బాలీవుడ్ బాద్‌ షా.. ఆ సెంటిమెంట్‌ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే! | Bollywood Hero Sharukh Khan Follows Number Sentiment Goes Viral | Sakshi
Sakshi News home page

Sharukh Khan: కింగ్ ఖాన్ సెంటిమెంట్‌.. పాపం వాళ్లు కూడా పాటిస్తారట!

Published Sun, Sep 10 2023 2:55 PM | Last Updated on Sun, Sep 10 2023 3:59 PM

Bollywood Hero Sharukh Khan Follows Number Sentiment Goes Viral - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా, కింగ్‌ ఖాన్ ప్రస్తుతం జవాన్‌ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.  కోలీవుడ్ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార అతనికి జంటగా నటించింది. ఇప్పటికే పఠాన్‌ చిత్రంతో సూపర్‌ హిట్‌ కొట్టిన కింగ్ ఖాన్.. మరో బ్లాక్ బస్టర్‌ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే కింగ్‌ ఖాన్ గురించి చాలామందికి తెలియని విషయం గురించి తెలుసుకుందాం.

(ఇది చదవండి: 'నేను అమ్మ గర్భంలో ఉండగా అబార్షన్‌ చేద్దామనుకున్నారు'.. స్టార్ హీరోయిన్!)

సాధారణంగా సెలబ్రిటీలకు సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. కొందరు ఏదైనా శుభకార్యం ప్రారంభించాలన్నా తప్పనిసరిగా టైం ఫాలో అవుతారు. చాలామందికి స్టార్స్‌ సైతం నంబర్‌ సెంటిమెంట్‌ను ఫాలో కావడం చూస్తుంటాం. అలా మన కింగ్‌ ఖాన్‌ కూడా నంబర్‌ సెంటిమెంట్‌ ఉన్నట్లు తెలు,స్తోంది. ఎందుకంటే ఆయనకు ఉన్న కార్ల నంబర్లే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. 

కారు మాత్రమే కాదు.. ఫోన్‌ నంబర్‌ విషయంలోనూ పక్కా సెంటిమెంట్‌ పాటిస్తాడంటున్నారు షారుక్.  తన కార్లన్నిటికీ 555 నంబర్‌నే ఆయన ఎంచుకున్నారు. అలాగే మొబైల్ నంబర్‌లోనూ 555 అనే నంబర్ ఉంటుందట. షారూక్‌ ఖాన్‌కు ఉన్న ఈ సెంటిమెంట్‌ని ఆయన కుటుంబ సభ్యులు.. స్టాఫ్‌ కూడా గౌరవిస్తూ తమ ఫోన్‌ నంబర్‌లో లాస్ట్‌ డిజిట్స్‌ 555 ఉండేలా  చూసుకుంటారని తెలుస్తోంది. ఎంతటి సూపర్ స్టార్ అయినప్పటికీ సెంటిమెంట్స్‌ పాటిస్తారనేది బాద్‌షాను చూస్తే తెలుస్తోంది. సెలబ్రిటీలే కాదు.. ప్రముఖ రాజకీయ నాయకులు సైతం సెంటిమెంట్స్‌ను పాటించడం మనం చూస్తుంటాం. 

(ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్‌ మూవీ, మరో థ్రిల్లర్‌ సిరీస్‌ కూడా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement