ten yars
-
పదేళ్లు పూర్తయిన వారందరికీ ఆధార్ నవీనీకరణ తప్పని సరి
సాక్షి,మేడ్చల్ జిల్లా: ఆధార్ కార్డు నవీకరణ గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించింది. కార్డులు పొంది పదేళ్లు పూర్తయిన వారు, ప్రస్తుతం ఉన్న కార్డులను నవీనీకరించుకోవాలని ఇప్పటికే యూఐడీఏఐ సూచించింది. ఆధార్ కార్డు నవీనీకరణకు మొదట జూన్ 14 వరకు గడువు విధించారు. అయితే ప్రజల నుంచి నామ మాత్రంగా స్పందన రావడంతో గడువును మరో మూడు నెలల పాటు పొడిగించారు. 2010–18 సంవత్సరాల మధ్య ఆధార్ కార్డులు పొందినవారు సెపె్టంబరు 14 వరకు ఉచితంగా నవీనీకరించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. రెండు రకాలుగా... ఆధార్ కార్డును మై–ఆధార్ పోర్టల్, ఎం–ఆధార్ యాప్‌లో ఉచితంగా నవీనీకరించుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న శాశ్వత ఆధార్ కేంద్రాల్లోనూ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఆధార్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు గతంలో ప్రజలు చెప్పిన వ్యక్తిగత వివరాలను మాత్రమే హడావుడిగా నమోదు చేశారు. చాలా మంది తప్పుడు సమాచారం ఇచి్చనట్లు గుర్తించారు. ప్రస్తుతం,.. గతంలో ప్రజలు వెల్లడించిన వివరాల ప్రకారం ధ్రువపత్రాలను అప్లోడ్ చేసి నవీనీకరించుకోవచ్చు. నవీనీకరణకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని ఖచి్చతంగా సమరి్పంచాల్సి ఉంటుంది. అక్షరాస్యులైతే పదో తరగతి మార్కుల మెమోను తీసుకెళ్తే సరిపోతుంది. ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఉపాధిహామీ జాబ్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, వివాహ పత్రం, తహసీల్దార్ జారీ చేసిన ధ్రువపత్రాలను తీసుకెళ్లి ఆధార్ కార్డు నవీనీకరణను పూర్తి చేసుకోవచ్చు. ఇతర మార్పులకు ఇలా... ప్రస్తుతం పదేళ్లు దాటిన వారందరూ ఆధార్ కార్డు సమాచారాన్ని నవీనీకరించుకోవాల్సి ఉంది. దీంతోపాటు పేరులో అక్షరాలను సరి చేసుకోవడానికి, ఫొటో, చిరునామా మార్పు, ఫోన్ నంబర్లలో మార్పులు చేసుకోవచ్చును. జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రస్తుతం ఆధార్ నమోదు కేంద్రాలు అందుబాటులో లేవు. నవీనీకరణకు తప్పనిసరిగా మండల కేంద్రాలకు వెళ్లాల్సి ఉండటంతో చాలా మంది ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గతంలో కొత్తగా ఆధార్ కార్డుల జారీ సమయంలో గ్రామాల వారీగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ నవీనీకరణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
మహిళ మృతి కేసులో భర్త, అత్త, ఆడబిడ్డకు పదేళ్ల జైలు
వరంగల్ లీగల్ : అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి, మహిళ మరణానికి కారకులైన నేరం రుజు వు కావడంతో చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన నేరస్తులు మ్యాదర రమేష్(భర్త), మ్యాద ర సౌందర్య(అత్త), పోతుల వసంత(ఆడబిడ్డ)కు పదేళ్ల జైలుశిక్ష, రూ.8000 చొప్పున జరిమానా విధి స్తూ సోమవారం మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి కె.బి.నర్సింహులు తీర్పు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన కాల్వ నర్సయ్య కూతురు సుకన్యకు మ్యాదర రమేష్‌తో 2013 జూన్ 2న వివాహమైంది. పెళ్లి సమయంలో రమేష్‌కు రూ.1.30 లక్షల నగదు, బంగారం వస్తు సామగ్రి కట్నకానుకలుగా ఒప్పుకున్నారు. అందులో రూ.50 వేలు తర్వాత ఇస్తామని చెప్పారు.కొద్దికాలం ఇరువురు బాగానే ఉన్నారు. తర్వాత ఇవ్వాల్సిన రూ.50 వేలతోపాటు అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు, ఆడబిడ్డలు సుకన్యను వేధించసాగారు. ఈ క్రమం లో 2015 జూలై1న అపస్మారక స్థితిలో ఉన్న సుకన్యను అంబులెన్ స ద్వారా చిట్యాల దవాఖానకు తీసుకొచ్చారు. అప్పటికే సుకన్య మృతిచెందిందని డాక్టర్ తెలిపారు. అత్తారింటి వారే వేధించి విషమిచ్చి తన కూతురిని చంపారని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో సుకన్య మరణానికి కారణం భర్త రమేష్, అత్త సౌందర్య, ఆడబిడ్డ వసంతేనని సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. దీంతో ఐపీసీ సెక్షన్ 304 (బి) కింద నేరస్తులకు పది సంవత్సరాల జైలుశిక్ష, రూ.2 వేల చొప్పున జరిమాన విధిస్తూ తీర్పును జడ్జి నర్సిం హులు వెల్లడించారు. అలాగే వివాహితను వేధింపులకు గురిచేసినందున ఐపీసీ సెక్షన్ 498(ఎ) కింద మూడేళ్ల జైలుశిక్ష, రూ.500 జరిమాన, కట్నం కోసం పీడించినందుకుగాను వరకట్న నిరోధక చట్టం సెక్షన్ 3 కింద ఆరు మాసాల జైలుశిక్ష, రూ.500 చొప్పున జరిమాన విధించారు. శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని, గతంలో గడిపిన జైలుశిక్ష కాలాన్ని మినహాయించాలని తీర్పులో పేర్కొన్నారు. కేసును ప్రాసిక్యూషన్ తరఫున పీపీ విజయాదేవి వాదించగా లైజన్ ఆఫీసర్ వి.భద్రునాయక్ విచారణ పర్యవేక్షించారు. సాక్షులను కానిస్టేబుల్ ఎం.సుభాష్ కోర్టులో ప్రవేశపెట్టారు.