
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ మెహరీన్. తొలి సినిమాతోనే నటించిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెహరీన్ తరువాత షార్ట్ గ్యాప్ తీసుకుంది. తరువాత రీ ఎంట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో వరుస విజయాలు సాధించటంతో ఈ అమ్మడికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న ఈ బ్యూటీని మరో క్రేజీ ఆఫర్ వరించింది.
మాస్ హీరో గోపిచంద్ హీరోగా రూపొందనున్న కొత్త సినిమాలో మెహరీన్ ను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. చక్రి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రాధమోహన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ‘ఆక్సిజన్’ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపిచంద్ సరసన అను ఇమ్మాన్యూల్, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment