గోపీచంద్
వెండితెరపై ‘చాణక్య’గా తన సత్తా చూపించడానికి సిద్ధమయ్యారు గోపీచంద్. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలు. రామబ్రహ్మం సుంకర ఈ సినిమా నిర్మించారు. అజయ్ సుంకర సహ–నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను అక్టోబరు 5న విడుదల చేయబోతున్నామని శనివారం చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఇటీవల విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరామన్: వెట్రి పళనీ స్వామి.
Comments
Please login to add a commentAdd a comment