
ఆత్మహత్యల ఠాణాకు వాస్తు దోషం?
సిద్దిపేట: జిల్లాలోని కొండపాక మండలం కుకునూరుపల్లి పోలీస్టేషన్‌కు వాస్తు దోషం పట్టిందా?. అవుననే చెబుతున్నారు పోలీసులు. ఈ స్టేషన్‌లో పది నెలల వ్యవధిలో ఇద్దరు ఎస్‌లు ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. అయితే పోలీస్‌స్టేషన్‌కు వాస్తు దోషం పట్టినట్టు భావిస్తున్న పోలీసుల అధికారులు ఇప్పటికే గోడలు, ప్రహరీలు కూల్చి మార్పులు చేయిస్తున్నారు. తాజాగా స్టేషన్ ఆవరణలోని 40 ఏళ్ల క్రితం నాటి మహా వృక్షాలను సోమవారం నరికి వేయించారు.