సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు అధికారులు వారికి తోచిన రీతిలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వాస్తును కూడా వారు అనుసరిస్తున్నారు. తాజాగా బస్‌భవన్‌కు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రధాన మార్గం వైపు ఉన్న గేటును మూసేశారు. ఈ మార్గానికి సరిగ్గా వెనకవైపు చిన్న రోడ్డుపై ఉన్న మరో గేటును వినియోగిస్తున్నారు.
చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం
సంధ్య థియేటర్ ముందు నుంచి వెళ్లే రోడ్డు ప్రధానమైంది కావడంతో ఇంతకాలంగా ఆ వైపు గేటునే ప్రధాన ద్వారంగా వినియోగిస్తూ వస్తున్నారు. అయితే ఇది దక్షిణ ముఖంగా ఉండడంతో వాస్తుకు అనుకూలంగా లేదన్న ఉద్దేశంతో తాజాగా ఈ మార్పు చేశారు. కొత్తగా వినియోగించే గేటు ఈశాన్యం వైపు ఉంది. ప్రస్తుతం వాహనాలన్నింటిని ఆ గేటు నుంచే అనుమతిస్తున్నారు. కొత్త ఎండీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన రోజున నూతన గేటులోంచే లోనికి వచ్చారు. ఇదిలా ఉండగా సజ్జనార్ రాకముందే వాస్తు మార్పు నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు దానిని అమలులోకి తెచ్చామని ఓ అధికారి పేర్కొన్నారు.
చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment