vastu
-
బీజేపీ రాష్ట్ర ఆఫీస్‌కు మరోసారి ‘వాస్తు’ మార్పులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయ భవనంలో మరోసారి వాస్తుకు సంబంధించిన మార్పులు జరుగుతున్నాయి. నాంపల్లిలోని పార్టీ కార్యాలయం నిర్మించిన నాటినుంచి పలుమార్లు నిర్మాణపరమైన మార్పులు చేశారు. వాస్తుకు భిన్నంగా ఉన్నాయని టాయ్లెట్లను గతంలోనే తొలగించి, కార్యాలయం వెనుక భాగంలో నిర్మించారు. తొలుత నిర్మించిన ప్రధాన ద్వారాన్ని మూసేసి పక్కవైపు నుంచి మెటల్ స్టెప్స్‌తో మరో ద్వారం తెరిచారు. ప్రధాన ద్వారాన్ని కొంతకాలంగా మూసేశారు. గతంలోని ప్రధాన ద్వారానికి కింద కొంత దూరంలో ఉన్న సెల్లార్‌కు వెళ్లే దారిని కూడా మూసేసి, దానిపై ఒక గదిని నిర్మించారు. తాజాగా మళ్లీ వాస్తుకు అనుగుణంగా మార్పుచేర్పులకు రాష్ట్రబీజేపీ నాయకత్వం శ్రీకారం చుట్టింది. పాత ప్రధాన ద్వారాన్ని పూర్తిగా తొలగించి, సెల్లార్ మార్గం మీదుగా కొత్త ప్రధాన ద్వారం ఏర్పాటు దిశగా పనులు సాగుతున్నాయి. హంపి పీఠాధిపతి సూచనల మేరకు వాస్తును పాటిస్తూ ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. పార్టీ బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకొని మార్పులు చేస్తున్నట్టు పార్టీవర్గాల సమాచారం. -
సరళ వాస్తు గురూజీ దారుణ హత్య.. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి
హుబ్లీ (కర్ణాటక): సరళవాస్తు ద్వారా రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో ఖ్యాతి పొందిన చంద్రశేఖర్ గురూజీ మంగళవారం పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. హుబ్లీ ప్రెసిడెంట్ హోటల్లో ఈ దారుణం జరిగింది. ఆయన శిష్యులే ఈ ఘాతుకానికి పాల్పడడంతో గురువుకే వాస్తు దోషం కలిగిందా? అన్న ప్రశ్న తలెత్తింది. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి చంద్రశేఖర్ దగ్గర పని చేస్తున్న మహంతేష్ శిరూర్, మంజునాథలను నిందితులుగా గుర్తించారు. వీరిలో గురూజీకి ఒకరు కాళ్లకు మొక్కుతున్నట్లుగా నటించగా, మరొకరు చాకుతో పొడిచాడు. కిందకు పడినా కూడా వదలకుండా సుమారు 40 సార్లకు పైగా కత్తితో పొడిచి హోటల్ నుంచి తప్పించుకున్నారు. పోలీసులు వెంటాడి బెళగావి జిల్లా రామదుర్గ వద్ద ఈ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. హత్య జరిగిన 4 గంటల్లోనే నిందితులు పట్టుబడ్డారు. హుబ్లీ పోలీస్ కమిషనర్ లాభురాం మాట్లాడుతూ గురూజీ ప్రెసిడెంట్ హోటల్లో బస చేశారు. ఇద్దరు వ్యక్తులు వచ్చారని తెలిసి వారిని కలవడానికి లాబీలోకి వచ్చారు. ఈ సమయంలో కత్తితో దాడి చేసి పరారయ్యారు అని చెప్పారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. హత్య దృశ్యాలు హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితులు మంజునాథ, మహంతేష్ ఆస్తి వివాదమే కారణమా? హత్యకు ఆస్తి వివాదమే కారణమని చెబుతున్నారు. చంద్రశేఖర్ గురూజీ శిష్యుల పేరిట బినామీ ఆస్తులు పెట్టారని, నిందితుడు మహంతేష్ పేరున కోట్లాది రూపాయల ఆస్తి చేశారని చెబుతున్నారు. ఉద్యోగం నుంచి తొలగించాక తన ఆస్తిని తిరిగి ఇచ్చేయాలని గురూజీ ఒత్తిడి చేసేవాడు. అయితే తిరిగి ఇవ్వడం కుదరదని మహంతేష్ తెగేసి చెప్పాడు. ఇదే విషయమై మాట్లాడడానికి హోటల్‌కు వచ్చి ఆయన్ను హత్య చేశారు. కాగా చంద్రశేఖర్ గురూజీ అంత్యక్రియలు సుళ్య గ్రామంలో బుధవారం నెరవేరనున్నాయి. అత్యంత ప్రజాదరణ సొంతం సరళ్ వాస్తు సూత్రాలతో గురూజీ ప్రసిద్ధి చెందారు. అనేక టీవీ చానెళ్లలో నిత్యం కనిపిస్తూ ఉండేవారు. సరళమైన జీవనం గురించి ఉపన్యాసాలిస్తుంటారు. యూట్యూబ్‌లో ఆయన వీడియోలకు లక్షలాది వ్యూస్ రావడం బట్టి ఆయన ప్రజాదరణ ఏమిటో అర్థమవుతుంది. గురూజీ వయసు గురించి ఎప్పుడూ చెప్పేవారు కాదు. సుమారు 55 ఏళ్లకు పైగా వయసు ఉంటుందని అంచనా. ఆయన స్వస్థలం బాగల్‌కోట జిల్లా. తల్లి పేరు నీలమ్మ అంగడి. భార్య, కుటుంబ విషయాలు గుట్టుగా ఉంచారు. చదవండి: (టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ కన్నుమూత) -
టీఎస్ఆర్టీసీ బస్ భవన్లో వాస్తు మార్పులు..
-
ఆర్టీసీ నష్టాలకు వాస్తు దోషమా? బస్‌భవన్‌కు వాస్తు మార్పులు
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు అధికారులు వారికి తోచిన రీతిలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వాస్తును కూడా వారు అనుసరిస్తున్నారు. తాజాగా బస్‌భవన్‌కు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రధాన మార్గం వైపు ఉన్న గేటును మూసేశారు. ఈ మార్గానికి సరిగ్గా వెనకవైపు చిన్న రోడ్డుపై ఉన్న మరో గేటును వినియోగిస్తున్నారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం సంధ్య థియేటర్ ముందు నుంచి వెళ్లే రోడ్డు ప్రధానమైంది కావడంతో ఇంతకాలంగా ఆ వైపు గేటునే ప్రధాన ద్వారంగా వినియోగిస్తూ వస్తున్నారు. అయితే ఇది దక్షిణ ముఖంగా ఉండడంతో వాస్తుకు అనుకూలంగా లేదన్న ఉద్దేశంతో తాజాగా ఈ మార్పు చేశారు. కొత్తగా వినియోగించే గేటు ఈశాన్యం వైపు ఉంది. ప్రస్తుతం వాహనాలన్నింటిని ఆ గేటు నుంచే అనుమతిస్తున్నారు. కొత్త ఎండీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన రోజున నూతన గేటులోంచే లోనికి వచ్చారు. ఇదిలా ఉండగా సజ్జనార్ రాకముందే వాస్తు మార్పు నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు దానిని అమలులోకి తెచ్చామని ఓ అధికారి పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం -
నామ్ కే వాస్తు కాదు!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వాస్తు నమ్మకాలు తారస్థాయికి చేరాయి. ఇల్లు, ప్లాట్లు, ఫ్లాట్లు.. ఇలా ఏదైనా కొనాలంటే వాస్తు తప్పనిసరి అయినట్లు తాజా అధ్యయ నంలో తేలింది. నగరంలోని 80% మందిలో ఇలాంటి నమ్మకాలున్నట్టు మహీంద్రా లైఫ్ స్పేసెస్ సంస్థ అధ్యయనం తేల్చింది. వాస్తు నమ్మకాల విషయంలో జాతీయ సగటు 40 శాత మైతే, గ్రేటర్ సిటీలో అంతకు రెట్టింపు స్థాయిలో వాస్తు నమ్మ కాలుండటం విశేషం. ఐటీ ప్రొఫెషనల్స్ సైతం.. నగరంలో క్షణం తీరిక లేకుండా ఉండే, ఆధు నిక జీవనశైలి కలిగిన ఐటీ, బీపీఓ, కేపీఓ, మెడికల్ రం గాల్లోని వృత్తి నిపుణులు సైతం వాస్తు నమ్మకా లను తూ.చ. తప్ప కుండా పాటిస్తున్నట్లు ఈ సంస్థ వెల్లడిం చింది. 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయో గ్రూపుల వారు సైతం వాస్తుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. తమ ఉద్యోగం, వృత్తి వ్యాపారాలు, అదృష్టం, జీవనశైలి తదితర అంశాలపై వాస్తు బలీయమైన ప్రభావం చూపుతుందని వీరంతా భావిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. ఎవరి నమ్మకాలు వారివే.. ఇంటి ప్రధాన ద్వారం, రోడ్డు ఫేస్, కిచెన్, టాయిలెట్, బాల్కనీ, పూజా మందిరం, బెడ్రూమ్, వాష్ ఏరియా తదితరాలను తమకు అనుకూలమైన దిక్కుల్లో, పక్కా వాస్తు నమ్మకాలతో నిర్మించుకునే ందుకు గ్రేటర్‌వాసులు ఆసక్తి చూపుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. నిర్మాణం ఏదైనా వాస్తే ప్రధానం అన్న చందంగా మారింది ఈ నమ్మకం. వాస్తు లేకుంటే కొనుగోలుకు ‘నో’ గ్రేటర్ పరిధిలో అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలు.. ఏవి కొనాలన్నా వాస్తు తప్పనిసరైంది. సంప్రదాయ వాస్తు విధానాల్లో సైన్స్ అంతర్భాగంగా ఉంది. ఈస్ట్, నార్త్ ఈస్ట్ తదితర దిక్కుల్లో ముఖద్వారాలుండే ఇళ్లకు గిరాకీ ఎక్కువ. వాస్తు పక్కాగా ఉంటే అధిక ధరలు వెచ్చించేందుకూ వెనుకాడటంలేదు. అన్ని వయో గ్రూపుల్లో వాస్తు నమ్మకాలు పెరిగాయి. – గుమ్మి రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు -
వాస్తు పూజల పేరిట మోసం
సాక్షి, చేర్యాల(సిద్దిపేట): వాస్తు పూజలు చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని చెప్పి మోసం చేసిన 9 మందిపై కేసు నమోదు చేసినట్లు హుస్నాబాద్ ఏసీపీ ఎస్.మహేందర్ తెలిపారు. సోమవారం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రఘుతో కలిసి ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తిరుగుతూ జాతకాలు, వాస్తు పూజలు చేస్తూ జీవనం సాగించే సిరిసిల్ల జిల్లా చీర్లవంచకు చెందిన గందం జంపయ్య ఈ నెల 17న మండల పరిధిలోని ఆకునూరుకు చెందిన జక్కు నర్సింహులు ఇంటికి వచ్చి మీ ఇంట్లో శక్తులు ఉన్నాయని, వాటిని తీసివేస్తే మీకు అంతా మంచి జరుగుతుందని నమ్మించి రూ.46 వేల విలువైన పూజ సామను (స్వర్ణభస్మం) తీసుకుని మరుసటి రోజు మరో ఇద్దరు వ్యక్తులతో వచ్చి ఊదు పొగ వేసి మంత్రాలు చదివినట్లు చేసి మరో రూ.10 వేలు, ఒక గొర్రె పిల్లను తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నర్సింహులు కుమారుడు ఈ నెల 23న చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో సోమవారం కొందరు వ్యక్తులు మారుతీ కారులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు వేములవాడకు చెందిన బూర రాజును అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వారి నుంచి రూ.55 వేలు నగదు, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ విషయంలో చీర్లవంచకు చెందిన గందం నీలయ్య, టేకు దుర్గయ్య, కడమంచి లింగమయ్య, బూర రాజుతో పాటు మరో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. కేసును త్వరగా విచారణ చేసి నిందితులను పట్టుకున్న ఎస్ఐ మోహన్‌బాబు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
సంపంగి పువ్వులు
జీవన కాలమ్ అర్హత అరటి చెట్టులాంటిది. అరటి చెట్టు శరీర మంతా మనిషికి ఉపకారం చేస్తుంది– కాయ, పండు, ఆకు, దూట, ఆఖరికి దొప్ప కూడా. ఆర్జన వారకాంత లాంటిది. సంపంగి పువ్వు. మత్తెక్కిస్తుంది. మరులు గొలుపుతుంది. ఇంకా లేక పోతే ఎలాగ అనిపిస్తుంది. అనిపించేలోగానే ఇంకా లేకుండా పోతుంది. అర్హత పెద్దమనిషి. నమ్మకంగా సేవ చేస్తుంది. ఆర్జన పెద్ద ఆకర్షణ. నమ్మకంగా దాన్ని పట్టుకు వేలాడాలని పిస్తుంది. రాజకీయ నాయకులకు ‘వాస్తు’ మీద అపారమైన నమ్మకం. కారణం– వారి పదవులు ‘ఆర్జన’. లాల్ బహదూర్ శాస్త్రి వాస్తు గురించి ఆలోచించినట్టు మనమెవరమూ వినలేదు, అలాగే అబ్దుల్ కలాం. వాస్తు మాత్రమే కాదు. నేటి రాజకీయ నాయకులు చాలామందికి చాలా విషయాలమీద అపనమ్మకం. ఉదాహరణకి కర్ణాటక పబ్లిక్ వర్క్స్ మంత్రి రేవన్న మంత్రిగా ఉన్నంతవరకూ బెంగుళూరు బంగళాలో నిద్రపోరాదని జ్యోతిష్యుడు హెచ్చరించాడు. అందు వల్ల ఆయనేం చేస్తాడు? రోజూ 7 గంటలు– 370 కిలోమీటర్లు ప్రయాణం చేసి తన సొంతవూరు హోలె నరసిపురా ఇంట్లో పడుకుని నగరానికి వస్తాడు. ఒకప్పుడు జయలలిత అమ్మగారి నమ్మకాలు ఊహించలేనివి. ప్రతీ రోజూ–రోజుకో రంగు చీరె. సోమవారమయితే–ఆకుపచ్చ–ఇలాగ ఇక ఆఫీసులో ఆమె కుర్చీ ఎప్పుడూ తూర్పు వైపు ఉండాలి. రోజూ బీచ్‌లో కణ్ణగి విగ్రహం ముందునుంచి వెళ్లడం ఆమెకు బొత్తిగా నచ్చేది కాదు. దాన్ని ఏవో కార ణాలకి తీయించేశారు. రాజకీయ దుమారం రేగింది. దరిమిలాను అది డీఎంకే ఆఫీసుకి చేరింది. ఈ వ్యవ హారం బయటపడి–మరో విగ్రహాన్ని పెట్టక తప్పింది కాదు. అన్నగారు తన రోజుల్లో పాత రోజుల్నాటి సెక్రటేరియట్ ప్రవేశ ద్వారం గుండా వెళ్లడం మంచిది కాదని ఎవరో వాస్తు నిపుణులు చెప్పారట. తదాదిగా వారి పరిపాలనంతా ఇంటి దగ్గర నుంచే సాగింది. ట్యాంక్‌బండ్ వైపు ద్వారం తెరిచాక సెక్ర టేరియట్కి వచ్చారంటారు. మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుగారు అందరికన్నా ఎతైన భవనంలో ఉండాలని వాస్తు. అందుకని కొత్త కాంప్లెక్స్‌లో ఐదు ఫ్లోర్లు, ఆరు ప్రత్యేకమైన బ్లాకులు ఉన్న భవనాలు సిద్ధమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఒక నమ్మకం ఉంది. పదవిలో ఉండగా నోయిడాకి వస్తే ఆ పదవి పోతుందని. అఖిలేష్ యాదవ్ పదవిలో ఉండగా ఆ వేపు కూడా చూడలేదట. ఒక్క వ్యాపారి నమూనా. విశాఖపట్నంలో కోట్ల వ్యాపారి. తిరుగులేదు. కానీ తొలి రోజుల్లో ముఖ ద్వారం వాస్తు ప్రకారం చాలా నాసిరకం అని శాస్త్ర జ్ఞులు తేల్చారు. మరి ఎలాగ? ఆ భవనానికి ఈశా న్యం మూల ఓ చిన్న గుమ్మం ఉంది. అది ఆ భవ నంలో పక్క సందులోకి పోతుంది. అయితే అది వాస్తు ప్రకారం మహత్తరమైన ప్రవేశ ద్వారం. ఇప్ప టికీ దుకాణాన్ని మొదట ఆ గుమ్మాన్ని తెరిచి లోనికి వెళ్లాకనే పెద్ద తలుపులు తెరుస్తారు. చిలుకూరు బాలాజీ గుడి ప్రధాన అర్చకులు రంగరాజన్‌గారు ఓ సరదా అయిన కథ చెప్పారు. ఓ హైదరాబాద్ రాజకీయ నాయకుడు ఆయన్ని కలిసి తన ఇంటిముందున్న మర్రి చెట్టువల్ల తనకి పదవి రావడం లేదని దాన్ని కొట్టించమని కోరారట. రంగ రాజన్‌గారు నవ్వి ‘అయ్యా.. చెట్టు తీసేయడం కాదు. రోజూ చెట్టుకి పూజ చెయ్యండి. పదవి వస్తుంది’ అన్నారట. మరో నాలుగు నెలలకి ఆయనకి నిజం గానే పదవి వచ్చింది. చెట్టుకి పూజలందాయి. భారతదేశం తరువాత అంత భారతీయత కనిపించే మరొక దేశం నేపాల్. నా మట్టుకు– భారత దేశం కన్నా భారతీయత పాలు నేపాల్‌లోనే ఎక్కు వేమో? నేపాల్ దేశమంతా ఒకప్పుడు చిన్న చిన్న రాజుల సామ్రాజ్యాలు. ప్రతీ రాజూ దైవభక్తుడే. అక్కడే ఆశ్చర్యకరమైన విషయం చూశాను. ప్రతీ రాజు కోటలోనూ– ఆయన పడక గదిలో కళ్లు విప్ప గానే కనిపించేటట్టు– ఎదురుగా– భారదేశంలో ఉన్న అన్ని గొప్ప దేవాలయాల నమూనాలు దర్శనమి స్తాయి. కాశీ, కేదార్, పూరీ, జగన్నాథ్, తిరుమల ఆల యం–ఇలాగ. ఈ ఏర్పాటుకి రెండు పార్శా్వలున్నా యేమో! ఒకటి: భక్తి. దానితో మనకి తగాదా లేదు. రెండు: వాస్తు. ఎన్నో చిన్న చిన్న కోటలు– నమూనా దేవాలయాలు చూశాను. ఆశ్చర్యం– నూటికి నూరు పాళ్లూ నమూనాలు! సంపంగి పువ్వులు గుబాళిస్తాయి. మరో ఆలో చన లేకుండా చేస్తాయి. అవి లేకపోతే బతికేదెలా అని పిస్తాయి. కానీ వాటి జీవితం అంతంతమాత్రం అని మనకి తెలుసు. ఎక్కువ కాలం నిలవకపోవచ్చునని తెలుసు. కనుకనే కృత్రిమమైన దన్ను కావాలి. పరో క్షంగా ప్రాణం పోసి బతికించుకోవాలని తాప త్రయం. అందుకే రోజుకి 7 గంటల ప్రయాణం. గొల్లపూడి మారుతీరావు -
వాస్తుపై అవగాహన కల్పించే గ్రంథం
తూర్పున వంటగది, ఈశాన్యాన పూజగది ఉండాలనీ... వాయువ్యాన వంట చేయకూడదనీ... ఇలా ఎన్నో వాస్తు శాస్త్ర విషయాలు సామాన్యులకు కూడా తెలుసు. అయితే, అలా ఎందుకు ఉండాలి, లేకపోతే నష్టం ఏమిటి.. అని అడిగితే చెప్పగలిగేవారు అరుదు. అలాగే సింహద్వారానికి ఎదురుగా రోడ్డు ఉంటే వీధిశూల అని ఆ ఇంటిలో ఉండటానికి ఇష్టపడరు ఎవరూ. కొందరికి తూర్పు సింహద్వారం గల ఇల్లు కలిసొస్తే, మరికొందరికి పడమర అస్సలు పనికిరాదు. కొందరికి ఉత్తర ద్వారం గల ఇంటిలో చేరినప్పటినుంచి వద్దంటే డబ్బు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కొందరు తాము ఉన్న ఇల్లు బొత్తిగా అచ్చుబాటు కాలేదని వాపోతుంటే, ఇంకొందరు షాపు యజమాని తమని ఖాళీ చేయమన్నా చేయకుండా మొండికి పడుతుంటారు. అదేమంటే, ఆ దుకాణాన్ని లీజుకు తీసుకున్నప్పటి నుంచి తమకు బాగా కలిసొచ్చిందనీ, ఇప్పుడు ఖాళీ చేయాలంటే కష్టంగా ఉందని కంట తడి పెడతారు. నిజంగా వాస్తుకు ఇంత ప్రాముఖ్యత ఉందా? తాము పడుతున్న కష్టాలన్నింటికీ కారణం తాతల కాలం నుంచి ఉంటున్న ఇల్లే కారణమా... ఇటువంటి సందేహాలన్నింటికీ సమాధానమా అన్నట్లు హస్త సాముద్రిక శాస్త్ర నిపుణులు, భాగ్యరేఖ, భాగ్యరాశి, గోపాల్ సాముద్రికం వంటి పరిశోధనాత్మక గ్రంథాల రచయిత రాసిన ‘గృహవాస్తు’ పుస్తకం చదివితే, వాస్తు శాస్త్ర యథార్థాలపై ఒక అవగాహన ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. అంతేకాదు, అసలు వాస్తు ఎంత వరకు అవసరం అనేదానిపై శాస్త్రీయ సమాచారాన్ని ఇచ్చే ఈ గ్రంథం ప్రతి ఇంటా ఉండదగ్గది. -
వాస్తు ప్రకారం వంటగది
వంటగది అనగానే మనకు ముందుగా గుర్తువచ్చేది వంటచేసుకునే గ్యాస్ స్టవ్, చిన్న చిన్న గిన్నెలు, చేతులు కడుక్కోటానికి సింక్, అలాగే మిక్సీ, గ్రైండర్, ఫ్రిజ్, వాటర్ ఫిల్టర్... వాస్తురీత్యా వీటిని వంటగదికి ఉత్తరంవైపుగాని, ఈశాన్యంవైపుగాని, లేదంటే పడమర వాయువ్యం వైపు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక గ్యాస్ స్టౌ విషయానికి వస్తే, తూర్పు అగ్నేయంౖ వెపు తూర్పు గోడకి అనించకుండా స్టౌకి, గోడకి మధ్య ఖాళీ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. వంటగదిలో స్టౌ పెట్టే ప్లాట్‌ఫామ్, అదే ప్లాట్‌ఫామ్ మీద ఈశాన్యం వైవు సింకు ఉండటం వాస్తు రీత్యా విరుద్ధం. దీనివల్ల ఎంత సంపాదించినా నెలాఖరుకు డబ్బు కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇంటి ఇల్లాలి ఆరోగ్యం దెబ్బతినచ్చు. కాబట్టి స్టౌ ఉండే ప్లాట్‌ఫామ్‌కి, నీరు ఉండే సింకుకు మధ్య కనీసం 3 అంగుళాలు దూరం ఉండటం మంచిది. అలాగే, వంటగదికి ఆనుకోని వున్న వాష్ ఏరియాల్లో గిన్నెలు కడగటం, వాషింగ్ మిషన్స్ ఉంచటం, అక్కడ వాషింగ్ చేయటం అంత మంచిది కాదు. ఆగ్నేయంలో నీటివాడకం ఎంత తక్కువగా వుంటే అంతమంచిది. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు. కుటుంబ సభ్యులమధ్య మనస్ఫర్ధలు రావచ్చు, ఆరోగ్యం దెబ్బతినొచ్చు. కాబట్టి వాషింగ్ ఉత్తర దిశవైపు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు వంటగదిలో రిఫ్రిజిరేటర్‌ను ఏర్పాటుచేయకపోవటం మంచిది, తప్పదంటే దక్షిణ పడమర మూలల్లో గోడలకి తగలకుండా ఉత్తర ముఖంగా ఏర్పాటు చేసుకోవాలి. చివరిగా రోజూ వంటచేసే స్టౌని ఉదయానే శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాతే వంటచేయండి, అలా చేయటం వల్ల, ధనానికి లోటుండదు. -
వస్తువు బాగు కోసమే వాస్తు...
మన శరీరం పాంచభౌతికమైనది. అంటే నింగి, నేల, గాలి, నీరు, నిప్పు అనే పంచభూతాలతో నిర్మితమైంది. మనిషి జీవించే గృహం కూడా అలాగే ఉండాలి. ఇంటి వాస్తు సక్రమంగా ఉంటే, పంచభూతాలు తమ అనుకూల ప్రకంపనలతో ఇంటిని నందనవనం చేస్తాయి. ఇంటి వాస్తు ప్రభావం ఆ ఇంటిలో ఉండే వారిమీదే ఉంటుంది. అసలు తూర్పుదిక్కుకే వంట గది ఎందుకు? ఉత్తరదిక్కునే నగదు పెట్టుకోవడం ఎందుకు? ఈశాన్య దిక్కునే దేవుడి గది ఎందుకు? ఉత్తర దిశగా తల పెట్టుకుని ఎందుకు పడుకోకూడదు... ఇలాంటి వాటన్నింటికీ నిపుణులు సేహేతుకమైన కారణాలు కనిపెట్టారు. ఉదాహరణకు సూర్యుడు ఉదయించే తూర్పుదిక్కున గాలీ వెలుతురూ ధారాళంగా వస్తాయి కాబట్టి, ఆ దిశగా వంట గది ఉంటే వంట చేసే ఇల్లాలికి ఆరోగ్యం బాగుంటుందని, పని సులువవుతుందనీ ఉద్దేశ్యం కావచ్చు. ఇక ఉత్తర దిక్కుగా తల పెట్టుకుని పడుకుంటే అయస్కాంత Ô¶ క్తి అపసవ్యంగా పని చేసి, తగిన ఆక్సిజన్ అందక, నిద్రసరిగా పట్టదని, నెగటివ్ ఆలోచనలు చుట్టుముడతాయనీ రుజువైంది. ఒక్క ఇంటి వాస్తే కాకుండా, ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే పరిసరాల ప్రభావం కూడా ఆ ఇంటిమీద ఉంటుందని వాస్తు శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి పరిసరాల వాస్తును కూడా పరిగణనలోకి తీసుకోవాలంటారు. ఇవన్నీ కూడా సహేతుకమైన కారణాలే. అంటే వస్తువు బాగుండాలనే వాస్తు చూస్తున్నారని అర్థం. -
వాస్తు, జ్యోతిషాలు మూఢనమ్మకాలు కావు
– వీటికి కులమతాలు లేవు, అందరికీ ఉపయోగపడతాయి. – రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చిన జ్యోతిష, వాస్తు నిపుణులు రాజమహేంద్రవరం కల్చరల్ : వేదాంగమైన జ్యోతిషం, వాస్తు మూఢనమ్మకాలు కావని శ్రీచక్రవాహినీ సహిత శ్రీమహాలక్ష్మీసమేత చిన్న వేంకన్నబాబు స్వామివారి పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు పేర్కొన్నారు. విజయవాడకు చెందిన భారతీయ జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం పీఠంలో జరిగిన రాష్ట్రస్థాయి వాస్తు–జ్యోతిష అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ కులమతాలకతీతంగా అందరికీ ఉపయోగపడేవి వాస్తు జ్యోతిషాలని, ఈ సదస్సులో ఎవరి అభిప్రాయాలను తిరస్కరించబోమని, అన్నింటి మధ్య సమన్వయం సాధించే దిశలో ఇది ఒక చిరుప్రయత్నమని అన్నారు. విజయవాడ నుంచి వచ్చిన ‘త్రికాలజ్ఞాన విభూషణ’ పుచ్చా శ్రీనివాసరావు మాట్లాడుతూ గృహనిర్మాణ వాస్తు ధర్మాలను దేవాలయాలకు ముడిపెట్టి, తిరుమల కొండపై వాస్తు బాగుంది, శ్రీకాళహస్తి ఆలయం వాస్తులోదోషాలు ఉండడం వల్ల ఆదాయం అంతగా లేదనే వ్యాఖ్యలను చేయరాదన్నారు. యుగధర్మాన్ని అనుసరించి ఒక్కో సమయంలో ఒక్కో ఆలయం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుందని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడేనికి చెందిన ‘వాస్తు విజ్ఞాన భాస్కర’ పళ్ళావఝుల శ్రీరామకృష్ణ శర్మ మాట్లాడుతూ వాస్తు గురించిన అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయన్నారు. భోజుడు రచించిన సమరాంగణ సూత్రగ్రంథాన్ని అనుసరించి పడమర దిక్కున బావులు ఉండడం దోషం కాదని, మానసార మహర్షి రచించిన మానసారము గ్రంథాన్ని అనుసరించి ఈశాన్యంలో మెట్లు ఉండవచ్చని అన్నారు. ఈ సందర్భంగా మాయాబజారు సినిమాలో ‘శాస్త్రం సొంత తెలివి లేనివారికి’ అని రమణారెడ్డి శిష్యులు వ్యాఖ్యానించడాన్ని పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. జ్యోతిష విశారద పాలపర్తి శ్రీకాంతశర్మ జ్యోతిషం–ప్రత్యక్ష పరిశీలన అనే విషయంపై ప్రసంగించారు. వక్తలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయా అంశాలను వివరించారు. అనంతరం జ్యోతిషరంగానికి పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయనకు ‘జ్యోతిష నిధి’ బిరుదాన్ని అందజేశారు. పొడగట్ల పల్లి గ్రామానికి చెందిన పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్య శర్మను వ్యాసపురస్కారంతో సత్కరించారు. సర్వేజనాసుఖినోభవంతు చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ ధరణికోట వెంకట హైమావతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జ్యోతిష, వాస్తు పండితులు హాజరయ్యారు. -
ఆత్మహత్యల ఠాణాకు వాస్తు దోషం?
సిద్దిపేట: జిల్లాలోని కొండపాక మండలం కుకునూరుపల్లి పోలీస్టేషన్‌కు వాస్తు దోషం పట్టిందా?. అవుననే చెబుతున్నారు పోలీసులు. ఈ స్టేషన్లో పది నెలల వ్యవధిలో ఇద్దరు ఎస్‌లు ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. అయితే పోలీస్‌స్టేషన్‌కు వాస్తు దోషం పట్టినట్టు భావిస్తున్న పోలీసుల అధికారులు ఇప్పటికే గోడలు, ప్రహరీలు కూల్చి మార్పులు చేయిస్తున్నారు. తాజాగా స్టేషన్ ఆవరణలోని 40 ఏళ్ల క్రితం నాటి మహా వృక్షాలను సోమవారం నరికి వేయించారు. -
వాస్తు కోసం..
కోర్నపల్లె(కొలిమిగుండ్ల): ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం. ప్రధానంగా వాస్తును నమ్మేవారు కోకొల్లలు. ప్రధానంగా ఇంటి నిర్మాణం విషయంలో దీన్ని ఎక్కువగా పాటిస్తుంటారు. వాస్తు కోసం దేనికైనా సిద్ధపడే వారూ ఉన్నారు. ఈకోవలోనే కోర్నపల్లెకు చెందిన ఓబయ్య తన ఇంటికి ఎదురుగా వీధి పోటు ఉందనే కారణంతో నమ్మకస్తుడైన వాస్తు సిద్ధాంతి సూచన మేరకు ఇంటి ముందు 20 అడుగులు ఎత్తు, 9 అడుగుల వెడల్పున రాతితో కట్టడం నిర్మించారు. వాటిపై ఆంజనేయస్వామి బొమ్మను గీయించారు. అటు వైపు వెళ్తున్న వారంతా చిత్రాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
గ్రహబలమా.. ప్రజాబలమా!
రెండోమాట ఎత్తుగడల ద్వారా అందివచ్చిన అధికారాన్ని వినియోగించి, సొంత నమ్మకాల కోసం వాస్తు పేరిట సచివాలయాలను, అధికార నివాసాలను కూలగొడుతున్నారు. వాటి స్థానంలో మళ్లీ కొత్త నిర్మాణాలు చేపట్టి ప్రజా సంక్షేమానికి సంబంధించి తక్షణం చేపట్టవలసిన పథకాలను పక్కన పెడుతున్నారు. ఇంటి నుంచి కదిలితే వాస్తు. సచివాలయంలో తమ గదులలోకి ప్రవేశించడానికి వాస్తు. కుర్చీలో కూర్చోవడానికి ముందు వాస్తు, తరువాత ముహూర్తం. ‘‘నువ్వు భగవంతుడిని చూశావా? ఆయన్ను చూస్తే గుర్తు పట్టగలవా?’’ ‘నేను చూడలేదు. ఆయన కనిపించినా గుర్తు పట్టలేను!’’(డాక్టర్ వాల్పోల రాహుల గ్రంథం ‘వాట్ ది బుద్ధ టాట్’ నుంచి) ఒక సంశయవాదికీ, ఒక తాత్వికునికీ మధ్య సాగిన ఈ సంభాషణకు తోడు ‘హైందవ ఉగ్రవాదంతో ప్రారంభమైన పచ్చి ఉన్మాదమే కులతత్వం’ అన్న వివేకానందుని ప్రవచనాన్ని కూడా జోడిస్తే నేటి పాలకలోకంలో, మేధా వులమని అనుకుంటున్న చాలామందిలో పేరుకుపోయిన మూఢ విశ్వాసా లకు కారణాలు తెలుస్తాయి. భారతీయులను దెబ్బతీసిన మూఢ విశ్వాసా లలో ‘జ్యోతిష్యం’ కూడా ఒకటి అని తెగేసి చెప్పినవారు కూడా వివేకానం దుడే. ‘తమసోమా జ్యోతిర్గమయ’ (చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించు) వంటి బోధలు ఉన్న ఉపనిషత్ సారాన్ని పక్కనపెట్టి మన పాలకులు, విద్యా వంతులు గతి తప్పి వెలుగు నుంచి చీకటిలోకి ఎందుకు ప్రయాణిస్తున్నట్టు? నమ్మకాలే సర్వస్వం గాంధీజీ 120 ఏళ్లు జీవిస్తారని ఒక ప్రపంచ స్థాయి జ్యోతిష్కుడు నిర్ణయిం చాడు. కానీ జాతకంతో నిమిత్తం లేకుండా కొన్ని దశాబ్దాలకు ముందే నాథూ రాం గాడ్సే ఆయనను హత్య చేశాడు. జాతకాలూ, జ్యోతిష్యాలూ బాగా నమ్మే వాళ్లనీ, వారి పిచ్చి ఆనందాన్నీ దృష్టిలో పెట్టుకుని వివేకానందుడే ఒక కథను ఉదహరించాడు. ఒక రాజు ఉన్నాడు. అతడి దగ్గరకొచ్చిన జ్యోతిష్కుడు ‘మీరు ఆరు మాసాల్లోనే చనిపోతా’రని చెప్పాడు. దీనితో కుదేలైన రాజుకు ధైర్యం చెప్పడంతో పాటు, ఈ మూఢనమ్మకాన్ని పటాపంచాలు చేయాలని మంత్రి అనుకున్నాడు. ‘ఇంతకూ మీ అంతిమ ఘడియలెప్పుడో మీ జాతకం చూసుకుని చెప్పగలరా?’ అన్నాడు మంత్రి, జ్యోతిష్కుడితో. ‘పన్నెండేళ్ల తరు వాత పరలోకం చేరతాను’ అన్నాడతడు నమ్మకంగా. మంత్రి మరుక్షణం తన మొల నుంచి కత్తి తీసి ఒక్క వేటున జ్యోతిష్కుడి తల నరికాడు. ‘చూశారా రాజా! ఇతడి అబద్ధాలు! పన్నెండేళ్లకు గాని చనిపోనని చెప్పినవాడు, ఈ క్షణంలోనే చనిపోయాడు’ అని అన్నాడు. షేక్స్పియర్ నాటకరాజం ‘కింగ్ లియర్’ ద్వారా కూడా ఇలాంటి ఓ గొప్ప సత్యాన్ని ఆవిష్కరించాడు. ‘మనం చేసే చెడ్డపనులన్నిటికీ దైవమే కార ణమని అనుకుంటాం. కానీ ఒక వేశ్యావాటికనో లేదంటే పేకాట కేంద్రాన్నో నిర్వహించే దళారి ఎలా ఆత్మవంచనతో పబ్బం గడుపుకుంటాడో అలాగే మన తప్పిదాలకూ, నేరాలకూ గ్రహబలం పేరిట ఆడిపోసుకుంటూ ఉంటాం!’ దుర్వినియోగమవుతున్న ప్రజాధనం ఈ అనుభవాలూ, ఈ సూక్తులూ మరచిపోయిన నేటి పాలకులు మన ఉభయ రాష్ట్రాలలోనూ తమ స్వశక్తికి విలువ లేదని భావిస్తున్నారు. అందుకే వాస్తుకు అర్థాలు తెలియక, వాస్తు‘దోషం’ కోరలలో తలదూర్చి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎత్తుగడల ద్వారా అందివచ్చిన అధికారాన్ని వినియోగించి, సొంత నమ్మకాల కోసం వాస్తు పేరిట సచివాల యాలను, అధికార నివాసాలను కూలగొడుతున్నారు. వాటి స్థానంలో మళ్లీ కొత్త నిర్మాణాలు చేపట్టి ప్రజా సంక్షేమానికి సంబంధించి తక్షణం చేపట్టవల సిన పథకాలను పక్కన పెడుతున్నారు. ఇంటి నుంచి కదిలితే వాస్తు. సచివాల యంలో తమ గదులలోకి ప్రవేశించడానికి వాస్తు. కుర్చీలో కూర్చోవడానికి ముందు వాస్తు, తరువాత ముహూర్తం. ఒకాయన తెలుగు జాతిని చీల్చడా నికి ఢిల్లీలో లిఖితపూర్వక ఆమోదం తెలిపి వచ్చారు. ‘వాస్తుదోషం’ వెంటా డుతూ ఉండడంతో ఒక విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన భారత యువ శాస్త్రవేత్తల మహాసభకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. తరువాత సభా వేదికను విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోకి మార్చవలసి వచ్చింది. ఎందుకు? రాక రాక వచ్చిన ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందన్న భయం. లేదా అయవార వృత్తిలోని జ్యోతిష్కులు అలాంటి విపత్తు గురించి భయపెట్టడం వల్ల కూడా కావచ్చు. మొత్తానికి శాస్త్రవేత్తల సమావేశానికి ఆయన హాజరుకాలేదు. దీనితో ఆ ప్రారంభోత్సవానికి వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌తో పాటు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక జూనియర్ మంత్రి హాజరై కార్యక్రమాన్ని పూర్తి చేయవలసి వచ్చింది. మరొక ముఖ్యమంత్రి మంత్రుల కార్యాలయాలనే కాకుండా, మొత్తం సచివాలయాన్నే ఎర్రగడ్డకు మార్చాలని నిర్ణయించారు. ఎర్రగడ్డ పిచ్చాసు పత్రికి ప్రసిద్ధి. రాజధాని నగరంలోనే శుభ్రంగా నడుస్తున్న ఛాతీ రోగాల చికిత్సాలయాన్ని మరో ఊళ్లోకి మార్చేందుకు కూడా ప్రయత్నాలు ఆరంభిం చారు. మళ్లీ ఇందులో మరో ఉప ప్రహసనం- సచివాలయంలో ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించిన ‘ఎల్’ బ్లాక్‌కు వాస్తు బాగాలేదని తెలంగాణ ముఖ్య మంత్రి ఏపీ ముఖ్యమంత్రి చెవిలో ఊది, చెదరగొట్టడం. విచిత్రం ఏమిటంటే ముఖ్యమంత్రులు ఉభయులూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక, విభజన ఫలితంగా ఉభయత్రా ప్రజలకు కలిగే నష్టాలనూ, ఇబ్బందులనూ, కొత్త సమస్యలనూ గమనించకుండా అధికార అందలాల మీద, అది ఇచ్చే హోదా మీద దృష్టంతా కేంద్రీకరించే సరికి, పరిస్థితులు ముంచుకొచ్చి వాస్తునూ, నక్షత్ర బలాన్నీ నమ్ముకోవలసి వచ్చింది. వాస్తు అంటే ఏమిటి? దేశ పాలకులు విజ్ఞులని ప్రజల నమ్మకం. కానీ ‘వాస్తు’ అంటే ‘వస్తువు’ అని గాని, వస్తువు అంటే ఇల్లు అని లేదా నివాస భూమి అనిగాని వీరికి తెలి యదు. పెద్ద భవనాల నిర్మాణానికి గానీ, ఇళ్ల నిర్మాణంలో గానీ గాలి, వెలు తురు, నీరు ముఖ్యావసరాలు. ఈ సూత్రం మీద ఆధారపడే నిర్మాణ నిపు ణులు ‘ప్లాన్’ రూపొందిస్తారు. అదే ఆర్కిటెక్చర్. ఈ ప్లాన్లు గీసేవాడు వాస్తు శిల్పి. అతడికి గ్రహగతులతో గాని, రాశిఫలాలతో గాని నిమిత్తం లేదు. నిర్మా ణ ప్రక్రియలో అతడికి తోడ్పడే ప్రధాన ముడిసరుకు నిర్మాణానికి అనువైన గాలి, వెలుతురు, నీరు. వేసే పునాది కూడా ఆ మూడింట ఆధారంగానే ఉం టుంది. ఇంకా లభ్యత, సౌలభ్యత, నేల వంటి వాటిని ఆధారంగా చేసుకుని జరిగే నిర్మాణ ప్రక్రియకు నిర్దేశమే వాస్తు. నేల ఒక వాస్తవం. దీని మీద ఆధార పడినదే వాస్తు. అందుకే ఇంటిని వాస్తవ్యం, వాస్తకం, వాసగృహం, వాసము అని పిలుస్తుంటారు. ఇంతటి వ్యావహారిక సత్యాన్ని గాలికి వదిలిపెట్టి గాలీ, వెలుతురూ, నీరూ ఆధారంగా సాగే నిర్మాణ కార్యక్రమాన్ని కొందరి ఉదర పోషణకు మార్గంగా మార్చారు. పాలకులు, వారి వందిమాగధులు ఆర్థిక ప్రయోజనాల కోసం ఆ ధోరణిని పెంచిపోషిస్తూ, ఈ వ్యవహారాన్ని పక్క తోవ పట్టిస్తున్నారు. శాస్త్రీయమైన వాస్తు అలా పెడదారులు కూడా పట్టింది. రాజ్యాంగ ఉల్లంఘన కాదా! పాలకులంతా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం పౌర బాధ్యతగా నిర్దేశిస్తున్నట్టు, ‘‘మత, ప్రాంతీయ, వేర్పాటువాద, భాషపరమైన, సంకుచిత భావాలకు అతీతంగా’’(51-ఎ-ఇ) వారంతా నడుచుకోవాలి. ‘‘శాస్త్రీయ దృక్పథాన్నీ, మానవతావాదాన్నీ, జిజ్ఞాసనూ, సంస్కరణ వాదాన్నీ ప్రజలలో పెంపొందించే విధంగా’’ (51-ఎ-హెచ్ క్లాజ్) వారు వ్యవహరిం చాలి. ఈ రాజ్యాంగ విధిని వారు నిర్వర్తించడం లేదు. కాబట్టి నాయకుల నమ్మకాల మీద జరిగే కార్యకలాపాలు, ఖర్చులు రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తాయి. ఈ వరస తప్పిన వ్యవస్థలో కొందరు న్యాయవాదులు, న్యాయమూ ర్తులు కూడా ఉండడం మరింత శోచనీయం. వ్యక్తుల విశ్వాసాలను రాజ్యాంగ విరుద్ధమైన బహిరంగ విన్యాసాలుగా మలచకూడదు. సార్వకాలిక పునాది ‘అధికారానికి పునాది ప్రజలు ఉంచిన విశ్వాసమే. ప్రజలు తాము నమ్మి ఎన్నుకున్న వాడి చేతుల్లో అధికారం ఉంచారు. దానికి జవాబుదారీతనం గద్దె నెక్కి కూర్చున్నవాళ్లదే. కాబట్టి ప్రజల కోసమే ఆ అధికారాన్ని వినియోగిం చాలి’ అంటాడు ఇంగ్లండ్ అలనాటి ప్రధాని డి జ్రే యిల్. ‘‘ప్రతి సాధికార గణ తంత్ర వ్యవస్థకూ ఇదే సార్వకాలికమైన పునాది’’ అని జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ చెప్పిన మాటలలో ఎంతో వాస్తవం ఉంది. రాజ్యాంగం ఇచ్చిన పరిధిలో పాలన సాగించడానికి పాలకులకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఇవన్నీ పరిపా లన సవ్యంగా సాగించడానికి ఇచ్చిన హక్కులు. వీటితో పాటు రాజ్యాంగం ఆదేశించిన బాధ్యతలను కూడా పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు గదులను మార్చుకోవడం, గుమ్మాలూ కిటికీలు మార్చడం, వాస్తు పేరిట ఉన్నవాటిని ధ్వంసం చేయడం, వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించడం, ఆ పనికి ప్రజా ధనాన్ని వెచ్చించడం సరికాదు. వివేకానందులే అన్నమాటలను ఒక్కసారి ఇక్కడ గుర్తుచేసుకుందాం. ‘నీ జాతి జవజీవాలతో నిలదొక్కుకోవాలంటే మూఢ విశ్వాసాల నుంచి బయటపడాలి. ఈ భూమ్మీద నాకు ఇంత అన్నం పెట్టలేని దేవుడిని నేను నమ్మలేను. ఈ పేద భారతదేశాన్ని సనాతన శక్తిగా మలచాలి. నిరుపేదల పొట్ట నింపాలి. వారికి విద్య అందాలి. మతాచారాల పురోహితవర్గం మనకొద్దు.’ (వ్యాసకర్త మొబైల్: 9848318414) -
ఇదే మనముందు ఉన్న ప్రశ్న: కోదండరామ్
హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధి నమూనాపై ప్రొఫెసర్ కోదండరామ్ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రతి బస్తీలో కనీస అవసరాలు తీర్చే నమూనా రావాలన్నారు. అభివృద్ధిలో ప్రజలను మమేకం చేసేలా ఇంకా లోతుగా ఆలోచనలు చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని కింద నుంచి పైకి చూడాలా? పైనుంచి కిందకు చూడాలా? అన్నది మన ముందు ఉన్న ప్రశ్న అన్నారు. మన వాస్తు సరిగ్గా లేనప్పుడు మనకు ఎవరు పరిష్కారం చూపాలన్నది ఇప్పుడు ప్రధాన సమస్య అని కోదండరామ్ పేర్కొన్నారు. -
ఆకలి కేకలు.. ఆశల సౌధాలు
వందల అంతస్తుల భవనాలతో విశ్వనగరాలు సిద్ధమయ్యేసరికి వాటిలో నివసించడానికి మనుషులంటూ ఉండాలని ఏలినవారు ఎందుకు మరచిపోతున్నారు? సచివాలయం తరలింపునకు కారణం వాస్తు దోషమేనని ప్రభుత్వమే చెబుతోంది. వాస్తు వంటి నమ్మకాలు వ్యక్తిగతం కావాలే తప్ప, వాటిని రాష్ర్టంపై రుద్దడం సరికాదు. కేసీఆర్ వ్యక్తిగతంగా ఎన్ని మొక్కులైనా మొక్కుకోవచ్చు, సొంత డబ్బుతోనో, పార్టీ నిధులతోనో తీర్చుకోవచ్చు. అంతేగానీ ఏలికల వ్యక్తిగత విశ్వాసాల కోసం, విలాసాల కోసం ప్రజాధనం వెచ్చిస్తామంటే కుదరదు. ‘‘తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు జిల్లా భవిష్యత్తు’’ అన్న అంశం పై ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో పౌరహక్కుల నేత ప్రొఫె సర్ హరగోపాల్ మాట్లాడుతూ విలువలేని మెటల్ లాంటి తెలంగాణ కాదు, మనిషి మనిషిగా బ్రతికే రాష్ర్టం కావాలని అన్నారు. బంగారు తెలంగాణ అనే భావజాలంలోనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకోవాలంటే ముందుగా సమస్యల జాబితా తయారు చేసుకోవాలని అన్నారు. అయితే అదేమంత తేలికైన విషయం కాదని, ఎంతో జాగ్రత్తగా ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సదస్సులో మాట్లాడిన పెద్దలంతా తెలంగాణ రాష్ర్ట సాధన ఆకాంక్షను తమ ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో నిండుగా నింపుకున్న వారే. అదే రోజున, అదే సమ యంలో హైదరాబాద్‌లోనే మరో చోట ‘‘తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేం ద్రం,’’ జన విజ్ఞాన వేదికతో కలసి ‘‘శాస్త్రీయత - అశాస్త్రీయత’’ అన్న అం శంపై ఏర్పాటు చేసిన సదస్సులో జస్టిస్ చంద్రకుమార్ తదితర పెద్దలు... ప్రభుత్వం తరఫున మొక్కులు తీరుస్తామనడం, వాస్తు పేరిట కోట్ల రూపా యల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తామనడం సరికాదని వ్యాఖ్యానించారు. వృద్ధుల వ్యథలతోనే కలల సాకారమా? సరిగ్గా ఈ రెండు సదస్సులు జరుగుతున్న సమయంలోనే నేను వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలం బొల్లికుంట గ్రామంలో బోజ్జం పెద్ద వెంకటయ్య అనే 72 ఏళ్ల వృద్ధుడితో మాట్లాడుతున్నా. వెంకట య్య ముదిరాజ్ కులస్తుడు. వృత్తిరీత్యా నీరటిగాడు. తెలంగాణలో నీరటి దనం వంశపారంపర్యంగా వస్తుంది. అయితే ఆయన వంశంలో అన్నదమ్ము లు, వాళ్ల పిల్లలు కలసి సంఖ్య ఎక్కువ కావడంతో వెంకటయ్యకు ఎనిమిదేళ్ల తరువాత ఈ ఏడు మళ్లీ నీరటి పని దక్కింది. వృద్ధాప్యం కారణంగా శక్తి చాలని వెంకటయ్య ఆ పని తన రెండో కొడుకుకు ఇచ్చేశాడు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడటానికి ముందు, నెలా నెలా అందే 200 రూపాయల ప్రభుత్వ పింఛన్‌తో ఆయన నెట్టుకొచ్చేవాడు. అది కాస్తా తర్వాత ఆగిపోయింది. పింఛన్ వస్తుందో, రాదో తెలియదు. ఈ వయసులో ఎట్లా బ్రతకాలో అర్థం కాదు. ఏం చెయ్యాలని అడగడానికి వెంకటయ్య నా దగ్గరికి వచ్చాడు. తల్లిదం డ్రులిద్దరినీ పోషించే స్థోమత కొడుకులకు లేదు. వెంకటయ్యలాంటి సంపాద నాపరులైన పిల్లలుగల వృద్ధులకు పింఛన్లక్కర్లేదన్నట్టు ప్రభుత్వం విపరీత వాదనకు దిగుతోంది. కొడుకుల ఆదాయం నుంచి కొంత తల్లిదండ్రులకు అం దేట్టు చర్యలు తీసుకుంటామని కూడా అంటున్నది. దీనివల్ల కుటుంబ సంబం ధాలు చెడిపోవడం తప్ప మేలు మాత్రం జరగదు. ఎప్పుడో నిర్మాణం జరిగే బంగారు తెలంగాణ గురించి వెంకటయ్యకు తెలియదు. భార్యాభర్తలిద్దరూ రెండుపూటలా ఇంత ముద్ద తిని, గౌరవంగా బతకగలిగితే అదే ఆయనకు బం గారం. పాలమూరు సదస్సులో హరగోపాల్ లాంటి పెద్దలు చెప్పింది అదే. ఆరు వేలకుపైగా జనాభా కలిగిన బొల్లికుంట మొదటి నుంచీ ఎంతో చైతన్యవంతమైన గామం. వరంగల్ కోట గోడను ఆనుకుని ఉండే ఆ గ్రామ పంచాయితీని ఇటీవలే వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో కలిపేశారు. తెలంగాణ ఉద్యమంలో అది నేడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వెంట నడి చిన గ్రామం. వెంకటయ్య సహా ఆ గ్రామానికి చెందిన 900 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ కోసం కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని ఆశగా ఎదురు చూశారు. రకరకాల విన్యాసాల తరువాత వారిలో 200 మందికి మాత్రమే పింఛన్ మంజూరు అయింది. వెంకటయ్యసహా మరో 700 వందల మంది పింఛన్ వస్తుందో, రాదో తెలియని అగమ్యగోచరస్థితిలో జీవిస్త్తున్నారు. వారంతా తెలంగాణ ప్రజలే, పరాయి రాష్ర్ట పౌరులు కారు. ఇటీవలే ఆ గ్రామం సందర్శించిన స్థానిక శాసనసభ్యులు ధర్మారెడ్డికి, అధికార గణానికి వారి పరిస్థితి తెలుసు. బొల్ల్లికుంట ఒక ఉదాహరణ మాత్రమే. ఇది పది తెలంగాణ జిలాల్లోని వేలాది గ్రామాల్లోని లక్షలాది మంది వెంకటయ్యల దైన్యస్థితికి మచ్చుతునక. పింఛన్లు రావేమోనని, రేషన్ కార్డులు తీసేస్తారేమోనని బెంగతో గుండెపగిలి చనిపోయిన ఘటనల గురించి ఈ తొమ్మిది నెలల కాలంలో పలు వార్తలు విన్నాం, చదివాం. ఆంధ్ర పాలకులు ధ్వంసం చేసిన తెలంగాణ పునర్నిర్మాణానికి సమయం కావాలి కదా, ప్రణాళికలు రచిస్తు న్నాం కదా అంటే చెల్లదు. ఆ దూర దృష్టి ఎన్నికలకు ముందే ఉండాల్సింది. రూ. 200 పింఛన్ తీసుకుంటున్న నిస్సహాయులకు వెయ్యి రూపాయలు ఇస్తామని ఆశ చూపాల్సింది కాదు. వెనుక నుంచి ముందుకు నడక! కోదండరామ్ సూచించినట్టే రాష్ట్ర ప్రభుత్వం సమస్యల జాబితాలను తయా రు చేసుకునే తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకున్నా... వందలాది అంత స్తుల భవనాలను నిర్మించి, విశ్వనగరాలను తయారుచేసేసరికి వాటిలో నివసించడానికి మనుషులంటూ ఉండాలని ఏలిన వారు ఎందుకు మరచిపో తున్నారు? ముందుగా ప్రజల కనీస అవసరాలు తీర్చి, ఆ తరువాత విశ్వ నగరాల నిర్మాణానికి ఆలోచనలు చేస్తే మంచిది. తెలంగాణ ప్రభుత్వం వెనక నుండి ముందుకు నడిచే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఆ కోణం నుంచే రాష్ర్ట మంత్రివర్గ సమావేశం గతవారం తీసుకున్న నిర్ణయాలను చర్చించవలసి ఉన్నది. వాటిలో కొన్ని అభ్యంతరకరమైనవి కాగా, మరి కొన్ని వివాదాస్పదమైనవి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అనే రెండే అంశాలు తలలో గూడు కట్టుకుపోవడం వల్లనే ప్రభుత్వం ఇలా అస్తవ్యస్త నిర్ణయాలు చేస్తోం దనే అభిప్రాయం సర్వత్రా వినవస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు చెపుతున్నట్టు ఆ రెండు నగరాల్లో ఒకటి డల్లాస్, మరొకటి న్యూయార్క్ నగరాలయితే సంతోషమే. కానీ ప్రజల కనీస అవసరాలను పట్టించుకోకుండా ఇలా అర చేతి స్వర్గాలను చూపిస్తే ప్రజలు నమ్మరు. నేతల నమ్మకాలను ప్రజలపై రుద్దుతారా? హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఉన్న సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చి, అక్కడి ఛాతీ వ్యాధుల కేంద్రాన్ని 70 కిలోమీటర్ల దూరాన ఉన్న వికారాబాద్‌లోని అనం తగిరి కొండల మీదికి తరలించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. పరి పాలనా సౌలభ్యం కోసం సచివాలయాన్ని మరింత విశాలంగా కట్టుకోవా లంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. సచివాలయం తరలింపునకు కారణం వాస్తు దోషమేనని ప్రభుత్వమే చెబుతోంది. వాస్తు, జ్యోతిష్యం వంటి నమ్మ కాలు వ్యక్తిగతం కావాలె తప్ప, ప్రభుత్వాలు వాటిని రాష్ర్టం మీద రుద్దడం సరికాదు. ప్రస్తుత సచివాలయ భవన సముదాయానికి వాస్తు దోషం ఉన్న మాట నిజమే కానీ, దానిని కొన్ని మార్పు, చేర్పులతో సరిచేసి, అక్కడి నుంచే నిరభ్యంతరంగా పాలన సాగించవచ్చునని కొందరు వాస్తు నిపుణులు చెబు తున్నారు. అలాంటి వారందరిపైనా అధికార పార్టీ వారు తమ వ్యతిరేకులనే ముద్రలు వేస్తున్నారు. పోనీ ఎర్రగడ్డ ప్రాంగణం వాస్తు బ్రహ్మాండంగా ఉం దా? అంటే అక్కడ ఇంతకంటే ఘోరమైన వాస్త్తు దోషాలున్నాయని ఆ రంగం లోని నిపుణులే చెబుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి భారీ వ్యయంతో నిర్మించిన నూతన సచివాలయాన్ని తరువాత అధికారం లోకి వచ్చిన జయలలిత ఉపయోగించకుండా వదిలేసిన వైనం రాష్ట్ర ప్రభు త్వానికి, ముఖ్యమంత్రికి తెలియదని అనుకుందామా? లేక ఈ సృష్టి అంత రించే వరకూ టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని ఏ జ్యోతిష్యులైనా చెప్పా రా? లేకపోతే వికారాబాద్‌లో ఉన్న నిజాం కాలంనాటి క్షయవ్యాధి చికిత్సా కేంద్రం ప్రస్తుతం ఎలాంటి దుస్థితిలో ఉందో తెలిసి కూడా, అక్కడికే ప్రజ లకు అందుబాటులో ఉన్న ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆస్పత్రి సముదాయాన్ని తరలించాలని ఎందుకు భీష్మించుకు కూచున్నట్టు? ఎవరినీ ఒప్పించ లేని ఈ నిర్ణయం వెనక వేరే కారణాలు ఉన్నాయన్న అపవాదాన్ని లేదా విమర్శను ప్రభుత్వం మొండిగా ఎందుకు మోస్తున్నట్టు? ప్రజలకు ఐదేళ్ల పాటూ తాత్కా లిక ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు తమ నమ్మకాలను ఇలా ప్రజల నెత్తిన రుద్ద్దుతామనడం సమంజసం కాదు. ఇక తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమం జరుగుతున్న కాలంలో తాను మొక్కిన దేవుళ్లందరికీ ప్రజాధనం వెచ్చించి మొక్కులు తీర్చాలని ముఖ్య మంత్రి తన మంత్రివర్గం చేత నిర్ణయం చేయించారు. తిరుపతి వెంకన్నకు, విజయవాడ కనకదుర్గకు, వరంగల్ భద్రకాళికి, శ్రీశైలం మల్లన్నకు ఇంకా ముక్కోటి దేవతలకు కేసీఆర్ మొక్కుకుని ఉండొచ్చు. వాటికి, రాష్ట్ర ముఖ్య మంత్రికి ఏ సంబంధమూ లేదు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యక్తిగతంగా ఎన్ని మొక్కులైనా మొక్కుకోవచ్చు, తన సొంత డబ్బుతోనో లేదా తమ పార్టీ నిధులతోనో నిరభ్యంతరంగా వాటిని తీర్చుకోవచ్చు. అంతేగానీ ఏలికల వ్యక్తి గత విశ్వాసాలకోసం, విలాసాలకోసం ప్రజాధనం వెచ్చిస్తామంటే కుదరదు. డేట్లైన్ హైదరాబాద్: దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com -
ఇద్దరు ‘చంద్రు’లకు వాస్తుపిచ్చి
సమాచార టెక్నాలజీ, బయో టెక్నాలజీలు మానవ జీవనగతిని, రీతిని అనూహ్యంగా మార్చేస్తున్న కాలమిది. శాస్త్ర విజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న నేటికాలంలో వాస్తు, జ్యోతిష్యం, జాతకం వంటి మూఢ నమ్మకాలపై విశ్వాసం ఉంచడమనేది ఎంతో సిగ్గుచేటు. ప్రజల్లో శాస్త్రీ య దృక్పథాన్ని పెంపొందించాలని రాజ్యాంగం ప్రవచిస్తోంది. కానీ అందుకు విరుద్ధంగా మన తెలుగు సీఎంలు పనిచేస్తున్నారు. చంద్ర బాబునాయుడు, చంద్రశేఖరరావులకు వాస్తుపిచ్చి బాగా పట్టుకుంది. వీరిద్దరూ వాస్తు పేరిట కట్టినవాటిని కూలగొడుతూ, మరమ్మతులు చేయిస్తూ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. ఇప్పటివరకూ సచివాలయంలో వాస్తుదోష నివారణ పేరుతో చంద్ర బాబు, కేసీఆర్‌లు కొన్ని వందల కోట్ల రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేయడం ప్రజావ్యతిరేక చర్య. బాధ్యతాయుత పదవుల్లో ఉన్న అధినేతలే ఇలాంటి పనులకు పాల్పడితే అంధవిశ్వాసాలు మరింత పెరగవా. ప్రజాసమస్యలను గాలికొదిలేసిన వీళ్లు వృథా చేసిన ధనంతో ఒక ప్రజాసంక్షేమ కార్యక్రమం అమలు చేయవచ్చు. కాబట్టి ఇకనైనా తెలుగు ముఖ్యమంత్రులు తమ నమ్మకాలను తమ ఇళ్లకు మాత్రమే పరిమితం చేసి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెడితే అందరికీ మంచిది. బి. రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూరు, నెల్లూరు -
చిరంజీవికి 'వాస్తు' ఎఫెక్ట్
ఈ మధ్య కాలంలో 'వాస్తు' బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం వాస్తు సీజన్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వాస్తు ప్రకారం తమ కార్యాలయాలు మార్పులు చేర్పులు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కూడా ఆ లిస్ట్‌లో చేరిపోయారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి ఆయన భారీ ఎత్తున మార్పులు, చేర్పులు చేయిస్తున్నట్లు సమాచారం. వెండితెర నుంచి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన చిరంజీవి అనుకున్న స్థాయిలో రాజకీయ నేతగా రాణించలేకపోయారు. సొంతపార్టీని 'హస్త'గతం చేసిన ఆయన... దానికి ఫలితంగా కేంద్రమంత్రి పదవి కూడా అందుకున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో హస్తం మట్టికరిచిపోవటంతో చిరంజీవి పరిస్థితి కూడా ఆటలో అరటిపండే అయ్యింది. దాంతో ఆయన సినిమాల్లో రీఎంట్రీపై దృష్టి పెట్టారు. తన 15౦వ సినిమా కోసం చిరంజీవి పెద్ద ఎత్తున కసరత్తే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ పూర్వ వైభవం కోసం చిరంజీవి వాస్తును నమ్మకున్నట్లు తెలుస్తోంది. వాస్తు దోషం వల్లే ఆయన రాజకీయాల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినట్లు కొందరు చెప్పారట. దాంతో చిరంజీవి వెంటనే వాస్తు నిపుణులను సంప్రదించటం వారు ఇచ్చిన సలహాను పాటించేశారు. దాంతో గత తొమ్మిదేళ్లుగా ఉంటున్న నివాసాని్న వాస్తుకు అనుగుణంగా మార్పులు చేయిస్తున్నారట. గుర్తు పట్టలేనంతగా ఆ ఇల్లు మారిపోతోంది. మరోవైపు మరమ్మతుల నేపథ్యంలో డిస్ట్రబెన్స్ కారణంగా చిరంజీవి ఫ్యామీలి హాలిడే ట్రిప్ వేసింది. చిరంజీవి తనయుడు రాంచరణ్, కోడలు ఉపాసన.. అంతా కలిసి విదేశాల్లో విహరిస్తున్నారు. వీరంతా మంగళవారం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. మరి చిరంజీవికి 'వాస్తు' ఏమేరకు కలిసి వస్తుందో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. chiranjeevi, vastu, house, cinema, చిరంజీవి, వాస్తు, నివాసం, సినిమాలు, ఇల్లు -
బాలయ్య బాబు చెప్పాడని....
బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణ సూచనలు, సలహాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. బాలయ్య సలహా మేరకు చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి స్థానంలో కొత్త ఇల్లు నిర్మించనున్నారు. డిసెంబర్లో కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇదంతా బాలకృష్ణ పర్యవేక్షణలోనే జరగబోతోంది. ఇందుకోసం ఆయన ఇప్పటికే వాస్తు సిద్ధాంతులతో చర్చలు జరిపి, వారి సూచనలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి బాలకృష్ణకు ముహుర్తాలు, వాస్తు-జ్యోతిష్యంపై నమ్మకం ఎక్కువ. ఆ విషయాల్లో ఆయన నిక్కచ్చిగా ఉంటారు. ఎన్నికల ముందు టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వాస్తు మార్పులను బాలయ్య దగ్గరుండి చేయించారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ఆయన నమ్మకం మరింత బలపడింది. దాంతో బాలకృష్ణ దృష్టి చంద్రబాబు ఇంటిపై పడింది. వచ్చే రోజుల్లో కూడా పార్టీకి మంచి జరగాలని ఆయన ఇప్పుడు దగ్గరుండి కొత్త నివాసాన్ని కట్టిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో బాబు ఇదే ఇంటిలో ఉన్నారు. అయితే సందర్శకుల తాకిడి ఎక్కువ కావటంతో సమావేశాలు నిర్వహించేందుకు కూడా ఇబ్బందిగా మారటంతో ఆ ఇంటిని పడగొట్టి కొత్త ఇల్లు నిర్మించాలని తలపెట్టారట. అప్పటివరకు చంద్రబాబు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో గానీ, మదీనాగూడ ప్రాంతంలో గానీ తాత్కాలికంగా ఉంటారని చెబుతున్నారు. త్వరలోనే బాలయ్య, బాబు కుటుంబంలోకి ఓ బుజ్జాయి రానున్న నేపథ్యంలోనే ఈ కొత్త ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు మరో కథనం. లోకేశ్, బ్రాహ్మణి త్వరలో అమ్మానాన్నలు కాబోతున్న విషయం తెలిసిందే. దాంతో చిన్నారి ఆడుకునేందుకు వీలుగా ఉండేలా కొత్త ఇల్లు కట్టబోతున్నారట. తాతయ్యలుగా ప్రమోట్ అవుతున్న బావా బావమరుదులు వాస్తుతో పాటు వచ్చే అతిథి కోసం ఈ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అసెంబ్లీలో వాస్తు మార్పులపై కేసీఆర్ చర్చ
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి వాస్తు మార్పులపై చర్చలు జరిపారు. తెలంగాణ అసెంబ్లీలో వాస్తు మార్పులపై ఆయన శనివారం స్పీకర్ మధుసూదనాచారితో చర్చించారు. సీటింగ్ విధానంపై కేసీఆర్ ..... స్పీకర్‌తో చర్చించినట్లు సమాచారం. అయితే బడ్జెట్ ప్రక్రియ అనంతరం మార్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆది నుంచి కేసీఆర్‌కు బోలెడన్ని సెంటిమెంట్లు. ఏ పని చేయాలన్న దానికో ముహూర్తం… వాస్తు వగైరా చూసుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత క్యాంపు ఆఫీసు విషయంలో కేసీఆర్ అనేక తర్జన భర్జనలు పడిన విషయం తెలిసిందే. మరోవైపు అసెంబ్లీలో పూర్తి అంశాలపై సిద్ధం కావాలని కేసీఆర్ ఆదేశించారు. లాగే మెదక్ లోక్‌సభ స్థానానాకి ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన నేపథ్యంలో దానిపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 10న రాష్ట్ర తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. -
వాస్తు బాగోలేదు.. కూల్చి పారేయ్
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత. తెలుగుదేశం పార్టీ నాయకులు, అధినాయకులు అందరూ వాస్తు పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు. అసలే ఒకపక్క రాష్ట్రం లోటులో ఉందని, కొత్త రాజధాని నిర్మాణానికి ప్రజలంతా విరివిగా విరాళాలు ఇవ్వాలని జోలె పట్టి మరీ అడుగుతున్న టీడీపీ నాయకులు.. వాస్తు పేరుతో పదే పదే భవనాలు మారుస్తూ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. చంద్రబాబు తాత్కాలికంగా పరిపాలన సాగించడానికి సచివాలయంలోని హెచ్ బ్లాకులో సీఎం కార్యాలయం కోసం దాదాపు రూ. 3 కోట్లు వెచ్చించి సర్వహంగులూ పూర్తి చేశారు. అయితే చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన సన్నిహితులు, జ్యోతిష్యులు దాన్ని పరిశీలించి వాస్తు సరిగా లేదంటూ.. సీఎం కోసం ఎల్ బ్లాకును ఎంపిక చేశారు. దాంతో హెచ్ బ్లాకులో వెచ్చించిన రూ. 3 కోట్లు వృథా అయ్యాయి. తర్వాత మళ్లీ పది కోట్ల రూపాయలు వెచ్చించి ఎల్ బ్లాకులో కొత్తగా పనులు చేపడుతున్నారు. ఇవి మూడునెలల్లో పూర్తవుతాయని, ఆ తర్వాత ఆయన అందులోకి వెళ్తారని చెప్పారు. ఇక ఆయన బాటలోనే ఆయన అనుంగు సహచరుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కూడా పయనిస్తున్నారు. తాజాగా విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో ఉమా ఆదేశాల మేరకు ఓ భవంతిని కూల్చారు. వాస్తు ప్రకారం లేదని ఆమాత్యులు హుకుం జారీ చేయడంతో అధికారులు ఆగమేఘాల మీద ఈ బిల్డింగ్‌ను కూల్చేశారు. ఈ భవనంలో రెండో అంతస్తు కోసం ఇటీవలే పదిలక్షల రూపాయల మేర ఖర్చు పెట్టాటి అధికారులు.. మంత్రి ఆదేశంతో మరోమాట మాట లేకుండా కూల్చేశారు. ఇలా టీడీపీ నాయకులు ఎవరికి తోచిన స్థాయిలో వాళ్లు ప్రజాధనాన్ని వృథా చేస్తూనే ఉన్నారు.