ గదిలో కూర్చోలేవా? ఇంకా చుట్టాలకే పెట్టలేదు, దేవుడికి పెట్టలేదు, ఈమె తయారయ్యింది. నీ నాలుక పడిపోను. ఒకరోజు తిండి పెట్టలేదంటే వేరేవాళ్ల ఇండ్ల మీద పడుతుంది. అందరూ ఈమెకు భోజనం పెట్టక మాడుస్తున్నామని అనుకుంటారు. ప్రాణమైనా పోదు, పాతకి!’ముసలామె ఏమీ మాట్లాడలేదు. మౌనంగా పాక్కుంటూ వెనక్కి తన గదిలోకి పోయింది. భోజనాలు సిద్ధమైనాయి. విస్తళ్లు వేశారు. వడ్డనలు జరుగుతున్నాయి. పనివాళ్లు కూడా భోజనానికి వచ్చారు. కాకపోతే బంతితో కాకుండా దూరంగా కూర్చున్నారు. అందరి తినడమూ పూర్తయ్యేదాకా ఎవరూ బంతిలోంచి లేవకుండా ఉండటం మర్యాద. పనివాళ్లు తినడానికి ఎక్కువసేపు తీసుకుంటున్నారని ఒకరిద్దరు చదువుకున్న అతిథులు విసుక్కుంటున్నారు. ఎంగిలి చేత్తో ఊరికే కూర్చోవడంలో అర్థం లేదని వాళ్ల ఉద్దేశం. తను చేసిన పనికి ముసలామె సిగ్గుపడింది. రూపమీద ఆమెకు కోపం రాలేదు. కోడలు నిజమే మాట్లాడింది– అతిథులు తినకుండా ఇంట్లోవాళ్లు ఎలా భోంచేస్తారు? ఎవరైనా పిలిచేదాకా ఈ గదిలోంచి బయటకు వెళ్లకూడదనుకుంది. కానీ గాలిలో కలిసి వస్తున్న నెయ్యి వాసన ఆమె ఓపికను పరీక్షిస్తోంది. ఒక్కో క్షణం ఒక యుగంలా గడుస్తోంది. నోట్లో ఏదో పాడుకోవడానికి ప్రయత్నించింది. ఇంతసేపు తింటున్నారా అతిథులు? ఆమెకు ఏ శబ్దమూ వినపడలేదు. అందరూ తినేసి వెళ్లిపోయివుంటారు. నన్ను పిలవడానికి ఎవరూ రాలేదు. రూప కోపంతో ఉంది, ఆమె పిలవకపోవచ్చు. నేనే వస్తానని ఆమె అనుకుంటూండవచ్చు. నేనేమైనా బంధువునా ఆమె వచ్చి పిలుచుకుపోవడానికి. తనే వెళ్లడానికి సిద్ధపడింది వృద్ధురాలు. పూరీలు, కచోరీల తలంపు ఆమెను చక్కలిగింతలు పెట్టింది. చాలారోజుల తర్వాత ఇంట్లో పూరీలు చేశారు. కడుపారా తినేయాలని నిశ్చయించుకుంది. జిహ్వ చాపల్యమని ఎవరు అనుకున్నా సరే లెక్క చేయకూడదనుకుంది. నెమ్మదిగా చేతులు నేల మీద ఆన్చి, పాక్కుంటూ అరుగు మీదికి వెళ్లింది. కానీ అదృష్టం బాగాలేదు. ఆమె ఓపికలేని మనసు వేసిన లెక్క తప్పింది. అతిథులు ఇంకా తింటున్నారు. అప్పుడే తిన్నవాళ్లు వేళ్లు నాక్కుంటున్నారు. మిగిలిపోయిన పూరీలు ఎలా తీసుకెళ్లాలా అని కొందరు ఆలోచిస్తున్నారు. పెరుగు కానిచ్చి, మారు అడగటానికి మొహమాటపడుతున్నవాళ్లు కొందరు. సరిగ్గా ఈ సమయంలో వాళ్ల మధ్యకు వెళ్లింది. కొందరు ఉలిక్కిపడ్డారు. ఈ ముసల్ది ఎక్కడినుంచి ఊడిపడిందని కొందరు ఆశ్చర్యపోయారు. ఏమీ తాకకుండా చూడండని కొందరు అరిచారు. చిన్నమ్మను చూడగానే బుద్ధిరామ్‌కు మండిపోయింది. ఆమె అప్పటికే పూరీల పళ్లెం పట్టుకుంది. దాన్ని నేల మీదికి విసిరికొట్టాడు. అప్పు చెల్లించకుండా పారిపోతున్నవాణ్ని కఠినమైన వడ్డీ వ్యాపారి ఎలా పట్టుకుంటాడో అలా ఆమెను గదిలోకి లాక్కెళ్లాడు. వృద్ధురాలి కల క్షణంలో కరిగిపోయింది. అతిథులు తినడం పూర్తయింది. ఇంట్లోవాళ్లందరూ తిన్నారు. వాద్యకారులు, పనివాళ్లు కూడా తినడం అయింది. కానీ ముసలామెను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆమె చేసిన సిగ్గుమాలినపనికి ఈమాత్రం శిక్ష పడవలసిందే అనుకున్నారు బుద్ధిరామ్, రూప. ఎవరూ ఆమె వయసు మీద దయచూపలేదు. ఆమె నిస్సహాయతను పరిగణనలోకి తీసుకోలేదు. లాడ్లీకి తప్ప ఎవరికీ ఆమె మీద ప్రాణం కొట్టుకోలేదు. తల్లి, తండ్రి ఇద్దరూ నానమ్మను అలా అనడం ఆ చిట్టితల్లికి ఏడుపు తెప్పించింది. ఆమెకు చేతినిండా పూరీలు ఇస్తే ఏం పోతుంది? అతిథులకన్నా ఆమె ముందు తింటే ఆకాశం భూమ్మీద కూలిపోతుందా? గదిలోకి పోయి ఓదార్చుదామనుకుందిగానీ వాళ్లమ్మకు భయపడి ఊరుకుంది. తనకు వడ్డించిన పూరీల్ని తన బొమ్మపెట్టెలో దాచుకుంది. రాత్రి పదకొండయ్యింది. రూప అరుగు మీద పడుకుంది. పూరీలు తింటున్నప్పుడు నానమ్మ కళ్లల్లో కనబడే సంతోషాన్ని తలుచుకుని లాడ్లీకి నిద్ర పట్టలేదు. అమ్మ నిద్రపోగానే నానమ్మ దగ్గరకు పోవాలనుకుంది. కానీ బయట చీకటిగా ఉంది. మట్టిపొయ్యిల్లోని నిప్పులు మాత్రమే వెలుగుతున్నాయి. అక్కడో కుక్క కూర్చునివుంది. తలుపు వెనకాల నిమ్మచెట్టు మీద లాడ్లీ చూపు పడింది. దానిమీద హనుమంతుడు కూర్చున్నట్టుగా అనిపించింది. తోక, గద స్పష్టంగా కనబడుతున్నాయి. భయంతో కళ్లు మూసుకుంది. అప్పుడే కుక్క లేచి నిలబడింది. అది లాడ్లీకి ధైర్యాన్నిచ్చింది. పడుకునివున్న మనుషులకన్నా నిద్రలేచిన కుక్కే ఆమెకు ఎక్కువ ధైర్యాన్నిచ్చింది. తన బొమ్మపెట్టెను తీసుకుని నానమ్మ గదిలోకి వెళ్లింది. కొండమీదకు ఎవరో లాక్కుపోతున్నట్టుగా కల కంటున్న వృద్ధురాలు ఉన్నట్టుండి మేల్కొంది. అతిథులంతా వెళ్లిపోయుంటారు. దేవుడా, తిండి లేకుండా ఈ రాత్రి ఎలా గడపడం? నాకు పూరీలు ఇస్తే వాళ్ల సంపదేమైనా తరిగిపోతుందా? ‘నానమ్మ, లే’ అంటున్న లాడ్లీ గొంతు విని హుషారుగా లేచి కూర్చుంది. లాడ్లీని ఒళ్లో కూర్చోబెట్టుకుంది. లాడ్లీ పూరీలు చేతికిచ్చింది. ‘మీ అమ్మ ఇచ్చిందా?’ ‘కాదు, ఇవి నా వాటా’. ఐదు నిమిషాల్లో పూరీలు తినేసింది. కొద్దిపాటి వాన భూమ్మీది తాపాన్ని తగ్గించకపోగా వృద్ధి చేసినట్టు ఆ పూరీలు ముసలామె ఆకలిని మరింత పెంచాయి. ఇంకొన్ని తెమ్మని పాపను అడిగింది. అమ్మ కొడుతుందని భయపడింది చిన్నది. మిగిలిపోయిన తునకలు కూడా తిని, వేళ్లు నాక్కుంది ముసలామె. ఆకలి మరింత ఉధృతమైంది. విచక్షణ కోల్పోయేట్టు చేసింది. అతిథులు తిన్నచోటుకు పట్టుకెళ్లమని పాపను కోరింది. దేవుడా! అతిథుల ఎంగిలి విస్తళ్లలో మిగిలిపోయిన పూరీ ముక్కలను తీసుకుని తినసాగింది ఆ దీన హీన వృద్ధురాలు! వృద్ధాప్యం, శాపం. కళ్లు తెరిచిన రూపకు లాడ్లీ కనబడలేదు. ఆందోళనతో లేవగానే కనబడిన దృశ్యం ఆమెను స్తంభింపజేసింది. తన గొంతు కోస్తున్నప్పుడు ఆవు అనుభవించే లాంటి క్షోభను ఆమె అనుభూతించింది. ఎంగిలి విస్తళ్లలో చేయిపెట్టే ఖర్మానికి ఈ వృద్ధురాలిని తీసుకొచ్చానే! అయ్యో, ఈ ప్రపంచానికి ఏ విపత్తు రానున్నది? దయ, భయం ఆమె కళ్లల్లోంచి నీళ్లుగా జారినై. ఈ అధర్మానికి బాధ్యులెవరు? దేవుడా, నా బిడ్డల మీద దయ చూపించు. నేను చేసిన పాపానికి నన్ను శిక్షించకు. అయ్యో అయ్యో, ఇవ్వాళే నా పెద్దబిడ్డకు శుభకార్యం జరిగింది. వందల మంది భోంచేసి వెళ్లారు. ఎవరి ఆస్తినైతే మేము అనుభవిస్తున్నామో, ఆమెనే బిచ్చగత్తెను చేశామే! రూప దీపం వెలిగించింది. పళ్లెంలో పూరీలు నిండుగా పెట్టుకుంది. వృద్ధురాలి ముందు నిలబడి గద్గద స్వరంతో క్షమించమని ప్రార్థించింది. -
పెద్ద నేను
మనలోని ఎదగని నేను గుర్తొచ్చినప్పుడు మన పెద్ద నేను ఎలా బాధపడుతుంది? ఎనిమిదేళ్ల కింద గాలాహర్ ఇంత స్థాయికి ఎదుగుతాడని చాండ్లర్ ఊహించలేదు. అలాంటి స్నేహితుడు ఉండటం మాటలు కాదు. లంచ్ టైమ్ నుంచే చాండ్లర్ ఆలోచనలు గాలాహర్ చుట్టూ, గాలాహర్ నివసిస్తున్న లండన్ చుట్టూ తిరుగుతున్నాయి. తను పనిచేస్తున్న కింగ్స్ ఇన్స్లోని డెస్క్ దగ్గర కూర్చుని, ఈ ఎనిమిదేళ్లు తెచ్చిన మార్పు గురించి ఆలోచిస్తున్నాడు చాండ్లర్. తన స్నేహితుడికి సరైన అవసరాలే తీరేవి కావు. అలాంటిది ఇప్పుడు లండన్ పత్రికారంగంలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. విసుగెత్తించే రాత నుంచి దృష్టి మరల్చుకోవడానికి కిటికీలోంచి కిందకు చూశాడు. ఉడిగిపోయిన ముసలాళ్లు, అరుస్తున్న పిల్లలు అతడిని జీవితం గురించి ఆలోచింపజేసి బాధపెట్టాయి. జీవితం గురించి ఎప్పుడు ఆలోచించినా అతడికి బాధ కలుగుతుంది. అవ్యక్త దుఃఖమేదో చుట్టుముట్టింది. భాగ్యానికి వ్యతిరేకంగా ఎంత పోరాడితే ఏం లాభం? ఇంటి షెల్ఫుల్లో ఉన్న కవిత్వ పుస్తకాలు గుర్తొచ్చాయి. వాటిని తన బ్రహ్మచారి దినాల్లో కొన్నాడు. చాలా సాయంత్రాలు అందులోంచి ఒక పుస్తకం తీసి తన భార్యకు చదివి వినిపిద్దామన్న ఉబలాటం పుట్టేది. కానీ ఏదో సిగ్గు అడ్డు వచ్చి పుస్తకాలు అలాగే ఉండిపోయేవి. టైమ్ అవగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డెస్క్లోంచి లేచి బయటకు వచ్చేశాడు. హెన్రియెటా వీధి మురికి మనుషుల్ని దాటేసి, కులీనులు డంబాలు కొట్టే డబ్లిన్ వీధుల గుండా నడవడం మొదలుపెట్టాడు. కార్లెస్కు అతడు ఎప్పుడూ వెళ్లలేదు. కానీ దానికున్న పేరు తెలుసు. థియేటర్‌కు వెళ్లిన వాళ్లు ఇక్కడ నత్తగుల్లలు తింటారు, మద్యం సేవిస్తారు. అక్కడ వెయిటర్లు ఫ్రెంచ్, జర్మన్ మాట్లాడుతారని విన్నాడు. ఖరీదైన వస్త్రాలు ధరించిన మహిళలు, విలాస పురుషులు తోడురాగా క్యాబుల్లోంచి దిగి వేగంగా నడుస్తున్నారు. కాపెల్ వీధి వైపు మలిగాడు. లండన్ పత్రికారంగంలో ఇగ్నేషస్ గాలాహర్! ఎనిమిదేళ్ల కింద ఇది సాధ్యమని ఎవరు అనుకున్నారు? కానీ తన మిత్రుడి భవిష్యత్ గొప్పతనానికి సంకేతాలు అప్పుడే కనబడ్డాయి. కాకపోతే అతడికి పద్ధతీ పాడూ ఉండేది కాదు. పోకిరిరాయుళ్లతో తిరిగేవాడు. ఉదారంగా తాగేవాడు. అన్ని చోట్లా అప్పులు చేసేవాడు. కానీ అతడిలో ఉన్న ప్రతిభను మాత్రం ఎవరూ కాదనలేరు. అతడు అప్పు అడిగినా చేయి చాచినట్టు ఉండేది కాదు. చాండ్లర్ తన వేగం పెంచాడు. జీవితంలో మొదటిసారి తను దాటుతున్న మనుషులకన్నా తాను ఉన్నతుడినన్న భావం కలిగింది. సొగసు లేని కాపెల్ వీధి పట్ల అతడి మనసు ఎదురు తిరిగింది. నువ్వు సక్సెస్ కావాలంటే బయటికి వెళ్లాలి. ఈ డబ్లిన్‌లో ఉండి నువ్వేమీ చేయలేవు. గ్రాటెన్ వంతెన దాటుతుండగా కింద పారుతున్న నదిని చూశాడు. రేవులో ఉన్న గుడిసెల్లాంటి ఇళ్ల పట్ల జాలి కలిగింది. మనుషులంతా గుంపుగా పోగైన దేశ దిమ్మరుల్లా కనబడ్డారు. వారి మురికి కోట్లు, మూర్ఛిల్లజేసే సూర్యాస్తమయం, మెలకువకు వీడ్కోలు పలికే చల్లటి రాతిరి గాలి... ఈ భావాన్నంతా ఒక కవితగా మలవగలనా అని ఆలోచించాడు. గాలాహర్ దాన్ని ఏదైనా లండన్ పత్రికలో ప్రచురణ అయ్యేలా చూడొచ్చు. నిజంగా తాను సిసలైనది రాయగలడా? తన మనోవీధిలో చిన్న కాంతిపుంజం కదలాడింది. తన వయసు మరీ పెద్దదేం కాదు– ముప్పై రెండు. ఎన్నో భావాల్ని తను వ్యక్తం చేయాలనుకుంటాడు. నిజంగా తనకో కవి హృదయం ఉన్నదా? నిజంగా ఇవన్నీ కవితలుగా వ్యక్తం చేయగలిగితే పాఠకులు పట్టించుకుంటారు. మరీ అంత జనాదరణ పొందలేకపోవచ్చు. కానీ కొంతమంది సహృదయ పాఠకులను చేరగలడు. విమర్శకుల నుంచి రాబోయే గమనింపు వాక్యాలు కూడా అతడు ఊహించాడు. ‘శ్రీ చాండ్లర్కు సరళ సుందరమైన కవిత్వం వరంలా అబ్బింది’. కాకపోతే ఒకటే బాధ. తన పేరు ఎంతమాత్రమూ ఇక ఐరిష్గా ధ్వనించదు. అమ్మ పేరును తన పేరులో కలుపుకోవాలి. థామస్ మెలోన్ చాండ్లర్ లేదా టి.మెలోన్ చాండ్లర్. దీని గురించి గాలాహర్తో మాట్లాడాలి. కార్లెస్ను సమీపించగానే మళ్లీ ఆందోళన అతడిని ఆక్రమించింది. తలుపు తెరిచేముందు ఒక క్షణం నిలిచి, ఎట్టకేలకు లోనికి ప్రవేశించాడు. బారులోని కాంతి, శబ్దం అతణ్ని ద్వారంలోనే కుదిపేశాయి. అందరూ తననే కుతూహలంతో గమనిస్తున్నట్టుగా భావించుకున్నాడు. అదిగో కౌంటర్‌కు ఒరిగి కూర్చుని... ఇగ్నేషస్ గాలాహర్! ‘హలో, టామీ, పాత హీరో, నువ్విక్కడ! ఏం తీసుకుంటావ్? దేవుడా, ఎట్లా పెద్దోళ్లమైపోతున్నాం!’ విస్కీ ఆర్డర్ చేశాడు గాలాహర్. అతడు సోడా పోసుకోలేదు. చాండ్లర్ మాత్రం పలుచగా తాగుతానన్నాడు. ఎప్పుడూ పరుగులు పెట్టాల్సిన పత్రికోద్యోగం గురించి మాట్లాడాడు గాలాహర్. మురికి డబ్లిన్‌లో అడుగుపెట్టాక చాలా విశ్రాంతిగా ఉందన్నాడు. పాత స్నేహితులను గుర్తు చేసుకున్నారు. ‘టామీ, నువ్వు ఇంత కూడా మారలేదు. ఆదివారం ఉదయాల్లో నాకు లెక్చర్లు ఇచ్చే అదే గంభీరమైన మనిషివి. నువ్వు ప్రపంచాన్ని ఏదో చేయాలనుకునేవాడివి. ఎక్కడికీ పోలేదా కనీసం యాత్రకైనా?’ ‘ఐల్ ఆఫ్ మేన్(ఐర్లాండ్ పక్కని చిన్న ద్వీపం)కు పోయాను,’ చెప్పాడు చాండ్లర్. గాలాహర్ నవ్వాడు. ‘లండన్ వెళ్లు లేదా పారిస్. పారిస్ బాగుంటుంది.’ ‘నువ్వు పారిస్ చూశావా?’ పారిస్ లాంటి నగరం మరోటి లేదనీ, అందం కన్నా అక్కడి జీవితం ఆకర్షిస్తుందనీ ఊరించాడు గాలాహర్. ఐరిష్ వాళ్లంటే ఫ్రెంచ్‌వాళ్లకు పిచ్చి, తాను ఐరిష్ అని తెలిసి దాదాపు తినేయబోయారని చెప్పాడు. పారిస్ అమ్మాయిలు ఉంటారు...! బార్మాన్ చూపును తనవైపు తిప్పుకోవడానికి కొంచెం తిప్పలు పడి, డ్రింక్ ఆర్డర్ చేశాడు చాండ్లర్. గాలాహర్ యాస, అతడు తన గురించి వ్యక్తం చేసుకుంటున్న తీరు చాండ్లర్కు అంతగా నచ్చలేదు. లండన్ అలా మార్చేస్తుందేమో! కానీ గాలాహర్ ప్రపంచాన్ని చూశాడు. చాండ్లర్‌లో అసూయ జనించింది. గాలాహర్ తన సిగార్ కేసులోంచి సిగార్లు బయటికి తీశాడు. ఇద్దరూ మౌనంగా కాల్చారు. తర్వాత పై స్థాయి ఇంగ్లీషు సమాజంలోని చాలా రహస్యాలు పంచుకున్నాడు గాలాహర్. ఎవరినీ వదలిపెట్టలేదు. ‘అన్నట్టూ హోగన్ చెప్పాడు, నువ్వు దాంపత్య సౌఖ్యాన్ని రుచి చూశావట, రెండేళ్ల కింద, నిజమేనా?’ చాండ్లర్ సిగ్గుతో నవ్వాడు. అప్పుడు చిరునామా తెలియలేదనీ, ఇప్పటికైనా మించిపోలేదని భావిస్తూ శుభాకాంక్షలు అందించాడు గాలాహర్. ‘నీకు ఎల్లవేళలా సంతోషం, కట్టలకొద్దీ డబ్బులు, నేను కాల్చేదాకా రాని చావును కోరుకుంటున్నా’. పిల్లల గురించి అడిగాడు గాలాహర్. ‘ఒకరు’. ‘కొడుకు? కూతురు?’ ‘బాబు’ వెళ్లే లేపు తమ ఇంటికి ఓసారి రావాలనీ, తన భార్య సంతోషిస్తుందనీ ఆహ్వానించాడు చాండ్లర్. ‘మనం ముందే కలవలేకపోయాం. రేపు రాత్రే నేను వెళ్లాల్సివుం’దని క్షమాపణ కోరాడు గాలాహర్. ‘పోనీ ఈ రాత్రికి’ ఈ రాత్రి ఇంకొకరిని కలవాల్సివుందని బదులిచ్చాడు. వచ్చే సంవత్సరం కచ్చితంగా వస్తానని హామీ ఇచ్చాడు. ‘సంతోషం వాయిదాపడుతుందంతే’. తన బంగారు వాచీని తీసి టైమ్ చూసుకున్నాడు గాలాహర్. చివరి రౌండు డ్రింక్స్ తాగడం పూర్తయింది. మూడు పెగ్గులు, స్ట్రాంగ్ సిగార్ మితంగా తాగే చాండ్లర్ తలకు బాగా ఎక్కాయి. తన జీవితానికీ తన స్నేహితుడి జీవితానికీ మధ్య వున్న భేదం స్పష్టంగా అర్థమవసాగింది. పుట్టుకలోనూ చదువులోనూ గాలాహర్ తనకు సాటిరాడు. ఇది ఏ విధంగానూ న్యాయంగా కనబడలేదు. అన్నింటికీ జంకే తన స్వభావమే దీనికి కారణం. తన ఆహ్వానాన్ని గాలాహర్ తిరస్కరించడం ఎత్తినట్టుగా కనబడింది. ‘ఎవరికి తెలుసు? వచ్చే సంవత్సరం నువ్వు ఇక్కడికి వచ్చేసరికల్లా మిస్టర్ అండ్ మిసెస్ ఇగ్నేషస్ గాలాహర్కు నేను శుభాకాంక్షలు చెబుతానేమో.’ గాలాహర్ ఖండించాడు. దానికంటే ముందు లోకాన్ని చూడాలని వుందన్నాడు. ఒకవేళ చేసుకున్నా డబ్బు బలిసిన అమ్మాయిని చేసుకుంటానన్నాడు. ‘వందలు వేల జర్మన్లు, యూదులు డబ్బుతో కుళ్లిపోతున్నారు. చూడు నా ఎత్తులు ఎలా వేస్తానో’.∙∙l బాబును ఎత్తుకునివున్నాడు చాండ్లర్. డబ్బులు మిగుల్చుకోవడానికి వాళ్లు పనిమనిషిని పెట్టుకోలేదు. పొద్దున కాసేపు ఆనీ చిన్న చెల్లెలు మోనికా వచ్చి ఇంటిపనుల్లో సాయం చేసి వెళ్తుంటుంది. పావు తక్కువ తొమ్మిదయింది. ఇంటికి ఆలస్యంగా రావడమే కాకుండా ఆనీ తెమ్మన్న కాఫీపొడిని మరిచిపోయి వచ్చాడు చాండ్లర్. అందుకే అతడు అడిగినవాటికి పొడిగా జవాబిచ్చింది. పడుకుంటున్న బాబును అతడి చేతుల్లో పెట్టి మళ్లీ షాపులు మూసేస్తారేమోనని తనే కాఫీ పొడి, చక్కెర తేవడానికి బయటికి వెళ్లింది. ‘ఇదిగో, వాడిని నిద్రలేపకు’. ఫ్రేములో ఉన్న ఆనీ ఫొటో చూశాడు చాండ్లర్. ఆమె వేసుకున్న బ్లూ సమ్మర్ బ్లౌజ్ కొనడానికి తను ఎలా హడావుడి పడిందీ, అంత ఖరీదైనది ఎందుకని ముందు అని తర్వాత ఎలా వేసుకుని మురిసిపోయిందీ అంతా గుర్తొచ్చింది. హ్మ్! ఆమె కళ్లవైపు చూశాడు. స్నేహంగా కనబడలేదు. గాలాహర్ చెప్పిన ధనిక యూదుల గురించి ఆలోచించాడు. ఈ కళ్లను ఎందుకు తాను పెళ్లాడాడు! ఇంటికోసం అద్దె పద్ధతిలో తెచ్చిన అందమైన ఫర్నిచర్లో కూడా ఏదో అల్పత్వం కనబడింది. ఈ చిన్న ఇంట్లోంచి బయటపడే మార్గం లేదా? గాలాహర్లాగా ధైర్యంగా బతక ప్రయత్నించడానికి మరీ ఆలస్యమైందా? తాను లండన్ వెళ్లగలడా? ఒక పుస్తకం రాయగలిగితే ఏదైనా ద్వారం తెరుచుకుంటుందేమో! టేబుల్ మీద పెట్టివున్న బైరన్ పొయెట్రీ తీసి చదవడానికి ప్రయత్నించాడు. తాను అలా రాయగలడా? గ్రాటన్ వంతెన దాటుతుండగా కలిగిన సంవేదన లాంటిది... పిల్లాడు నిద్ర లేచి ఏడవటం ప్రారంభించాడు. వాడిని ఊరడిస్తూనే చదవబోయాడు. సాధ్యం కాలేదు. తాను చదవలేడు. ఏమీ చేయలేడు. వ్యర్థం, వ్యర్థం! పిల్లాడు అలాగే ఏడుస్తున్నాడు. ‘నోర్ముయ్’ అని అరిచాడు. వాడు ఒకసారి ఆగి, అంతకంటే గట్టిగా మొదలెట్టాడు. శ్వాస ఆగిపోతుందా? ఊరుకోబెట్టడం తన వల్ల కావడం లేదు. తలుపు తెరుచుకుని ఆనీ పరుగెత్తుకుంటూ వచ్చింది, ‘ఏమైంది? ఏమైంది? ఏం చేశావ్ వాణ్ని?’ పార్సిల్‌ను కింద పెట్టి భర్త చేతిలోంచి కొడుకును తీసుకుంది. తల్లి మాట వినగానే పిల్లాడు మరింత గట్టిగా ఏడ్చాడు. ‘నేనేం చేయలేదు ఆనీ... వాడే ఏడుస్తున్నాడు... నేనేం చేయలేదు... నేను నేను...’ ‘ఓ చిన్ని తండ్రీ. భయపడ్డావా? ఉల్లలలలలలల.. నా బుజ్జి గొర్రెపిల్ల’ చాండ్లర్ చెంపలు సిగ్గుతో ఎర్రబారాయి. పిల్లాడి ఏడుపు క్రమంగా నెమ్మదించింది. చాండ్లర్ కళ్లలోంచి పశ్చాత్తాపపు కన్నీళ్లు కారాయి. జేమ్స్ జాయ్స్(1882–1941) ‘ఎ లిటిల్ క్లౌడ్’ కథాసారం ఇది. ఐరిష్ కథకుడు, కవి, నవలాకారుడు జాయ్స్. ‘యులసిస్’ ఆయన ప్రసిద్ధ నవల. అత్యున్నత స్థాయిలో చైతన్య స్రవంతి శైలి కనబరిచిన రచన. ‘డబ్లినర్స్’ ఆయన కథా సంకలనం.