
మాస్ హీరోగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న గోపిచంద్, ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోతున్నాడు. మాస్ యాక్షన్ సినిమాలతో పాటు స్టైలిష్ ఎంటర్‌టైనర్‌లు కూడా నిరాశపరచటంతో గోపిచంద్ నెక్ట్స్ సినిమా విషయంలో సెంటిమెంట్ నే నమ్ముకుంటున్నాడు. చక్రి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు గోపిచంద్.
ఈ సినిమాకు ‘పంతం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. గతంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన యజ్ఞం, రణం, లక్ష్యం, లౌఖ్యం, శౌర్యం సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అంతేకాదు గోపిచంద్ ప్రతినాయక పాత్రలో నటించిన జయం, వర్షం సినిమాలు కూడా ఆకట్టుకున్నాయి. అందుకే తన కొత్త సినిమాకు కూడా అదే తరహా టైటిల్ ను నిర్ణయించాడు గోపిచంద్. పంతం సినిమాలో గోపిచంద్‌కు జోడిగా మెహరీన్ నటించనుంది.