సమాచార టెక్నాలజీ, బయో టెక్నాలజీలు మానవ జీవనగతిని, రీతిని అనూహ్యంగా మార్చేస్తున్న కాలమిది. శాస్త్ర విజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న నేటికాలంలో వాస్తు, జ్యోతిష్యం, జాతకం వంటి మూఢ నమ్మకాలపై విశ్వాసం ఉంచడమనేది ఎంతో సిగ్గుచేటు. ప్రజల్లో శాస్త్రీ య దృక్పథాన్ని పెంపొందించాలని రాజ్యాంగం ప్రవచిస్తోంది. కానీ అందుకు విరుద్ధంగా మన తెలుగు సీఎంలు పనిచేస్తున్నారు. చంద్ర బాబునాయుడు, చంద్రశేఖరరావులకు వాస్తుపిచ్చి బాగా పట్టుకుంది. వీరిద్దరూ వాస్తు పేరిట కట్టినవాటిని కూలగొడుతూ, మరమ్మతులు చేయిస్తూ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. ఇప్పటివరకూ సచివాలయంలో వాస్తుదోష నివారణ పేరుతో చంద్ర బాబు, కేసీఆర్‌లు కొన్ని వందల కోట్ల రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేయడం ప్రజావ్యతిరేక చర్య. బాధ్యతాయుత పదవుల్లో ఉన్న అధినేతలే ఇలాంటి పనులకు పాల్పడితే అంధవిశ్వాసాలు మరింత పెరగవా. ప్రజాసమస్యలను గాలికొదిలేసిన వీళ్లు వృథా చేసిన ధనంతో ఒక ప్రజాసంక్షేమ కార్యక్రమం అమలు చేయవచ్చు. కాబట్టి ఇకనైనా తెలుగు ముఖ్యమంత్రులు తమ నమ్మకాలను తమ ఇళ్లకు మాత్రమే పరిమితం చేసి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెడితే అందరికీ మంచిది.
బి. రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూరు, నెల్లూరు
ఇద్దరు ‘చంద్రు’లకు వాస్తుపిచ్చి
Published Tue, Feb 3 2015 1:16 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement