
యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గోపీచంద్‌కు.. సరైన హిట్ తగిలి చాలా కాలమైంది. చివరగా పంతం సినిమాతో పలకరించినా.. హిట్ కొట్టాలనే పంతాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. అయితే ఈ సారి మాత్రం ఎలాగైనా హిట్టుకొట్టాలనే కసితో ‘చాణక్య’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌తో సినిమాపై మంచి బజ్ నెలకొనగా.. ట్రైలర్‌తో అంచనాలు పెంచేశారు. సీక్రెట్ రా ఏజెంట్, బ్యాంక్ ఉద్యోగిగా డిఫరెంట్ షేడ్స్‌లో నటించిన గోపిచంద్.. మరోసారి యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీసినట్టు కనిపిస్తోంది. గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment