వంటగది అనగానే మనకు ముందుగా గుర్తువచ్చేది వంటచేసుకునే గ్యాస్ స్టవ్, చిన్న చిన్న గిన్నెలు, చేతులు కడుక్కోటానికి సింక్, అలాగే మిక్సీ, గ్రైండర్, ఫ్రిజ్, వాటర్ ఫిల్టర్... వాస్తురీత్యా వీటిని వంటగదికి ఉత్తరంవైపుగాని, ఈశాన్యంవైపుగాని, లేదంటే పడమర వాయువ్యం వైపు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక గ్యాస్ స్టౌ విషయానికి వస్తే, తూర్పు అగ్నేయంౖ వెపు తూర్పు గోడకి అనించకుండా స్టౌకి, గోడకి మధ్య ఖాళీ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. వంటగదిలో స్టౌ పెట్టే ప్లాట్‌ఫామ్, అదే ప్లాట్‌ఫామ్ మీద ఈశాన్యం వైవు సింకు ఉండటం వాస్తు రీత్యా విరుద్ధం.
దీనివల్ల ఎంత సంపాదించినా నెలాఖరుకు డబ్బు కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇంటి ఇల్లాలి ఆరోగ్యం దెబ్బతినచ్చు. కాబట్టి స్టౌ ఉండే ప్లాట్‌ఫామ్‌కి, నీరు ఉండే సింకుకు మధ్య కనీసం 3 అంగుళాలు దూరం ఉండటం మంచిది. అలాగే, వంటగదికి ఆనుకోని వున్న వాష్ ఏరియాల్లో గిన్నెలు కడగటం, వాషింగ్ మిషన్స్ ఉంచటం, అక్కడ వాషింగ్ చేయటం అంత మంచిది కాదు. ఆగ్నేయంలో నీటివాడకం ఎంత తక్కువగా వుంటే అంతమంచిది.
ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు. కుటుంబ సభ్యులమధ్య మనస్ఫర్ధలు రావచ్చు, ఆరోగ్యం దెబ్బతినొచ్చు. కాబట్టి వాషింగ్ ఉత్తర దిశవైపు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు వంటగదిలో రిఫ్రిజిరేటర్‌ను ఏర్పాటుచేయకపోవటం మంచిది, తప్పదంటే దక్షిణ పడమర మూలల్లో గోడలకి తగలకుండా ఉత్తర ముఖంగా ఏర్పాటు చేసుకోవాలి. చివరిగా రోజూ వంటచేసే స్టౌని ఉదయానే శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాతే వంటచేయండి, అలా చేయటం వల్ల, ధనానికి లోటుండదు.
Comments
Please login to add a commentAdd a comment