అసెంబ్లీలో వాస్తు మార్పులపై కేసీఆర్ చర్చ
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి వాస్తు మార్పులపై చర్చలు జరిపారు. తెలంగాణ అసెంబ్లీలో వాస్తు మార్పులపై ఆయన శనివారం స్పీకర్ మధుసూదనాచారితో చర్చించారు. సీటింగ్ విధానంపై కేసీఆర్ ..... స్పీకర్తో చర్చించినట్లు సమాచారం. అయితే బడ్జెట్ ప్రక్రియ అనంతరం మార్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆది నుంచి కేసీఆర్కు బోలెడన్ని సెంటిమెంట్లు. ఏ పని చేయాలన్న దానికో ముహూర్తం… వాస్తు వగైరా చూసుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత క్యాంపు ఆఫీసు విషయంలో కేసీఆర్ అనేక తర్జన భర్జనలు పడిన విషయం తెలిసిందే.
మరోవైపు అసెంబ్లీలో పూర్తి అంశాలపై సిద్ధం కావాలని కేసీఆర్ ఆదేశించారు. లాగే మెదక్ లోక్సభ స్థానానాకి ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన నేపథ్యంలో దానిపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 10న రాష్ట్ర తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.