
త్రివిక్రమ్ శ్రీనివాస్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. త్రివిక్రమ్ గత చిత్రం అజ్ఞాతవాసి తీవ్రంగా నిరాశపరచటంతో ఎన్టీఆర్ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు త్రివిక్రమ్.
అయితే ఎన్టీఆర్ సినిమా తరువాత త్రివిక్రమ్ చేయబోయే సినిమాపై ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గతంలో ఎన్టీఆర్ సినిమా తరువాత త్రివిక్రమ్ మహేష్ బాబు లేదా వెంకటేష్‌లలో ఒకరితో సినిమా చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ యంగ్ హీరో నానితో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసే త్రివిక్రమ్ ఇటీవల నితిన్ హీరోగా అ..ఆ.. సినిమాను తెరకెక్కించాడు. ఇప్పుడు మరోసారి యంగ్ మరీ నానితో సినిమాను రూపొందిస్తున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment