మన శరీరం పాంచభౌతికమైనది. అంటే నింగి, నేల, గాలి, నీరు, నిప్పు అనే పంచభూతాలతో నిర్మితమైంది. మనిషి జీవించే గృహం కూడా అలాగే ఉండాలి. ఇంటి వాస్తు సక్రమంగా ఉంటే, పంచభూతాలు తమ అనుకూల ప్రకంపనలతో ఇంటిని నందనవనం చేస్తాయి. ఇంటి వాస్తు ప్రభావం ఆ ఇంటిలో ఉండే వారిమీదే ఉంటుంది.
అసలు తూర్పుదిక్కుకే వంట గది ఎందుకు? ఉత్తరదిక్కునే నగదు పెట్టుకోవడం ఎందుకు? ఈశాన్య దిక్కునే దేవుడి గది ఎందుకు? ఉత్తర దిశగా తల పెట్టుకుని ఎందుకు పడుకోకూడదు... ఇలాంటి వాటన్నింటికీ నిపుణులు సేహేతుకమైన కారణాలు కనిపెట్టారు. ఉదాహరణకు సూర్యుడు ఉదయించే తూర్పుదిక్కున గాలీ వెలుతురూ ధారాళంగా వస్తాయి కాబట్టి, ఆ దిశగా వంట గది ఉంటే వంట చేసే ఇల్లాలికి ఆరోగ్యం బాగుంటుందని, పని సులువవుతుందనీ ఉద్దేశ్యం కావచ్చు.
ఇక ఉత్తర దిక్కుగా తల పెట్టుకుని పడుకుంటే అయస్కాంత Ô¶ క్తి అపసవ్యంగా పని చేసి, తగిన ఆక్సిజన్ అందక, నిద్రసరిగా పట్టదని, నెగటివ్ ఆలోచనలు చుట్టుముడతాయనీ రుజువైంది. ఒక్క ఇంటి వాస్తే కాకుండా, ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే పరిసరాల ప్రభావం కూడా ఆ ఇంటిమీద ఉంటుందని వాస్తు శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి పరిసరాల వాస్తును కూడా పరిగణనలోకి తీసుకోవాలంటారు. ఇవన్నీ కూడా సహేతుకమైన కారణాలే. అంటే వస్తువు బాగుండాలనే వాస్తు చూస్తున్నారని అర్థం.
Comments
Please login to add a commentAdd a comment