ప్రేమలో నాకెపుడూ చుక్కెదురే.. | Have always been unlucky in love: Salman Khan | Sakshi
Sakshi News home page

ప్రేమలో నాకెపుడూ చుక్కెదురే

Published Fri, Jun 24 2016 4:40 PM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

ప్రేమలో నాకెపుడూ చుక్కెదురే..

ప్రేమలో నాకెపుడూ చుక్కెదురే..

ముంబై:   బాలీవుడ్ కండలవీరుడు  సల్మాన్ ఖాన్ తన కిక పెళ్లి యోగం లేదేమోనని బెంగ పడుతున్నాడట. ఇటీవల ఒక మీడియా సంస్థ నిర్వహిస్తున్న  రియాల్టీ షో కు విచ్చేసిన  సల్మాన్ ఈ సంచలన  వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా పెళ్లి ఎపుడు అని మీడియా ప్రశ్నించినపుడు  తాను ఆ విషయంలో ఎపుడూ దురదృష్ట వంతుడినేనని సమాధానం ఇచ్చాడట. అంతేకాదు.. పెళ్లి చేసుకోవాలని  తాను ఉవ్విళ్లూరుతున్నానని.. పడి చచ్చిపోతున్నానని ..అయితే తనకు అదృష్టం కలసి రావడం లేదని వ్యాఖ్యానించాడు.  ఎపుడూ అవతలి వ్యక్తి( అమ్మాయి)  ఆమోదం కోసం ఎదురు చూడాల్సి వస్తోందని తెలిపాడు.  పెళ్లి విషయంలో మగాళ్లు చేసేదేమీ లేదని..అంతా ఆడవాళ్లే నిర్ణయిస్తారని కమెంట్ చేశాడు.  
కాగా   బాలీవుడ్ బాచిలర్ బాబు సల్మాన్ తరచూ  ప్రేమ వివాదాల్లో నిలవడం మామూలే. గతంలో  అగ్ర హీరోయిన్లతో  ప్రేమాయణం సాగించడం.. అది పెళ్లి దాకా రాకపోవడం తెలిసిందే.  సంగీతా బిజ్లాని ,  ఐశ్వర్య రాయ్,  కత్రినా కైఫ్ తదితర స్టార్ హీరోయిన్లు ఈ కోవలోకి వస్తారు. అయితే ఇటీవల లులియా   వాంతూర్ తో పెళ్లి దాదాపు  ఖాయమనే   వార్తలు బీ టౌన్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement