Aadhaar Card Toll Free Number: భారతదేశంలో ఉన్న అందరికి తప్పనిసరిగా ఆధార్ కార్డు అవసరం, అయితే కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డులో తప్పులు దొర్లుతూ ఉంటాయి. అలాంటి తప్పులను సవరించుకోవడానికి కొన్ని సార్లు అనేక ఇబ్బదులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని కోసం ఆధార్ సెంటర్ల వద్దకు పదే పదే తిరగాల్సి కూడా వచ్చేది. అలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కేవలం మీరు ఒక నెంబర్‌కి కాల్ చేస్తే సరిపోతుంది.
టోల్ ఫ్రీ నెంబర్
ఆధార్ కార్డులో పేరు, ఇంటి పేరు, అడ్రస్ వంటి తప్పులను మార్చుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ 1947 అనే నెంబర్ తీసుకువచ్చింది. ఈ నెంబర్‌కి కాల్ చేస్తే మీ సమస్యలు ఇట్టే తీరిపోతాయి. ఈ నెంబర్‌కి కాల్ చేస్తే 12 భాషల్లో సర్వీస్ ప్రతినిధులు అందుబాటులోఉంటారు. మీ సమస్యను వారికి తెలియజేస్తే వారు తగిన పరిష్కారం అందిస్తుంది.
(ఇదీ చదవండి: ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ అథెంటికేషన్ - ప్రజలు సమ్మతిస్తారా..?)
తెలుగు, హిందీ, తమిళం, పంజాబీ, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, ఒరియా, మలయాళం, అస్సామీ, ఉర్దూ, మరాఠీ భాషల ప్రజలు ఈ నెంబర్ ద్వారా సమస్యలకు పరిస్కారం పొందవచ్చు. సంస్థ ఈ నెంబర్ అందించడానికి కూడా ఒక ప్రధాన కారణం ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది ఈ సంవత్సరంలోనే కావున ఈ నెంబర్ అందించడం జరిగింది. అంతే కాకుండా ఇది అందరికి గుర్తుండే నెంబర్ కూడా.
(ఇదీ చదవండి: ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ మర్చిపోయారా? డోంట్ వర్రీ.. ఇలా తెలుసుకోండి!)
ఇది పూర్తిగా టోల్ ఫ్రీ నెంబర్, కావున ఎలాంటి చార్జీలు వసూలు చేసే అవకాశం ఉండదు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ నెంబర్ కి కాల్ చేయవచ్చు, పరిష్కారం పొందవచ్చు. అయితే ఆదివారం రోజు మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
పేరు, అడ్రస్ మాత్రమే కాకుండా, ఆధార్ నమోదు కేంద్రాలు, ఎన్రోల్‌మెంట్ తర్వాత ఆధార్ కార్డు నంబర్ స్టేటస్ సహా ఆధార్‌కు సంబంధించి సమస్యలన్నింటికీ వారు పరిష్కారం అందిస్తారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment