
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిరుధ్
అజ్ఞాతవాసి లాంటి భారీ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి రిలీజ్‌కు ముందే ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించారు. అదే సమయంలో ఈ సినిమాను అనిరుధ్ సంగీతమందిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అజ్ఞాతవాసి రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. సినిమా ఫెయిల్యూర్‌కు ఆడియో ఆకట్టుకునేలా లేకపోవటం కూడా ఓ కారణం అన్న టాక్ వినిపించింది.
దీంతో త్రివిక్రమ్ అండ్ టీం ఆలోచనలో పడ్డారు. ఎన్టీఆర్ సినిమాకు మరో సంగీత దర్శకుడిని తీసుకోవాలని భావిస్తున్నారట. అనిరుధ్‌ను పక్కన పెట్టి తెలుగులో వరుస మ్యూజికల్ హిట్స్ సాధిస్తున్న తమన్‌ను సంగీత దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అదే సమయంలో సంగీత దర్శకుడి విషయంలోనూ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment