అతి త్వరలో యాభయ్యో సినిమా.. | In Discussion: Comedy Hero 50th film | Sakshi
Sakshi News home page

అతి త్వరలో యాభయ్యో సినిమా..

Published Tue, Aug 12 2014 12:22 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

అతి త్వరలో యాభయ్యో సినిమా.. - Sakshi

అతి త్వరలో యాభయ్యో సినిమా..

  •  అల్లరి నరేష్
  • విశాఖపట్నం:అభిమానులే దేవుళ్లని, వారు మెచ్చుకునే చిత్రాల్లో నటిస్తానని ప్రముఖ హీరో అల్లరి నరేష్ అన్నారు. ఒక చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు యారాడ వచ్చిన ఆయన సోమవారం న్యూస్‌లైన్‌తో ముచ్చటించారు. ఇంతవరకు 47 సిని మాల్లో నటించానని, 50వ చిత్రం ప్ర త్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నానని చెప్పారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..
     
    కామెడీ ప్లస్ ఫ్యామిలీ సెంటిమెంట్

    ఇంతవరకు తెలుగులో 45, తమిళంలో రెండు చిత్రాలు చేశాను. ప్రస్తుతం నిర్మాణమవుతున్న ఈ సినిమా తర్వాత ‘బందిపోటు’ షూటింగ్ ప్రారంభమవుతుంది. అనంతరం ప్రొడక్షన్-4లో నటించాలి. నా 50వ సినిమా కామెడీతోపాటు కుటుంబ తరహా చిత్రంగా ఉండేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నాను.
     
    విభిన్న పాత్రలంటే ఇష్టం


    కామెడీ పాత్రలతోపాటు విభిన్నంగా ఉండే ఎలాంటి రోల్స్ వేయడానికైనా నేను ఇష్టపడతాను. గమ్యం, శంభో శివశంభో, విశాఖ ఎక్స్‌ప్రెస్, లడ్డూబాబు, డేంజర్, నీ ప్రేమకై వంటి పలు చిత్రాల్లో ఇలాంటి పాత్రలే పోషించాను. గమ్యంలో నా నటనకు మంచి పేరొచ్చింది.
     
    దర్శకుడ్ని కాబోయి హీరోనయ్యా..

    చిన్నప్పటి నుంచి దర్శకుడ్ని కావాలని కలలు కనేవాడిని. నాన్న ఇ.వి.వి.సత్యనారాయణ గారి ఉద్దేశం కూడా అదే. అల్లరి సినిమా దర్శకుడు రవి నాకు తొలి నుంచి మంచి మిత్రుడు. 2001లో ఆయన ప్రోత్సాహంతోనే ఆ సినిమాలో నటించా. కామెడీ హీరోగా ఇలా నిలబడిపోయా..
     
    విశాఖ అంటే ప్రాణం

    అందాలకు నెలవైన విశాఖ బీచ్ అంటే నాకిష్టం. ఇతర దేశాల్లో సాధ్యం కాని విధంగా ఇక్కడ షూటింగ్‌ను ఎంతో హాయిగా చేసుకోవచ్చు. చిత్ర నిర్మాణాలకు విశాఖ అనువైన ప్రదేశం. ఇక్కడకు చిత్రసీమ తరలివస్తే నేను వస్తాను.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement