సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వాస్తు నమ్మకాలు తారస్థాయికి చేరాయి. ఇల్లు, ప్లాట్లు, ఫ్లాట్లు.. ఇలా ఏదైనా కొనాలంటే వాస్తు తప్పనిసరి అయినట్లు తాజా అధ్యయ నంలో తేలింది. నగరంలోని 80% మందిలో ఇలాంటి నమ్మకాలున్నట్టు మహీంద్రా లైఫ్ స్పేసెస్ సంస్థ అధ్యయనం తేల్చింది. వాస్తు నమ్మకాల విషయంలో జాతీయ సగటు 40 శాత మైతే, గ్రేటర్ సిటీలో అంతకు రెట్టింపు స్థాయిలో వాస్తు నమ్మ కాలుండటం విశేషం.
ఐటీ ప్రొఫెషనల్స్ సైతం..
నగరంలో క్షణం తీరిక లేకుండా ఉండే, ఆధు నిక జీవనశైలి కలిగిన ఐటీ, బీపీఓ, కేపీఓ, మెడికల్ రం గాల్లోని వృత్తి నిపుణులు సైతం వాస్తు నమ్మకా లను తూ.చ. తప్ప కుండా పాటిస్తున్నట్లు ఈ సంస్థ వెల్లడిం చింది. 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయో గ్రూపుల వారు సైతం వాస్తుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. తమ ఉద్యోగం, వృత్తి వ్యాపారాలు, అదృష్టం, జీవనశైలి తదితర అంశాలపై వాస్తు బలీయమైన ప్రభావం చూపుతుందని వీరంతా భావిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది.
ఎవరి నమ్మకాలు వారివే..
ఇంటి ప్రధాన ద్వారం, రోడ్డు ఫేస్, కిచెన్, టాయిలెట్, బాల్కనీ, పూజా మందిరం, బెడ్రూమ్, వాష్ ఏరియా తదితరాలను తమకు అనుకూలమైన దిక్కుల్లో, పక్కా వాస్తు నమ్మకాలతో నిర్మించుకునే ందుకు గ్రేటర్‌వాసులు ఆసక్తి చూపుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. నిర్మాణం ఏదైనా వాస్తే ప్రధానం అన్న చందంగా మారింది ఈ నమ్మకం.
వాస్తు లేకుంటే కొనుగోలుకు ‘నో’
గ్రేటర్ పరిధిలో అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలు.. ఏవి కొనాలన్నా వాస్తు తప్పనిసరైంది. సంప్రదాయ వాస్తు విధానాల్లో సైన్స్ అంతర్భాగంగా ఉంది. ఈస్ట్, నార్త్ ఈస్ట్ తదితర దిక్కుల్లో ముఖద్వారాలుండే ఇళ్లకు గిరాకీ ఎక్కువ. వాస్తు పక్కాగా ఉంటే అధిక ధరలు వెచ్చించేందుకూ వెనుకాడటంలేదు. అన్ని వయో గ్రూపుల్లో వాస్తు నమ్మకాలు పెరిగాయి. – గుమ్మి రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment