బాలయ్య బాబు చెప్పాడని.... | Chandrababu naidu plans new house in Jubilee Hills | Sakshi
Sakshi News home page

బాలయ్య బాబు చెప్పాడని....

Published Mon, Oct 6 2014 12:19 PM | Last Updated on Wed, Oct 17 2018 4:13 PM

బాలయ్య బాబు చెప్పాడని.... - Sakshi

బాలయ్య బాబు చెప్పాడని....

బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణ సూచనలు, సలహాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. బాలయ్య సలహా మేరకు చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి స్థానంలో కొత్త ఇల్లు నిర్మించనున్నారు. డిసెంబర్లో కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇదంతా బాలకృష్ణ పర్యవేక్షణలోనే జరగబోతోంది. ఇందుకోసం ఆయన ఇప్పటికే వాస్తు సిద్ధాంతులతో చర్చలు జరిపి, వారి సూచనలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

మొదటి నుంచి బాలకృష్ణకు ముహుర్తాలు, వాస్తు-జ్యోతిష్యంపై నమ్మకం ఎక్కువ. ఆ విషయాల్లో ఆయన నిక్కచ్చిగా ఉంటారు. ఎన్నికల ముందు టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వాస్తు మార్పులను బాలయ్య దగ్గరుండి  చేయించారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ఆయన నమ్మకం మరింత బలపడింది. దాంతో బాలకృష్ణ దృష్టి చంద్రబాబు ఇంటిపై పడింది.

వచ్చే రోజుల్లో కూడా పార్టీకి మంచి జరగాలని ఆయన ఇప్పుడు దగ్గరుండి కొత్త నివాసాన్ని కట్టిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో బాబు ఇదే ఇంటిలో ఉన్నారు. అయితే సందర్శకుల తాకిడి ఎక్కువ కావటంతో సమావేశాలు నిర్వహించేందుకు కూడా ఇబ్బందిగా మారటంతో ఆ ఇంటిని పడగొట్టి కొత్త ఇల్లు నిర్మించాలని తలపెట్టారట. అప్పటివరకు చంద్రబాబు లేక్వ్యూ గెస్ట్హౌస్లో గానీ, మదీనాగూడ ప్రాంతంలో గానీ తాత్కాలికంగా ఉంటారని చెబుతున్నారు.

త్వరలోనే బాలయ్య, బాబు కుటుంబంలోకి ఓ బుజ్జాయి రానున్న నేపథ్యంలోనే ఈ కొత్త ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు మరో కథనం. లోకేశ్, బ్రాహ్మణి త్వరలో అమ్మానాన్నలు కాబోతున్న విషయం తెలిసిందే. దాంతో చిన్నారి ఆడుకునేందుకు వీలుగా ఉండేలా కొత్త ఇల్లు కట్టబోతున్నారట.  తాతయ్యలుగా ప్రమోట్ అవుతున్న బావా బావమరుదులు వాస్తుతో పాటు వచ్చే అతిథి కోసం ఈ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement