
ఎన్టీఆర్
జై లవ కుశ సినిమా తరువాత చిన్న గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ త‍్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే త్రివిక్రమ్ గత చిత్రం అజ్ఞాతవాసి డిజాస్టర్ కావటంతో ఎన్టీఆర్ సినిమాపై అనుమానాలు వ్యక‍్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఈ నెలాఖరున త్రివిక్రమ్ సినిమాను ప్రారంభిస్తున్నాడు ఎన్టీఆర్.
ఈ సందర్భంగా ఎన‍్టీఆర్ అభిమానులు ఓ ఆసక్తికరమైన సెంటిమెంట్‌ను తెర మీదకు తీసుకువచ్చారు. ఓ భారీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో తరువాతి సినిమా చేసిన ఎన్టీఆర్ ప్రతీసారి ఘనవిజయం సాధించాడు. హార్ట్ ఎటాక్ తో ఫ్లాప్ ఇచ్చిన పూరి జగన్నాథ్‌తో టెంపర్ సినిమా చేసి సక్సెస్ సాధించాడు ఎన్టీఆర్. తరువాత వన్ నేనొక్కడినే లాంటి డిజాస్టర్ తరువాత సుకుమార్‌తో నాన్నకు ప్రేమతో చేసి మరో విజయాన్ని అందుకున్నాడు.
సర్థార్ గబ్బర్‌సింగ్‌లాంటి భారీ డిజాస్టర్ తరువాత బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా చేసి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు అదే తరహాలో అజ్ఞాతవాసి లాంటి ఫ్లాప్ ఇచ్చిన త్రివిక్రమ్‌తో సినిమా చేస్తే ఎన్టీఆర్ ఖాతాలో మరో సూపర్ హిట్ ఖాయమని నమ్ముతున్నారు ఫ్యాన్స్. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment