- ఇక ఇంటి ముందుకు రానున్న ఆర్టీసీ బస్సు
- ప్రయాణికులను ఆకర్షిస్తున్న యాజమాన్యం
- హన్మకొండ టు హైదరాబాద్‌కు మినీ బస్సులు
- త్వరలో నడిపించేందుకు చర్యలు
- సర్వే పూర్తిచేసిన అధికారులు
సదా మీ సేవలో...
Published Sat, Sep 10 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
హన్మకొండ : ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం.. అనే నినాదంతో ముందుకుసాగుతున్న యాజమాన్యం మరో అడుగు వేసింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ఆర్టీసీ డోర్ టు డోర్ సర్వీస్‌కు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వీధి నుంచి ప్రయాణికులను తీసుకెళ్లి వారు చేరుకోవాల్సిన వాడలో దింపుతాయి. ఇందుకోసం టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం 236 మినీ బస్సులను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో సగం ఏసీ మినీ బస్సులను కూడా కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది.
ప్రయాణికులపై సర్వే
హన్మకొండ, వరంగల్‌లోని కాలనీలు, పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రోజు ఎంతమంది ప్రయాణికులు వెళ్తున్నారనే దానిపై వరంగల్ రీజినల్ అధికారులు ఇటీవల సర్వే చేపట్టారు. మొత్తం 514 మందిని సర్వే చేయగా.. అందులో ప్రధానంగా 20.62 శాతం ఉప్పల్‌కు, మహాత్మాగాంధీ బస్‌స్టేçÙన్‌కు 9.34 శాతం, సికింద్రాబాద్ జేబీఎస్‌కు 8.95 శాతం వెళ్తున్నట్లు తెలిసింది. హన్మకొండ, వరంగల్‌లో సర్వే చేయగా.. హన్మకొండ నుంచి 47.47 శాతం, వరంగల్ నుంచి 20.43, ఇతర ప్రాంతాల నుంచి 5.84 శాతం హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు తేలింది. వీరితో పాటు మరో 3,350 మంది ప్రయాణికులను సర్వే చేశారు.
వీరిలో ఎవరెవరు ఏయే బస్సులో ప్రయాణిస్తున్నారు.. ఒక్కో వ్యక్తి నెలలో ఎన్ని రోజులు హైదరాబాద్‌కు వెళ్తున్నాడు.. జిల్లాలో ఏయే స్టేజీలో బస్సు ఎక్కుతున్నారు...హైదరాబాద్‌లో ఎక్కడ దిగుతున్నారు.. దిగిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్తున్నారు అనే అంశాలపై సర్వే చేపట్టారు. ఈ మేరకు పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ మినీ బస్సులను నడిపేందుకు కార్యా చరణ సిద్ధం చేశారు. త్వరలో 16 కొత్త మినీ బస్సులు వరంగల్ రీజియన్‌కు రానున్నాయి. ఈ బస్సులు వరంగల్, హన్మకొం డలోని పలు కాలనీలు, ప్రధాన కూడళ్ల నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు నడువనున్నాయి. ఇంటి ముందు బస్సు ఎక్కి తే మరో వాహనం అవసరం లేకుండా కోరుకున్న చోట దిగే సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించనుంది. దీంతో ప్రయాణికులకు ఖర్చులు తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతోంది. కాగా, బస్సుల సమాచారం, టికెట్ బుకింగ్, రిజర్వేషన్ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. మొత్తంగా ప్రయాణికులను ఇంటి నుంచే తీసుకెళ్లి తిరిగి ఇంటివద్దనే దించే ఆలోచనలో యాజమాన్యం కసరత్తు చేస్తోంది.
వరంగల్ రీజియ¯Œæకు
16 మినీ బస్సులు
మినీ బస్సులను తొలుత హన్మకొండ–హైదరాబాద్, నిజామాబాద్–హైదరాబాద్ రూట్‌లో నడుపనున్నారు. మొదటి దశలో వరంగల్ రీజియన్‌కు 16 ఏసీ మినీ బస్సులు రానున్నాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు యాజమాన్యం ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై స్వయంగా ఆయా డిపో మేనే జర్లతో కొన్ని రోజుల క్రితం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నష్టాలను పూడ్చుకోవడంపై డిపోల వారీగా కార్యాచరణను రూపొందించుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవడంపై దృష్టి సారించారు.
అలాగే ప్రయాణికులను ఆర్టీసీ వైపు మళ్లించే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ రీజియన్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న హన్మకొండ–హైదరాబాద్ రూట్‌పై దృష్టి సారించారు. క్యాబ్‌లు, ప్రైవేట్ ట్యాక్సీకార్లలో వెళ్లే ప్రయాణికులు సైతం ఆర్టీసీ బస్సులోనే వచ్చేలా కార్యాచరణ రూపొందించారు. ప్రయాణికుడి ఇంటి ముందుకు బస్సును తీసుకెళ్లి వారిని ఆకర్షించాలనే సంకల్పంతో ముందుకుపోతున్నారు.
Advertisement
Advertisement